పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పౌర విమానయాన కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ
కేంద్ర రాష్ట్రాలమధ్య ఈ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సమావేశం ఏర్పాటు .
Posted On:
17 OCT 2022 5:24PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పౌరవిమానయాన కార్యదర్శుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ ప్రారంభ సమావేశానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ భన్సల్ అధ్యక్షతవహించారు. ఈ సదస్సు ముఖ్యఉద్దేశం, రాష్ట్రాల పౌరవిమానయాన విభాగాలు, కేంద్రపౌర విమానయాన విభాగం మధ్య మరింత సహకారాన్ని పెంపొందింపచేసి ఈ రంగం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం.
ఈ సదస్సుపౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రారంభోపన్యాసంతో సదస్సు ప్రారంభమైంది. అనంతరం పౌర విమానయాన శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. డిజిసిఎ అధికారుల ప్రెజెంటేషన్, బిసిఎఎస్ అధికారుల ప్రజెంటేషన్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో యుడాన్ పై చర్చ, కృషి ఉడాన్, విమానయాన భద్రత, విమానాశ్రయాల అభివృద్ధి, హరిత విమానాశ్రాయలు, హెలిపోర్టులు, హెలి సేవా, వాటర్ ఎయిరో డోమ్స్ తదితరాలపై చర్చ వంటి వాటిని చేపట్టారు. ఈశాన్య ప్రాంత విభాగంఅధికారులతో వివిధ అనుసంధానతలగురించి చర్చించారు. ఎఫ్‌టిఒ, ఐజిఆర్‌యుఎ, ఆర్ జిఎన్ ఎ యు లు ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెలికాప్టర్లు, హెచ్ఇఎంఎస్, ఎం.ఆర్.ఒలు, ఎయిర్ కార్గో, డ్రోన్‌లపై ప్రెజెంటేషన్ లు ఇచ్చారు.
తన ప్రారంభోపన్యాసంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ భన్సాల్ మాట్లాడుతూ గత ఏడాది ఎంతో ప్రగతి సాధించినట్టు చెప్పారు. డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ దాదాపు కోవిడ్‌ముందరి స్థాయికి చేరుకుందని చెప్పారు.ఎన్నో కొత్త విమానాశ్రయాలు ప్రారంభించుకున్నామని, కొత్త మార్గాలను ప్రారంభించామని, డ్రోన్‌లను ప్రోత్సహించేందుకు, హెలికాప్టర్ మెడికల్ ఎమర్జెన్సీ సేవలకు, ఫ్రాక్షనల్ ఒనర్‌షిప్ వంటి వాటివిషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రాలు ఎటిఎఫ్ పై వాట్ తగ్గించాల్సిందిగా కోరారు. ఇప్పటికే వాట్‌తగ్గించిన రాష్ట్రాలను ఆయన అభినందించారు.
విమానాశ్రయాలకు మౌలిక సదుపాయాల కల్పన, ప్రత్యేకించి వివిధ విమానాశ్రాయలకు అవసరమైన భూమి, భూమిని అప్పగించడానికి సంబంధించి పెండింగ్‌కేసులు, వాట్ వంటి పన్ను సంబంధిత అంశాలు, ఎఫ్.టి.ఒ లు, ఎం.ఆర్.ఒలను ప్రోత్సహించడానికి పన్ను రాయితీలు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పౌరవిమానయాన విధానాలు, వాటిలోని అంశాలు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఒడిషా, ఎన్ఇఆర్ లు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలు, చిట్టచివరి ప్రాంతానికి అనుసంధానత వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అదనపు సెక్రటరీ శ్రీమతి ఉషా పధీ, ఎం.ఒ.సి.ఎ సంయుక్త కార్యదర్శి శ్రీమతి రుబీనా అలి, డిజిసిఎ డైరక్టర్ జనరల్ శ్రీ అరుణ్‌కుమార్, బిసిఎఎస్ డిజి శ్రీ జుల్ఫికర్ హసన్, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పౌరవిమానయాన విభాగం కార్యదర్శులు, ఆఫీసర్స్ ఇన్ చార్జ్, ప్రస్తుత సదస్సుకు సంబంధించి ఎం.ఒ.సి.ఎ, రాష్ట్రాలనుంచి స్టేక్ హోల్డర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1868888)