సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
రాజస్థాన్ లోని ఆల్వార్ లో దివ్యాంగుల కోసం సామాజిక అధికారిత శిబిరం
Posted On:
17 OCT 2022 12:54PM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎడిఐపి పథకం కింద దివ్యాంగులకు సహాయక పరికరాలు, ఎయిడ్స్ ను పంపిణీ చేసేందుకు వికాలంగ వ్యక్తుల సాధికారత విభాగం, ఎఎల్ఐఎంసిఒ, సామాజిక న్యాయం, సాధికారత విభాగం, ఆల్వార్ జిల్లా పాలనా యంత్రాంగంతో కలిసి రాజస్థాన్ లోని ఆల్వార్ నగరంలోని ప్రతాప్ ఆడిటోరియంలో సోమవారం నాడు సామాజిక అధికారత శిబిరాన్ని నిర్వహించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి కుమారి ప్రతిమ భౌమిక్ హాజరై పంపిణీ శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి రాజస్థాన్ ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి శ్రీ తికారామ్ జుల్లీ, ఆల్వార్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బాలక్ నాథ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, చిట్ట చివరి వ్యక్తికి సేవలనందించి సమాజం ప్రధాన స్రవంతిలోకి దివ్యాంగులను తీసుకువచ్చేందుకు వారిని సాధికారం చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పని చేస్తూ దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి కుమారి ప్రతిమా భౌమిక్. తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు, పనిని గురించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వికాలాంగ వ్యక్తుల హక్కు చట్టం (రైట్ టు పర్సన్ విత్ డిజెబిలిటీ యాక్ట్) 2016ను అమలు చేసిందని, అదే ఇప్పుడు వైకల్యాలను 7 నుంచి 21 వరకు పెంచేందుకు అవకాశాన్ని కల్పించిందని కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. వైకల్యం ఉన్న వ్యక్తులకు విద్యా సంస్థలలో రిజర్వేషన్ ను 3 నుంచి 5 శాతానికి పెంచగా, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ను 3 నుంచి 4 శాతం పెంచారు. దివ్యాంగులకు సార్వత్రిక ఐడి కార్డుల పథకం భారత దేశ వ్యాప్తంగా ఆమోదితం అవుతుంది కనుక వైకల్యం ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను తగ్గిస్తుంది.
దివ్యాంగులను సాధికారం చేసేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని గురించి మాట్లాడుతూ డిజిటైజేషన్ దిశగా, ప్రభుత్వం ఆన్ లైన్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రసంగించిన రాజస్థాన్ ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి శ్రీ తికారామ్ జుల్లీ పట్టి చూపారు.
తన నియోజకవర్గంలో నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు అటువంటి సంక్షేమ పథకాన్ని అమలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆల్వార్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బాలక్ నాథ్ కృతజ్ఓతలు తెలిపారు.
వివిధ వర్గాలకు చెందిన రూ. 2 కోట్ల 01 లక్ష విలువైన 2933 సహాయక పరికరాలు, ఎయిడ్స్ ను ఎఎల్ఐఎంసిఒ ఆల్వార్ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన అంచనా శిబిరాలలో పరీక్షించి, ముందస్తుగా గుర్తించిన 1564 దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
బ్లాక్ స్థాయిలో నిర్వహించిన అంచనా శిబిరాల సందర్భంగా నమోదు చేసుకున్న దివ్యాంగజన లబ్ధిదారుల నుంచి గుర్తించిన వారికి పంపిణీ చేయనున్న భిన్న సహాయక పరికరాలలో 231 మోటరైజ్డ్ ట్రైసికిల్, 528 ట్రైసికిల్, 285 చక్రాల కుర్చీలు, 834 క్రచెస్, 340 వాకింగ్ స్టిక్స్, 16 రొలాటర్లు, 09 స్మార్ట్ ఫోన్లు, 37 స్మార్ట్ కేన్లు, 05 బ్రెయిలీ కిట్లు, 04 సి.పి. కుర్చీలు, 170 ఎంఎస్ ఐఇడి కిట్లు, సెల్ ఫోన్ సహా 01 ఎడిఎల్ కిట్ (కుష్టు రోగులకు), 212 హియరింగ్ ఎయిడ్ మెషీన్లు, 261 కృత్రిమ అవయవాలు, కాలిపర్లను పంపిణీ చేయనున్నారు.
ఆల్వార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జితేంద్ర కుమార్ సోనీ, జిల్లా ఎస్పీ, సాంఘిక సంక్షేమ శాఖ సీనియర్ అధికారులు, ఎఎల్ ఐఎంసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1868653)
Visitor Counter : 134