రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి సమగ్ర విధానాన్ని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం; అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉంది: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ప్రసంగించిన కేంద్ర రక్షణ మంత్రి


కొత్తగా పుట్టుకొస్తున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవటానికి అన్ని ఏజెన్సీలు సమీకృత విధానాన్ని అవలంభించాలన్న మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 17 OCT 2022 4:42PM by PIB Hyderabad

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అక్టోబర్ 17, 2022న  రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం (RRU) స్నాతకోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. భూ, సముద్ర సరిహద్దులువాయు స్థలంసైబర్డేటాస్పేస్సమాచారంశక్తిఆర్థిక వ్యవస్థ పర్యావరణం.. జాతీయ భద్రతలో భాగాన్ని కలిగి ఉంది. సార్వభౌమాధికారం కలిగిన దేశానికి ఈ అంశాలను రక్షించడం చాలా అవసరం. అన్ని భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూహైబ్రిడ్ వార్‌ఫేర్ పెరిగిన తరుణంలో దేశ అంతర్గత, బాహ్య భద్రతా ముప్పుల మధ్య తేడాను గుర్తించడం కష్టతరంగా మారిందని తెలిపారు. తాజా సాంకేతిక పురోగతులు జాతీయ భద్రతకు ముప్పుల స్వభావాన్ని విస్తరించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని ఆయన అన్నారు.

 

 “అంతర్గత బాహ్య భద్రత మధ్య రేఖను చెరిపేసే పలు కొత్త రకాల బెదిరింపులు తెరపైకి వస్తున్నాయి. ఉగ్రవాదంతో పాటుసైబర్ వార్ తో పాటు ఇన్ఫర్మేషన్ వార్ భద్రతా బెదిరింపుల నూతన రూపాలు. అదనంగామానవ అక్రమ రవాణా మరియు మనీలాండరింగ్ వంటి సమస్యలు ఉన్నాయి. ఇవి రూపానికి భిన్నంగా ఉంటాయికానీ ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని ఏజెన్సీలు సమగ్ర పద్ధతిలో పని చేయాలి” అని రక్షణ మంత్రి అన్నారు.

భారత్ ఎప్పుడూ దేశ భద్రతపై చేసే దాడులను సమర్ధవంతంగా ఎదురుకుంటోందని కేంద్రమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ ఆత్మరక్షణకు సంబంధించిన గొప్ప సంప్రదాయం మరే దేశానికి లేదని తెలిపారు. ఆత్మరక్షణ మరియు భద్రతకు సంబంధించిన గొప్ప సంప్రదాయాన్ని దెబ్బతీసిన బానిస మనస్తత్వం యొక్క ప్రభావాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రక్షణ మంత్రి మానవీయ విలువల యొక్క ప్రాముఖ్యతను స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులకు నొక్కిచెప్పారుఇది ఒక వ్యక్తి పాత్రను నిర్మించే అత్యంత ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. విద్యార్థులు మానవతా విలువలతో ముడిపడి ఉండాలనివారి నిర్మాణ స్వభావానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.

భారతదేశాన్ని ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని రక్షణ మంత్రి ప్రశంసించారు. భారతదేశం 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో అత్యంత శక్తివంతమైన దేశాల సరసన భారత్ ను చేర్చడంలో పౌరులు తమ వంతు పాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగానంతరండిగ్రీ పట్టా పొందిన విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపారు. విద్యార్థులు దేశ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయ విజయంలో ఆర్ఆర్‌యూ అధ్యాపకులు, సిబ్బంది కృషి మరియు సహకారాన్ని కూడా ఆయన అభినందించారు.

సభను ఉద్దేశించి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ మాట్లాడుతూఆర్ఆర్‌యూ అనేది భద్రతా రంగంలో శిక్షణనిచ్చే, ప్రధాన మంత్రి దృష్టిని నెరవేర్చే ఒక ప్రధాన సంస్థ. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ దేశ భద్రతకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న కాలంలో యూనివర్సిటీ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నందుకు ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

స్వాగత ప్రసంగం చేస్తూ, విశ్వవిద్యాలయ ఉపకులపతి (డా) బిమల్ ఎన్ పటేల్ వార్షిక నివేదికను సమర్పించారు. 26 కార్యక్రమాల్లో దాదాపు వేయి మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకున్నారని ఆయన తెలియజేశారు. అదనంగాజాతీయ భద్రతా గార్డు సిబ్బంది, సాయుధ బలగాలురాష్ట్ర పోలీసు సేవలుకేంద్ర సాయుధ పోలీసు బలగాలు మరియు ఇతర సిబ్బంది విశ్వవిద్యాలయం యొక్క శిక్షణా కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందారు. శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు ప్రణాళికలను కూడా వైస్ ఛాన్సలర్ పంచుకున్నారు.

స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులుఇతర సిబ్బందిపూర్వ విద్యార్థులువిద్యార్థులువారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 ****



(Release ID: 1868663) Visitor Counter : 111