శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2022 అక్టోబర్ 11 మరియు 12 వ తేదీల్లో జరిగిన ఇండో-యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ సంయుక్త కార్యాచరణ గ్రూప్ 34వ సమావేశం కోసం అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ని సందర్శించిన డీబీటీ కార్యదర్శి నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం
प्रविष्टि तिथि:
13 OCT 2022 10:16AM by PIB Hyderabad
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)తో కలిసి బయోటెక్నాలజీ శాఖ 1987 జూలై నుంచి ఇండో-యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ (VAP)గా పేరుతో కేంద్రీకృత ద్వైపాక్షిక సహకార కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుత కార్యక్రమం 2017 వరకు పొడిగించబడింది. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖల నుంచి ఆమోదం పొందిన తరువాత భారతదేశం, అమెరికా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం గడువు పొడిగించబడింది.
ఇండో-యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ సంయుక్త కార్యాచరణ గ్రూప్ 34వ సమావేశంలో పాల్గొనేందుకు బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్.ఎస్.గోఖలే నాయకత్వంలో భారత ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఇండో-యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ సంయుక్త కార్యాచరణ గ్రూప్ 34వ సమావేశంలో బయోటెక్నాలజీ శాఖ ఉన్నతాధికారులతో కూడిన బృందం ఇతర అంశాలపై కూడా చర్చలు జరుపుతుంది. రెండు దేశాలకు చెందిన నిపుణులు, విధాన రూపకర్తలు పాల్గొనే సమావేశం ఇండో-యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ కార్యాచరణ కార్యక్రమానికి రూపకల్పన చేస్తుంది. సమావేశానికి బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి సహా అధ్యక్షత వహిస్తారు.
2022 అక్టోబర్ 11, 12 తేదీల్లో మేరీల్యాండ్‌లోని బెథెస్డాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ క్యాంపస్‌లో సమావేశం ఏర్పాటు చేయబడింది. సమావేశంలో ఇండో-యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ ఫై సంయుక్త ప్రకటన పై డాక్టర్ రాజేష్ ఎస్. గోఖలే మరియు డాక్టర్ ఆంథోనీ సంతకం చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఫౌసీ, అమెరికాలోని భారత రాయబారి సమక్షంలో కార్యక్రమాన్ని 2027 వరకు ఐదు సంవత్సరాల పొడిగిస్తూ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
భారతదేశానికి చెందిన దివంగత ప్రొఫెసర్ వి, రామలింగస్వామి, అమెరికాకి చెందిన దివంగత ప్రొఫెసర్ ఫ్రెడ్ రాబిన్స్ స్మారకార్థం 'రామా-రాబిన్స్ ఉపన్యాసం' నిర్వహించబడింది. రెండు దేశాలకు సంబంధించి శాస్త్రీయ ఔచిత్యం అనే అంశంపై ఆరోగ్య శాస్త్రాల రంగంలో గుర్తింపు పొందిన డాక్టర్ ఫౌసీ ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఈ సంవత్సరం 'రామా-రాబిన్స్ ఉపన్యాసం' 'మహమ్మారి సంసిద్ధత మరియు కోవిడ్ -19 నుండి పాఠాలు' అనే అంశంపై డాక్టర్ ఫౌసీ అందించారు. డిబిటి కార్యదర్శి కూడా ప్రసంగించారు.
***
(रिलीज़ आईडी: 1867789)
आगंतुक पटल : 181