వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు కేంద్రం సహకారం కొనసాగిస్తుంది: శ్రీ తోమర్
కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొబ్బరి సంఘం రైతుల సదస్సును ప్రారంభించిన వ్యవసాయ మంత్రి
Posted On:
14 OCT 2022 6:49PM by PIB Hyderabad
దేశంలో కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కోస్తా రాష్ట్రాల్లోని రైతులకు కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో చేసిన కృషి ఫలితంగా వ్యవసాయం మరియు ప్రాసెసింగ్ రంగంలో కొత్త సాంకేతికతలు అభివృద్ధి చేయబడ్డాయి మరియు అందుబాటులో ఉన్న సాంకేతికతలను మరింత మెరుగుపరిచాయి. దేశంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల సంఖ్య పెరగడంతో కొత్త ఉత్పత్తులు,మార్కెట్‌లో అనేక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన కొబ్బరి సంఘం రైతుల సదస్సులో శ్రీ తోమర్ ప్రసంగించారు.
శ్రీ తోమర్ మాట్లాడుతూ కొబ్బరి రైతుల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషం గా ఉందని, కొబ్బరి పెంపకందారుల సంఘం శ్రేయస్సు కోసం కొబ్బరి అభివృద్ధి బోర్డు మరియు చెరకు పెంపకం సంస్థ చొరవ చూపినందుకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, దానిని బలోపేతం చేసి, ప్రోత్సహించి రైతులకు లాభసాటిగా వ్యవసాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కొబ్బరి సాగు యొక్క సహకారం చాలా ముఖ్యమైనది. భారతదేశం కొబ్బరి సాగులో అగ్రగామిగా ఉంది మరియు ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి. దేశంలో కొబ్బరి సాగు విస్తీర్ణంలో 21 శాతం, ఉత్పత్తిలో 26 శాతం తమిళనాడు వాటాగా ఉంది. కొబ్బరి ప్రాసెసింగ్ కార్యకలాపాలలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది మరియు కొబ్బరి సాగు విస్తీర్ణంలో కోయంబత్తూర్ మొదటి స్థానంలో ఉంది, 88,467 హెక్టార్లలో కొబ్బరి సాగు జరిగింది. కొబ్బరి రంగ అభివృద్ధికి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో రైతులు గణనీయమైన కృషి చేస్తున్నారని శ్రీ తోమర్ అన్నారు. చిన్న, సన్నకారు రైతులను కలుపుకొని కొబ్బరి అభివృద్ధి మండలి మూడంచెల రైతు సమూహాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 697 కొబ్బరి ఉత్పత్తిదారుల సొసైటీలు, 73 కొబ్బరి ఉత్పత్తిదారుల సమాఖ్యలు మరియు 19 కొబ్బరి ఉత్పత్తి చేసే కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలో సంవత్సరానికి 3,638 మిలియన్ కొబ్బరికాయల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 537 కొత్త ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వబడింది. దేశంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు అమలు చేస్తున్న మిషన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విజయం సాధించబడింది. వీటిలో 136 యూనిట్లు తమిళనాడుకు చెందినవి, ఇవి ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి మరియు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి.
వ్యవసాయ రంగంలో అంతా అనుకూలమైన వాతావరణంవున్న తర్వాత కూడా రైతులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందని,ఇది వారికి నష్టాలను కలిగిస్తుంది దీని వల్ల నష్టపోతారని శ్రీ తోమర్ అన్నారు.దీనిని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన మరియు తమిళనాడు రాష్ట్ర పథకం ద్వారా భర్తీ చేయబడుతుంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. వ్యవసాయం చాలా ప్రాథమికమైనది, ఇది కోవిడ్-19 వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలో సహాయపడింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గడచిన 8 సంవత్సరాలలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారని శ్రీ తోమర్ అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) ద్వారా దాదాపు 11.50 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా జమ అయ్యాయి. గత 6 సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు జరిగిన నష్టానికి, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతుల ఖాతాల్లో రూ.1.22 లక్షల కోట్లకు పైగా క్లెయిమ్ మొత్తం జమ చేయబడింది. గతంలో సూక్ష్మ సాగునీరు పథకం కింద రూ.5 వేల కోట్లు కేటాయించగా, దాన్ని రూ.10 వేల కోట్లకు పెంచారు. 70 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం సూక్ష్మ సాగునీరు పథకం పరిధిలోకి వచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద, ఇంతకుముందు రైతులకు కేవలం ఐదు నుండి ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు మాత్రమే పంట రుణాలు ఇవ్వబడ్డాయి, దానిని ప్రధాన మంత్రి దాదాపు రూ. 18న్నర లక్షల కోట్లు పంట రుణాలు గా పెంచి ఇవ్వబడ్డాయి. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ. లక్ష కోట్ల అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు, రైతుల సమూహం, ఎఫ్‌పిఓలు, పిఎసిఎస్‌లు, కృషి ఉపాజ్ మండీలు అందరూ గ్రామాలలో అవసరాన్ని బట్టి గిడ్డంగి, శీతల గిడ్డంగి లేదా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. రైతులు లాభసాటి పంటలు పండించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎఫ్‌పిఓల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి, రుణాలు, రాయితీల కోసం ఏర్పాట్లు కూడా చేశామన్నారు.
శ్రీ తోమర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతుల శ్రేయస్సు, వారి జీవితాల్లో సంతోషం నింపేలా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైతులు ప్రాజెక్టులను సమర్పించాలని, ప్రధాన మంత్రి శ్రీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, రైతుల అభివృద్ధికి అంచెలంచెలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎం.ఆర్.కె. పనీర్ సెల్వం, కొబ్బరి అభివృద్ధి బోర్డు వైస్ చైర్మన్ శ్రీ కె.ఆర్. నారాయణ్, సీఈవో, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి, కేంద్ర ఉద్యానశాఖ కమిషనర్ శ్రీ ప్రభాత్ కుమార్, వైస్ ఛాన్సలర్ గీతాలక్ష్మి, చెరకు పెంపకం సంస్థ డైరెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
****
(Release ID: 1867987)
Visitor Counter : 223