పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
భారత రాష్ట్రపతి స్వచ్ఛ భారత్ దివస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ప్రతి ఇంటికి కుళాయి నీరు, మరుగుదొడ్లు విద్యుత్ అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది: గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
Posted On:
02 OCT 2022 5:50PM by PIB Hyderabad
ఈరోజు న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ దివస్‌ను పురస్కరించుకుని జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి మతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె వివిధ విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆలోచనలు శాశ్వతమైనవని ఆమె అన్నారు. సత్యం అహింస వలె, ఆయన పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమన్న చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పరిశుభ్రతపై ఆయన సంకల్పం సామాజిక వక్రీకరణను తొలగించి, కొత్త భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయన జన్మదినాన్ని 'స్వచ్ఛ భారత్ దివస్'గా జరుపుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. 2014లో 'స్వచ్ఛ్ భారత్ మిషన్-గ్రామీణ్' ప్రారంభించినప్పటి నుంచి 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, దాదాపు 60 కోట్ల మంది బహిరంగ మలవిసర్జన అలవాటును మార్చుకున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మిషన్ ద్వారా, భారతదేశం 2030 గడువుకు పదకొండేళ్ల ముందు ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్య సంఖ్య ఆరోస్థానాన్ని సాధించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింఘాల్ కూడా హాజరయ్యారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ -గ్రామీణ్ గురించి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి మార్గదర్శనంలో 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని 10కోట్లకు పైగా కుళాయి నీటి కనెక్షన్లు గ్రామీణ గృహాలకు అందించామని అన్నారు. జన్ భగీదరీ ఆందోళనతో స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ కృషి చేస్తోందని అన్నారు. స్వచ్ఛత కోసం ఈ జన్ ఆందోళన్ దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలని ఆయన అన్నారు.ప్రతి ఇంటికి కుళాయి నీరు, మరుగుదొడ్లు విద్యుత్ అందించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సింగ్ అన్నారు.
పంచాయితీ రాజ్ కార్యదర్శి సునీల్ కుమార్ ప్రసంగిస్తూ జల్ జీవన్ మిషన్ , ఓడీఎఫ్ ప్లస్‌లలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమైన అంశం. ఈ రెండు పథకాల నిర్వహణ బాధ్యత గ్రామపంచాయతీలపై ఉందని అన్నారు.సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మంచి సేవలు అందిస్తే ప్రజలు సర్వీస్ ఛార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.పంచాయతీలు ముందుకు వచ్చి రాష్ట్ర అధికారులను కలుపుకొని సన్నద్ధమవుతున్నాయని అన్నారు. సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో నివాసితులకు ఈ సేవను అందించడానికి ప్రయత్నించాలని సూచించారు.
(Release ID: 1865330)
Visitor Counter : 127