ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ సెక్యూరిటీ విన్యాసం“పవర్‌ఎక్స్-2022” సంయుక్తంగా నిర్వ‌హించిన‌ సీఈఆర్‌టీ-ఇన్, ప‌వ‌ర్‌-సీఎస్ఐఆర్‌టీ


“ ఐటీ & ఓటీ మౌలిక సదుపాయాలలో సైబర్ ప్రేరిత అంతరాయాల నుంచి రక్షించడం” అనే ఇతివృత్తంతో నిర్వ‌హ‌ణ‌

Posted On: 13 OCT 2022 11:30AM by PIB Hyderabad

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) ప‌వ‌ర్‌-సీఎస్ఐఆర్‌టీల సహకారంతో (విద్యుత్ రంగంలోని
కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్‌లు) 193 ఆహ్వానించబడిన పవర్ సెక్టార్ సంస్థ‌ల  కోసం సైబర్ సెక్యూరిటీ
విన్యాసం “పవర్‌ఎక్స్”ని విజయవంతంగా నిర్వహించారు . ఎక్సర్‌సైజ్ ప్లానర్ టీమ్ ఆఫ్ పవర్-సీఎస్ఐఆర్‌టీల అధికారులు ఈ విన్యాసం నిర్వ‌హించిన‌ రోజున సీఈఆర్‌టీ-ఇన్ టీమ్‌తో పాటు కార్య‌క్ర‌మం సమన్వయకర్తలుగా పనిచేశారు. ఐటీ & ఓటీ మౌలిక సదుపాయాలలో సైబర్ ప్రేరిత  సైబర్ సంఘటనను గుర్తించడం, విశ్లేషించడం మరియు ప్రతిస్పందించడం" అనే ల‌క్ష్యంతో ఈ  కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఐటీ & ఓటీ మౌలిక సదుపాయాలలో సైబర్ ప్రేరిత అంతరాయాన్ని రక్షించడం” అనే ఇతివృత్తంతో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. “పవర్‌ఎక్స్” విన్యాసం సీఈఆర్‌టీ-ఇన్ దాని ఎక్స్‌ర్‌సైజ్‌ అనుకరణ వేదిక‌పై  హోస్ట్ చేయబడింది. వివిధ పవర్ సెక్టార్ యుటిలిటీస్ నుండి దాదాపు 350+ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “పవర్‌ఎక్స్” విన్యాసం దాని లక్ష్యాలను చేరుకోవడంలో విజయవంతమైంది. సైబర్ భద్రతా సంఘటనలు తెలుసుకోవడానికి, అభ్యాసం చేయడానికి మరియు ప్రతిస్పందించడానికి పాల్గొనేవారికి సహాయపడింది.

***


(Release ID: 1867791) Visitor Counter : 165