ఆర్థిక మంత్రిత్వ శాఖ
3.96% జిఎస్ 2022 తిరిగి చెల్లింపు
Posted On:
11 OCT 2022 3:10PM by PIB Hyderabad
జిఎస్ 2022కు సంబంధించి బాకీ ఉన్న 3.9% నగదును 09 నవంబర్ 2022కు సమమూల్యంగా చెల్లించవచ్చు. పేర్కొన్న తేదీ నుంచి ఎటువంటి వడ్డీ పెరగదు. తిరిగి చెల్లించే రోజును నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (బదలాయించదగిన పత్రాలు/ సాధనాల) చట్టం, 1881కింద ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా శలవుగా ప్రకటించినట్టు అయితే, పేయింగ్ ఆఫీసర్లు (చెల్లించే అధికారులు) ఆ రాష్ట్రంలో అంతకు ముందు పని దినాన రుణాలను తిరిగి చెల్లిస్తారు.
ప్రభుత్వ హామీ పత్రాల నిబంధనలు, 24(2), 24 (30) ఉపనిబంధనల ప్రకారం 2007 మెచ్యూరిటీ( సొమ్ము) చెల్లింపు, అనుబంధ జనరల్ లెడ్జెర్ లేదా అంశ సంబంధిత అనుబంధ జనరల్ లెడ్జర్ ఖాతా లేదా స్టాక్ సర్టిఫికెట్ రూపంలో ప్రభుత్వ భద్రత రిజస్టర్డ్ హోల్డర్‌కు కొనసాగుతుంది. దానిని అతడి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన తగిన వివరాలతో కూడిన పేఆర్డర్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నిధులను స్వీకరించే సదుపాయం ఉన్న ఏదైనా బ్యాంకులో ఖాతాదారుకి ఖాతా ఉంటే అందులోకి జమ చేయడం జరుగుతుంది.
సెక్యూరిటీలకు సంబంధించిన చెల్లింపులకు సంబంధించి, అసలు సబ్‌స్క్రైబర్ లేదా అటువంటి ప్రభుత్వ సెక్యూరిటీల తదుపరి సొంత దారులు, తమ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు చాలా ముందస్తుగా సమర్పించాలి. అయితే, గడువు తేదీలోగా రుణాన్ని తిరిగి చెల్లించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా నిధులను స్వీకరించేందుకు బ్యాంకు ఖాతాకు సంబంధించి తగిన వివరాలు లేకుంటే, ఖాతాదారులు ప్రభుత్వ డెట్ కార్యాలయాల్లో, ట్రెజరీలు / సబ్ ట్రెజరీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు (వడ్డీ చెల్లింపు కోసం నమోదు చేసుకుని ఉన్న) నిలువ ఉన్న సొమ్మును చెల్లించవలసిన తేదీకన్నా 20 రోజుల ముందుగా సమర్పించవచ్చు.
రుణ విలువను స్వీకరించే ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగా పేర్కొన్న చెల్లింపు కార్యాలయాల నుంచి పొందవచ్చు.
***
(Release ID: 1866947)
Visitor Counter : 132