ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

రేపు గుజరాత్‌లో పర్యటించనున్న కేంద్ర సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


సురేంద్రనగర్ & రాజ్‌కోట్‌లో విద్యార్థులు, అంకుర సంస్థలు & వ్యవస్థాపకులతో భారత యువత కోసం ప్రధానమంత్రి నవ భారత విజన్‌ను పంచుకోనున్నారు.

Posted On: 02 OCT 2022 5:52PM by PIB Hyderabad

 కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రేపటి నుండి గుజరాత్‌లో పర్యటించనున్నారు.

యువ భారతీయులపై ప్రభుత్వం దృష్టి సారించడంలో భాగంగా విద్యార్థులుఅంకుర సంస్థలు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశం కానున్నారు. యువతకు వారి ముందున్న జీవన ప్రగతి కోసం ప్రభుత్వం అందించే అనుకూలమైన వాతావరణాన్నిగురించి చర్చించనున్నారు. న్యూ ఇండియా ఫర్ యంగ్ ఇండియా: టెక్కేడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ సమావేశం యొక్క ఇతివృత్తం.

కేంద్రమంత్రి ఈ పర్యటనలో భాగంగా నాలుగు విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు. అవి సురేంద్రనగర్‌లోని సీ యూ విశ్వవిద్యాలయం, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంఆర్కే విశ్వవిద్యాలయం, రాజ్‌కోట్‌లోని మార్వాడీ విశ్వవిద్యాలయం

రేపటి ప్రయాణంలో భాగంగా మంత్రి సురేంద్రనగర్‌లోని సి యు విశ్వవిద్యాలయాన్ని మొదట సందర్శించనున్నారు. అక్కడ అంకుర సంస్థలు, విద్యార్థులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ సహాయ మంత్రిస్థానిక పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మహేంద్ర ముంజపర ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

అనంతరం శ్రీ చంద్రశేఖర్ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆర్కే విశ్వవిద్యాలయంలో విద్యావేత్తలువాణిజ్య, పరిశ్రమల ప్రముఖులతో సమావేశమవుతారు.

మరుసటి రోజుమంత్రి సౌరాష్ట్ర మరియు మార్వాడీ విశ్వవిద్యాలయాలను సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులుస్టార్టప్‌లుఆవిష్కర్తలు మరియు విద్యావేత్తలతో పరస్పర చర్చలు జరుపుతారు.

రాజ్‌కోట్‌లో సీఐఐ పరిశ్రమల నేతలుప్రతినిధులతోనూ మంత్రి సమావేశం కానున్నారు.

 భారతదేశపు మొట్టమొదటి మరియు అతిపెద్ద వైర్‌లెస్ సెల్యులార్ నెట్‌వర్క్‌ను నిర్మించినస్వయంగా టెక్నోక్రాట్ అయినవిజయవంతమైన వ్యవస్థాపకుడు శ్రీ చంద్రశేఖర్అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో నైపుణ్యాలను సంపాదించడానికి వారిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు అంకుర సంస్థలతో ఇటువంటి అద్భుతమైన సెషన్‌లను నిర్వహిస్తున్నారు. "ఇన్నోవేషన్ అనేది ముందుకు సాగడానికి మంత్రం. స్టార్టప్‌లుఇన్నోవేటర్లు వ్యవస్థాపకులు భారతీయ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల వైపు డిజిటల్ ఎకానమీని  1 ట్రిలియన్ డాలర్ దిశగా నడిపిస్తారు" అని ఆయన పేర్కొన్నారు.

 

***



(Release ID: 1864675) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi