ఉక్కు మంత్రిత్వ శాఖ
ఐసీటీ, డిజిటల్ సొల్యూషన్స్ కోసం రైల్‌టెల్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నఎన్ఎండీసీ
Posted On:
11 OCT 2022 11:46AM by PIB Hyderabad
మైనింగ్ దిగ్గజ సంస్థ ఎన్ఎండీసీ తన కార్పొరేట్ కార్యాలయాలు, మైనింగ్ కేంద్రాలలో ఐసీటీ, డిజిటల్ సొల్యూషన్స్ కోసం రైల్‌టెల్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెండు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఎన్‌ఎండిసి సిఎండి శ్రీ సుమిత్ దేబ్ సమక్షంలో ఎన్‌ఎండిసి జిఎం (సి అండ్ ఐటి) శ్రీ హెచ్ సుందరం ప్రభు మరియు రైల్‌టెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ మనోహర్ రాజా ఎంఒయు పై సంతకాలు చేశారు.
రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వనరుల సక్రమ వినియోగం, ఖనిజ సంపదకు జవాబుదారీతనాన్ని పెంపొందించి, మైనింగ్ రంగంలో డిజిటల్ పరివర్తనకు మార్గం సుగమం చేస్తుందని ఎన్‌ఎండిసి సిఎండి శ్రీ సుమిత్ దేబ్ అన్నారు. భారతదేశపు ప్రముఖ మైనింగ్ సంస్థగా గుర్తింపు పొందిన ఎన్ఎండీసీ ఆటోమేషన్ మరియు డిజిటలైజేషన్‌కు తొలుత నుంచి ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. . రైల్‌టెల్‌తో కుదిరిన అవగాహన వల్ల ఈ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు జరుగుతాయని శ్రీ సుమిత్ దేబ్ అన్నారు.
సమర్ధత మరియు పారదర్శకతను పెంపొందించే కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మరియు ఎగ్జిక్యూషన్ సేవలను రైల్‌టెల్ అందిస్తుందని ఎన్‌ఎండిసి డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ అమితవ ముఖర్జీ అందజేస్తుందని తెలిపారు. ఎన్‌ఎండిసిని ప్రముఖ సంస్థల సరసన నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహద పడుతుందని అన్నారు.
ఎన్ఎండీసీ కార్యకలాపాలు సాగిస్తున్న 11 కేంద్రాల్లో ఎంపిఎల్ఎస్, వీపీఎన్ , 7 కేంద్రాల్లో ఇంటర్నెట్ లీజ్డ్ లైన్‌లు (ఐఎల్ఎల్) హై-డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్‌లను గత 7 సంవత్సరాల నుంచి నేషనల్ రైల్వే టెలికామ్ సేవలను అందిస్తోంది. ఒప్పందాన్ని కొనసాగించేందుకు వీలుగా రైల్‌టెల్‌తో ఎన్ఎండీసీ కొత్తగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
***
(Release ID: 1866734)
Visitor Counter : 163