రక్షణ మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచారం -2.0 పురోగతిని సమీక్షించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
04 OCT 2022 3:28PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచారం 2.0 పురోగతిని పర్యవేక్షించే క్రమంలో భాగంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 4 అక్టోబర్ 2022న న్యూ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు మరియు పారిశుధ్య సిబ్బందితో ఆయన స్వచ్ఛత విషయంపై ప్రమాణం చేయించారు. ప్రాంగణాన్ని ఎంతో శుభ్రంగా మరియు చక్కగా ఉంచడంలో అధికారుల తీరును ప్రశంసించారు. ఇందుకు గాను కృషి చేస్తున్న స్వచ్ఛత వీరులను సత్కరించారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లి దానిని దేశ వ్యాప్త ఉద్యమంగా మార్చారని రక్షణ మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే, ప్రజలలో అవగాహనను పెంపొందించే స్వచ్ఛతా ఉద్యమం ప్రారంభించిన తర్వాత దేశంలోని నగరాలు మరియు గ్రామాలు నేడు మరింత పరిశుభ్రంగా ఉంటున్నాయని మంత్రి అన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ప్రత్యేక ప్రచారం 2.0 ఇటీవల 2 అక్టోబర్ 2022 నుండి 31 అక్టోబర్ 2022 వరకు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫీల్డ్/అవుట్‌స్టేషన్ కార్యాలయాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించబడుతోంది. స్పేస్ మేనేజ్‌మెంట్ మరియు పని ప్రదేశ అనుభవాన్ని పెంపొందించడంపై ఇది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పబ్లిక్ ఇంటర్‌ఫేస్ మరియు సర్వీస్ డెలివరీకి బాధ్యత వహించే కార్యాలయాలకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
రికార్డు స్థాయిలో 44276 ఫైళ్లు సమీక్ష..
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం- 1.0 సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖలోని రికార్డు స్థాయిలో 44276 ఫైళ్లు సమీక్షించబడ్డాయి. 16696 ఫైళ్లు తొలగించబడ్డాయి. 833 బహిరంగ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, 187790 చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయబడింది మరియు ప్రచార సమయంలో కార్యాలయ స్క్రాప్ అమ్మకం ద్వారా 2.09 కోట్ల ఆదాయం లభించింది.
***
(Release ID: 1865226)
Visitor Counter : 149