సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి జమ్మూ&కాశ్మీర్‌లో అభివృద్ధి మరియు శాంతి అత్యంత ప్రాధాన్యత: రాందాస్ అథవాలే


జమ్మూ&కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసిన మంత్రి

Posted On: 07 OCT 2022 1:20PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి మరియు శాంతికి ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని లక్షలాది మంది పర్యాటకుల సందర్శనతో పాటు ప్రజాసంక్షేమం కోసం వివిధ రంగాలలో వేల కోట్ల పెట్టుబడులే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జమ్మూ & కాశ్మీర్‌లో నెలకొని ఉన్న శాంతియుత వాతావరణం..లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించగలిగిందని, ఇది సానుకూల సంకేతమని అలాగే పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు జమ్మూ & కాశ్మీర్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని శ్రీ రాందాస్ అథవాలే అన్నారు. .

 

image.png

 

ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం కోరుకుంటోందని శ్రీ అథవాలే చెప్పారు. చాలా మంది ప్రైవేట్ రంగ పెట్టుబడిదారులు జమ్మూ కాశ్మీర్‌కు వచ్చారని, కేంద్ర పాలిత ప్రాంత సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగమని ఇక్కడ శాంతి నెలకొనేందుకు దాని స్వంత అభివృద్ధి కోసం భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం పాకిస్థాన్‌కు శ్రేయస్కరమని శ్రీ అథవాలే అన్నారు.

శ్రీ రాందాస్ అథవాలే మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా  జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ద్వారాలు తెరుచుకున్నాయని, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ముద్ర, పిఎం ఉజ్వల యోజన, స్కాలర్‌షిప్ వంటి అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు కార్యక్రమాలను బట్టి అది స్పష్టమవుతోందని మంత్రి అన్నారు.  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అమలు చేయబడుతున్నాయని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గృహాలు, జీవనోపాధి మొదలైన అన్ని రంగాలలో సామాజిక స్థిరత్వాన్ని అందించడానికి భారతదేశం దృఢంగా ఉందని జమ్మూకాశ్మీర్‌లో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను వంద శాతం అమలు చేయడమే సాక్ష్యమని శ్రీ రాందాస్ అథవాలే చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాల అమలు జమ్మూ కాశ్మీర్‌లో వేగవంతమైందని ఇది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 2014-2022 (సెప్టెంబర్) మధ్య కాలంలో 26 లక్షల ఖాతాలు తెరవడం ద్వారా స్పష్టమవుతోందని మంత్రి తెలియజేశారు. పిఎం ఉజ్వల యోజన కింద 2016-22 (సెప్టెంబర్) మధ్య లబ్ధిదారులకు 12 లక్షల 43 వేల గ్యాస్ కనెక్షన్లు కేటాయించబడ్డాయి, పిఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద 2015-22 (సెప్టెంబర్) మధ్య జమ్మూ కాశ్మీర్‌లో 15 వేల ఇళ్లు నిర్మించబడ్డాయి, పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ) కింద తొంభై వేల ఇళ్లు నిర్మించబడ్డాయి, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద జమ్మూ & కాశ్మీర్‌లో 05 లక్షల 09 వేలు మరియు ఉజాలా యోజన కింద జమ్మూ & కాశ్మీర్‌లో 85 లక్షల ఎల్‌ఈడీ బల్బులు అందిచ చేయబడ్డాయి. 2019-22 (సెప్టెంబర్) మధ్య కాలంలో 1720 డి-అడిక్షన్ సెంటర్‌లస్థాపన కోసం ఆర్థిక సహాయం కింద నిధులు సమకూర్చబడ్డాయి లేదా స్థాపించబడ్డాయి. వాటిలో 12 జమ్మూ మరియు కాశ్మీర్‌లో నిధులు సమకూర్చబడ్డాయి లేదా స్థాపించబడ్డాయి.


 

*******


(Release ID: 1865921) Visitor Counter : 153