రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

'మోదీ @ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ' పుస్తకం గుజరాతీ ఎడిషన్ ను గాంధీనగర్ లో విడుదల చేసిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ : ప్రధాన మంత్రి శ్రీ మోదీ దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నం అని ప్రశంస


‘‘ప్రధాని మోదీ విజన్ కారణంగా భారత్ నేడు గ్లోబల్ హై టేబుల్ లో స్థానం సంపాదించుకుంది”

శ్రీ నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి
వ్యతిరేకంగా భారత దేశ వైఖరిని రీడిజైన్ చేసి పునఃనిర్వచించారు ; ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నాం: రక్షణ మంత్రి

Posted On: 17 OCT 2022 8:16PM by PIB Hyderabad

శ్రీ నరేంద్ర మోదీ కేవలం ప్రధాన మంత్రి లేదా నాయకుడే కాదు, సంఘ సంస్కర్త గా, దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి

చిహ్నంగా నిలుస్తున్నారు. అక్టోబర్ 17, 2022న గుజరాత్ లోని గాంధీనగర్ లో 'మోదీ @ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ' అనే పుస్తకం గుజరాతీ ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో నాయకత్వ స్వభావం, శైలి,  నిర్వచనంలో మార్పును తీసుకువచ్చిన ప్రత్యేక నాయకుడిగా ప్రధాని మోడీని రక్షణ మంత్రి అభివర్ణించారు.

ప్రధాన మంత్రి ప్రస్తుతానికి మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు కోసం

పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రికి ప్రజల విస్తృత మద్దతు గురించి వివరిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ప్రజల సంపూర్ణ విశ్వాసంతో అధికార. శిఖరాగ్రాన ఉన్నారని, ఆయన వారిని సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనంతో అనుసంధానించారని శ్రీ రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ తర్వాత ప్రజల నాడిని గుర్తించి, వారితో నేరుగా సంభాషించిన తొలి నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ. భారతదేశం అవసరాలు,  ఆకాంక్షలు ఆయనకు తెలుసు. ఆయన దేశంలో పరివర్తనాత్మక మార్పును తీసుకు. వస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రారంభించిన అనేక కార్యక్రమాలకు ప్రాతినిధ్యం ద్వారా ప్రధాని మోదీ భారత సంఘ సంస్కరణకు ప్రతీక‘‘  అని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ నైపుణ్యాలు, అనుభవాలను ప్రశంసిస్తూ, ప్రధాన మంత్రిగా పనిచేయడానికి ముందు 12 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేసిన తొలి ప్ర ధాన మంత్రి శ్రీ మోదీ అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ పుస్తకం గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్

ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి 20

సంవత్సరాల ప్రజా సేవ ను ఈ పుస్తకం

ఆవిష్కరిస్తుందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

ప్రధాని మోదీ దార్శనికత కారణంగా భారతదేశం నేడు ప్రపంచ ఉన్నత పట్టికలో స్థానం సంపాదించిందని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. ‘‘ భారతదేశం స్వావలంబన కలిగిన దేశంగా మొత్తం ప్రపంచం మొత్తం చూస్తోంది. తన అంతర్గత విషయాలలో ఎవరి జోక్యాన్ని అంగీకరించని భారతదేశం, సమిష్టి శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలలో మాత్రం తన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి వెనుకాడదు. అంతర్జాతీయ వ్యవస్థలో భారత్ ఇప్పుడు ఎజెండా నిర్దేశిత పాత్రను పోషిస్తోంది" అని ఆయన అన్నారు.

జమ్ము కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేయడం నిర్ణయాలు తీసుకోవడంలో

ప్రధాని మోదీ  సమర్ధతకు ఒక

ఉదాహరణ అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల జమ్మూకశ్మీర్ శాంతి, సౌభాగ్యాల యుగంలోకి ప్రవేశించిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రధాని మోదీ రీడిజైన్ చేసి, పునర్నిర్వచించారని, ఉగ్రవాదం, చర్చలు చేతులు కలపలేవని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని రక్షణ మంత్రి అన్నారు. అవసరమైతే సరిహద్దులు దాటి - అంటే భారత్ అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందని రుజువు చేసిందని ఆయన చెప్పారు.

ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ఇతర సంస్కరణలను కూడా రక్షణ మంత్రి వివరించారు. జిఎస్టి పథకాన్ని అమలు చేయడంతో సహా, దీనిని అభ్యుదయ పన్ను సంస్కరణగా పేర్కొన్నారు. భారత దేశ పెరుగుతున్న ఆర్థిక శక్తిని ఐఎంఎఫ్ డిజి శ్రీమతి క్రిస్టాలినా జార్జివా గుర్తించారని, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ను ప్రపంచంలో ఒక ప్రకాశవంతమైన మెరుపుగా ఆమె గుర్తించారని ఆయన అన్నారు.

' మోదీi@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ' అనే పుస్తకం, 20 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా , ప్రధాన మంత్రిగా వివిధ వివిధ రంగాలలో శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనా విధానం, పనితీరు అంశాలను వివరిస్తూ ఆయా రంగాల నిపుణులు రాసిన వ్యాసాలను సంకలనం చేసింది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ ప టేల్ , కేంద్ర సమాచార, ప్రసార మత్స్య, పశు సంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్ట ర్

ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు.

***


(Release ID: 1868655) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi