జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ ఎం సి జి (NMCG) మరియు సహకార భారతి సోనిపట్‌లో 200 మంది రైతులతో ‘విశాల్ కిసాన్ సమ్మేళన్’ నిర్వహిస్తున్నాయి


డీ జీ ఎన్ ఎం సి జి గంగా మరియు దాని ఉపనదుల పునరుజ్జీవనానికి సహకరించడానికి సహజ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులను ప్రోత్సహించారు.

Posted On: 05 OCT 2022 7:17PM by PIB Hyderabad

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) మరియు సహకార్ భారతి 2022 అక్టోబర్ 4వ తేదీన హర్యానాలోని సోనిపట్‌లోని బయాన్‌పూర్ గ్రామంలో నమామి గంగే  మరియు అర్థగంగా కార్యక్రమం లో భాగంగా రైతులలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే  ప్రచారంలో భాగంగా 'విశాల్ కిసాన్ సమ్మేళన్' వర్క్‌షాప్‌ను నిర్వహించాయి.  డైరెక్టర్ జనరల్, ఎన్ ఎం సి జి గంగా బేసిన్ శ్రీ జి. అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన వర్క్‌షాప్‌లో 200 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార భారతి ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ఎన్‌ఎంసిజి అధికారులు పాల్గొన్నారు.

 

డీ జీ, ఎన్‌ఎంసిజి వర్క్‌షాప్ సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం లో  పాల్గొన్నారు  అలాగే 'సహజ వ్యవసాయం' యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి  రోహ్‌తక్ మెయిన్ రోడ్‌లోని బైన్యాపూర్ లెహ్రాడా గ్రామంలోని స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన స్థానిక సేంద్రీయ ఉత్పత్తుల స్టాల్‌ను సందర్శించారు. కురుక్షేత్రలోని గురుకుల పొలాలలో వ్యవసాయ సందర్శన కూడా నిర్వహించబడింది, ఇక్కడ ఎన్‌ఎంసిజి అధికారులు సహజ వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్న వివిధ సాంకేతికతలను గురించి తెలుసుకున్నారు.

 

2022 ఆగస్టు 19 మరియు సెప్టెంబరు 5న వరుసగా షిర్డీ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లలో వర్క్‌షాప్‌లతో సహా గత కొన్ని వారాల్లో గంగా బేసిన్‌లోని రైతులతో ఇది మూడవ అనుసంధాన ప్రక్రియ. 

 

గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్  సమక్షంలో ఎన్‌ఎంసిజి మరియు సహకార్ భారత్ 16 ఆగస్టు 2022 మధ్య అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది. ప్రజల భాగస్వామ్యం ద్వారా స్థిరమైన మరియు ఆచరణీయమైన ఆర్థికాభివృద్ధిని సాధించడం, అర్థ గంగ లక్ష్యం సాకారం చేయడం కోసం స్థానిక సహకార సంఘాలను నిర్మించడం మరియు బలోపేతం చేయడం ద్వారా ప్రజలను "ఆర్థిక  సేతు" ద్వారా నదితో అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అవగాహన ఒప్పదం లోని కొన్ని ప్రధాన లక్ష్యాలలో ప్రధాన కాలువ పై ఐదు రాష్ట్రాల్లోని 75 గ్రామాలను 'సహకార్ గంగా గ్రాములు'గా గుర్తించడం, గంగా తీరాన ఉన్న రాష్ట్రాల్లోని రైతులు, ఎఫ్‌పిఓలు మరియు సహకార సంస్థలలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు 'మరింత నికర- ఉత్పత్తి' ఒక్కో నీటి బొట్టు ఆదాయం', మార్కెట్ అనుసంధానాలను సృష్టించడం ద్వారా గంగా బ్రాండ్ క్రింద సహజ వ్యవసాయం/సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను సులభతరం చేయడం, ఆర్థిక సేతు ద్వారా ప్రజలు-నదుల అనుసంధానాన్ని ప్రోత్సహించడం మొదలైనవి.

 

డీ జీ, ఎన్‌ఎంసిజి, శ్రీ జి. అశోక్ కుమార్ సమావేశాన్ని  ఉద్దేశించి,దేశంలో ఉద్భవిస్తున్న నీటి కొరత, ముఖ్యంగా భూగర్భజలాల గురించి ఒక అవలోకనాన్ని అందించారు. గౌరవనీయ ప్రధాని ప్రోత్సహించి న సహజ వ్యవసాయంపై  2019లో కాన్పూర్‌లో జరిగిన అర్థ గంగా మొదటి సమావేశంలో, నీటి కొరత మరియు నీటి కలుషిత సమస్యల పరిష్కారానికి, చివరికి గంగా మరియు దాని ఉపనదుల పునరుజ్జీవనానికి దోహదపడిందని ఉద్ఘాటించారు.

 

"భారతదేశంలో ఆహార భద్రత కోసం 1960 లలో హరిత విప్లవం వచ్చింది, దీనిలో రైతులు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు, మనందరికీ  ఆహారం అందించినందుకు ముఖ్యంగా హర్యానా మరియు పంజాబ్ రైతులకు దేశం రుణపడి ఉంది, "అయితే, ఇబ్బందికరం అయినప్పటికీ, ఆ సమయంలో గొట్టపు బావులు మరియు బోరు బావుల వినియోగం కూడా పెరిగింది మరియు వివిధ కారణాల వల్ల కాలువ నీటిపారుదల కంటే భూగర్భ జలాల వెలికితీతకు ప్రాధాన్యత ఇవ్వబడింది" అని శ్రీ కుమార్ చెప్పారు. భూగర్భ జలాల వెలికితీత మరియు సాంకేతికత మరియు క్రిమిసంహారక మందులను విస్తృతంగా ఉపయోగించడం వల్ల నీటి కొరత మరియు కాలుష్యం ఏర్పడిందని మరియు ముఖ్యంగా మనం ప్రకృతితో సంబంధాన్ని కోల్పోయామని శ్రీ కుమార్ తెలిపారు. "స్నేహపూర్వక బ్యాక్టీరియా అంతరించిపోయింది, కాబట్టి వానపాములు మరియు వివిధ వ్యాధులకు దారితీసే పురుగుమందుల వాడకం వల్ల నేల నాణ్యత క్షీణిస్తోంది," అని ఆయన అన్నారు, "దీనిని దృష్టిలో ఉంచుకుని, గౌరవనీయ ప్రధాన మంత్రి, సహజ వ్యవసాయానికి మారడం మరియు నీటి నిర్వహణ మరియు ఆహార సాగు కోసం మన పూర్వీకుల జ్ఞానంపై ఆధారపడటంపై ఉద్ఘాటిస్తున్నారు.

 

శ్రీ కుమార్ గౌరవ ప్రధాని నమామి గంగే కార్యక్రమం యొక్క అవలోకనాన్ని అందించారు. 2014లో ప్రధానమంత్రి బడ్జెట్‌తో రూ. 20000 కోట్లు కేటయించారు. గంగా నది నీటి నాణ్యతలో నమామి గంగే తెచ్చిన సానుకూల ప్రభావం గురించి మరియు అభివృద్ధి చెందుతున్న జీవవైవిధ్యం గంగా నది యొక్క నిర్మలత మరియు అవిరలత కు నిదర్శనమని ఆయన సమావేశానికి తెలియజేశారు. అర్థ గంగా భావనను వివరిస్తూ, శ్రీ కుమార్ మాట్లాడుతూ, ఆర్థ్ గంగా లో సహజ వ్యవసాయం అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి అని, అందువల్ల, గంగా పరివాహక ప్రాంతం లోని రైతులలో 'సహజ వ్యవసాయాన్ని' పరస్పరం   ప్రోత్సహించడానికి ఎన్‌ఎంసిజి సహకార భారతితో చేతులు కలిపిందని అన్నారు. 'సహజ వ్యవసాయం'' ద్వారా ' ప్రత్తి నీటి బొట్టు కు నికర అధిక ఆదాయం'' ఎలా పొందాలనే దానిపై శిక్షణా కార్యక్రమాలు.

 

శ్రీ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో నేషనల్ వాటర్ మిషన్ ద్వారా చేపట్టిన కొన్ని వినూత్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ,వరి నుండి మంచి లాభం మరియు తక్కువ నీటి వినియోగం కోసం మొక్కజొన్న సాగుకు రైతులను మళ్లించే లక్ష్యంతో 'సాహి ఫసల్' కార్యక్రమంలో భాగంగా కురుక్షేత్రలో 1500 మంది రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  వాన నీటిని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు వర్షిస్తే అప్పుడు ఒడిసి పట్టుకోండి (క్యాచ్ ద రెయిన్: వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్) మరో కార్యక్రమం ప్రారంభించబడింది. 2021 మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వర్షపు నీటిని ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేసుకోవాలని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. మన భావి తరాలకు నీటి భద్రతతో కూడిన భవిష్యత్తును అందించడానికి ఆనకట్టలను నిర్మించే సంప్రదాయ విధానం నుండి వర్షపు నీటి సంరక్షణకు తక్షణం మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

***


(Release ID: 1865525) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi