సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర అధ్యక్షతన రేపు జరగనున్న సమావేశంలో రేపు విజ్ఞాన్ భవన్‌లో 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన అనుభవ్ అవార్డుల ప్రదానోత్సవం


పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి చేసిన సమగ్ర పెన్షనర్ల పోర్టల్ ను ప్రారంభించనున్న మంత్రి.

Posted On: 17 OCT 2022 2:55PM by PIB Hyderabad

కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ రేపు న్యూఢిల్లీలో 2020, 2021, 2022 సంవత్సరాల్లో విలువైన సమాచారాన్ని అందించిన వారికి   అనుభవ్ అవార్డుల  ప్రధానోత్సవ కార్యక్రమం  నిర్వహించనుంది.

కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి చేసిన సమగ్ర పెన్షనర్ల పోర్టల్ ను మంత్రి ప్రారంభిస్తారు. 

    కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ  పోర్టల్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకీకృతం చేసింది. దీంతో బ్యాంక్ పోర్టల్ ను మంత్రిత్వ శాఖ పోర్టల్ తో  చేసిన మొదటి పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంక్‌గాస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందింది. పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకొనేందుకు కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ క్షేత్ర స్థాయిలో విశ్లేషణ నిర్వహించింది.బ్యాంకులకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయని విశ్లేషణ వెల్లడించింది. పెన్షనర్ల కోసం కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న చర్యలపై పెన్షనర్లలో అవగాహన కల్పించేందుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్న బ్యాంకుల సిబ్బంది కోసం   కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ సదస్సులు  నిర్వహించింది. బ్యాంకర్ల అవగాహన సదస్సు తొలిసారిగా ఉదయపూర్ లో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది. పెన్షన్లు పంపిణీ చేస్తున్న అన్ని బ్యాంకుల పోర్టల్‌లను భవిష్య పోర్టల్‌తో అనుసంధానించేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ కార్యక్రమాన్ని సదస్సులో రూపొందించడం జరిగింది.

 ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ 2015 మార్చి నెలలో 'అనుభవ' పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో సాధించిన ముఖ్యమైన విజయాలు తెలియజేయడానికి  'అనుభవ' ఒక వేదికగా పనిచేస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాలు సమర్ధంగా పటిష్టంగా అమలు చేయడానికి సిబ్బంది సలహాలు, సూచనలు  'అనుభవ' ద్వారా అందించవచ్చు. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు అందించే సమాచారం, సలహాలు ఆధారంగా సుపరిపాలన అందించడానికి అవకాశం కలుగుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలలో పని చేసి పదవీ విరమణ చేస్తున్న వారు తమ అనుభవాలు, సూచనలు అందించేందుకు   'అనుభవ' ఒక వేదికగా ఉంటుంది. 92 మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థలు కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ  'అనుభవ' పోర్టల్ లో నమోదు అయ్యాయి.30.09.2022 నాటికి  'అనుభవ' పోర్టల్ లో 8722 సిబ్బంది అనుభవాలు నమోదు అయ్యాయి. 

పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది 5000 పదాలు మించకుండా తమ అనుభవాలను అవసరమైన పత్రాలు జత చేసి 'అనుభవ' పోర్టల్ లో పొందుపరుస్తారు. గుర్తించిన 20 రంగాలకు సంబంధించి పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది పత్రాన్ని అందించవచ్చు.  ఉత్తమ పత్రం అందించిన వారికి సర్టిఫికెట్, 10,000 రూపాయల నగదు బహుమతి అందిస్తారు. 

పెన్షనర్లు ఇబ్బందులు లేకుండా సులభతర జీవితం సాగించేందుకు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏక గవాక్ష పెన్షన్ పోర్టల్ ప్రారంభించాలని 2022 జూన్ 15 న భవిష్య పోర్టల్ లబ్ధిదారులతో జరిపిన చర్చల్లో డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. మంత్రి సూచనలకు అనుగుణంగా కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ భవిష్య పోర్టల్ ఆధారంగా ఒక సమగ్ర పెన్షనర్ల పోర్టల్ అభివృద్ధి చేసింది. కేంద్ర  పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ విడివిడిగా నిర్వహిస్తూ వచ్చిన సిపెంగ్రామ్స్,   అనుభవ్, భవిష్య, సంకల్ప, అనుదాన్ లాంటి పోర్టల్‌లు, బ్యాంకుల పోర్టల్‌లు ఏక గవాక్ష విధానంలో విధానంలో పనిచేస్తాయి. 

పెన్షన్లు పంపిణీ చేస్తున్న బ్యాంకుల పోర్టల్‌లు కూడా అనుసంధానం అయ్యేలా చూసేందుకు   సమగ్ర పెన్షనర్ల పోర్టల్ ని అభివృద్ధి చేయడం జరిగింది.   పెన్షన్ దరఖాస్తు సమర్పణ, ట్రాకింగ్, ePPO/ eSSA డౌన్‌లోడ్ చేయడం, సర్క్యులర్‌లను చూడటం, ఫిర్యాదులను స్వీకరించడం, పెన్షన్ స్లిప్పులు, ఫారం 16, లైఫ్ సర్టిఫికెట్ వంటి పెన్షన్ సంబంధిత బ్యాంక్ సమాచారాన్ని పొందడం,  స్టేటస్ మొదలైన అన్ని పెన్షన్ సంబంధిత వివరాలను పింఛనుదారులు   ఈ పోర్టల్‌ ద్వారా పొందవచ్చు.సమగ్ర పెన్షనర్ల పోర్టల్  తో   పెన్షన్ పంపిణీ చేస్తున్న అన్ని బ్యాంకుల పోర్టల్ లను అనుసంధానం చేస్తారు. పెన్షనర్లకు తాము అందిస్తున్న సేవలను బ్యాంకులు పోర్టల్ లో ప్రదర్శిస్తాయి. తమకు నచ్చిన తన ప్రాంతానికి దగ్గరలో ఉన్న బ్యాంకును ఎంపిక చేసుకుని  పెన్షన్ పొందడానికి పింఛనుదారులకు అవకాశం కలుగుతుంది. తొలుత ఈ సేవలు భవిష్య ద్వారా పెన్షన్ అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు అందిస్తారు. దశలవారీగా కేంద్ర పింఛనుదారులు అందరికీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

 కార్యక్రమంలో భాగంగా రాబోయే నెలల్లో పదవీ విరమణ చేయనున్న కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగులకు ప్రీ-రిటైర్మెంట్ అవగాహన సదస్సులు   కూడా నిర్వహిస్తారు. .  భవిష్య పోర్టల్ మరియు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్/ఫేస్ అథెంటికేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షనర్ల ఆదాయపు పన్ను సంబంధిత సమస్యలపై సదస్సులు  నిర్వహిస్తారు. 

***



(Release ID: 1868558) Visitor Counter : 174