వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

బి 20 ఇండోనేషియా గ్లోబల్ డైలాగ్‌పై సమావేశాన్ని నిర్వహించిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి)


ఇండోనేషియా విధాన సిఫార్సులో భారతీయ దృక్కోణాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని నిర్ధారించుకోవడంలో సహాయపడనున్న బి20 సమావేశం

Posted On: 10 OCT 2022 5:20PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ఈరోజు న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) భాగస్వామ్యంతో బి20 ఇండోనేషియా గ్లోబల్ డైలాగ్‌పై కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ఇండోనేషియా విధాన సిఫార్సులతో భారతీయ పరిశ్రమ దృక్కోణాలను సమలేఖనం చేసే లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం బి20 ఇండోనేషియా విధాన సిఫార్సులో భారతీయ దృక్కోణాలు బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని నిర్ధారించడానికి చర్చలను రూపొందిస్తుంది.
 

image.png

 

బిజినెస్ 20 (బి20) 2010లో ఏర్పడింది. ఇది ప్రపంచ వ్యాపార సంఘంతో అధికారిక జి20 డైలాగ్ ఫోరమ్.  ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రతి రొటేటింగ్ ప్రెసిడెన్సీ ద్వారా ప్రాధాన్యతలపై నిర్దిష్ట చర్య తీసుకోదగిన విధాన సిఫార్సులను అందించడం లక్ష్యంగా బి20 పెట్టుకుంది.

ఇండోనేషియా నుండి 20 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సదస్సుకు మిస్టర్ ఎం అర్స్జాద్ రస్జిద్ పి.ఎం, ఇండోనేషియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కెఏడిఐఎన్), ఎంఎస్. షింటావిడ్జాజాకామ్‌దాని, చైర్, బి20 ఇండోనేషియాతో పాటు  భారత్‌లోని ఇండోనేషియా రాయబారి హెచ్‌.ఈ. ఇనా హెచ్.కృష్ణమూర్తి హాజరయ్యారు.

భారత ప్రభుత్వం తరపున జి20కి భారతదేశ షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ మరియు డిపిఐఐటి మరియు ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ప్రాతినిధ్యం వహించారు.

 

image.png

 

భారతీయ పరిశ్రమకు అనేక మంది నాయకులు ప్రాతినిధ్యం వహించారు; వీరిలో శ్రీ చంద్రజిత్ బెనర్జీ, డిజి, సిఐఐ; డాక్టర్ నౌషాద్ ఫోర్బ్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) మరియు శ్రీ దీపక్ బాగ్లా, ఎండి & సిఈఓ, ఇన్వెస్ట్ ఇండియా ఉన్నారు.

ప్లీనరీ మరియు పరిచయ వ్యాఖ్యలు అయిన అనంతరం (i)వాణిజ్యం & పెట్టుబడి (ii) శక్తి, సుస్థిరత & వాతావరణం (iii) డిజిటలైజేషన్ మరియు (iv) ఫైనాన్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చర్చలు జరిగాయి. ఇందులో బి20 ఇండోనేషియా నుండి దృక్కోణాలు భారతీయ పరిశ్రమ మరియు ప్రభుత్వ దృక్కోణాలను అనుసరించాయి.

జి 20 అనేది 19 దేశాలు + ఈయూల ఉమ్మడి కూటమి. ఇది ప్రపంచ జీడీపీలో 85%, ప్రపంచ వాణిజ్యంలో 75% మరియు ప్రపంచ జనాభాలో 60%కి ప్రాతినిధ్యం వహిస్తుంది. జి20 సభ్యులు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ , మరియు యూరోపియన్ యూనియన్. ప్రస్తుతం ఇండోనేషియా జి20 అధ్యక్ష పదవిని కలిగి ఉంది.

ఈ చర్చ 13-14 నవంబర్ 2022న ఇండోనేషియాలో జరిగే బి20 ఫైనల్ సమ్మిట్‌కు మార్గం సుగమం చేస్తుంది.



 

********



(Release ID: 1866615) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi