మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2021-2022 సంవత్సరానికి రూ. 16 కోట్ల డివిడెండ్ ను చెల్లించిన ఎడ్ సిఐఎల్
Posted On:
17 OCT 2022 5:43PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలోని మినీ రత్న కేటగిరీ-I సిపిఎస్ఇ, 2021-22 సంవత్సరానికి ఎడ్ సిఐఎల్ (ఇండియా లిమిటెడ్), రూ. 16 కోట్ల డివిడెండ్ ను (లాభాంశాన్ని) చెల్లించింది.
కేంద్ర విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్ సిల్ సిఎండి శ్రీ మనోజ్ కుమార్ నుంచి 17 అక్టోబర్ 2022న విద్యామంత్రిత్వ శాఖ కార్యదర్శి (హెచ్ ఇ) శ్రీ కె. సంజయ్ మూర్తి, ఎఎస్ (టిఇ) శ్రీ రాకేష్ రంజన్, విద్యామంత్రిత్వ శాఖ, ఎడ్ సిల్ సీనియర్ అధికారుల సమక్షంలో చెక్ ను అందుకున్నారు.
ఆర్థిక సంవత్సరం 21-22లో రూ. 428 కోట్ల అత్యధిక టర్నోవర్ ను సాధించింది. ఇది గత ఏడాది టర్నోవర్ తో పోలిస్తే 29శాతం అధికం. పిబిటి (పన్నుకు ముందు లాభం) కూడా అత్యధికంగా రూ. 71 కోట్లుగా నమోదైంది.
***
(Release ID: 1868658)