నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌పై సామర్థ్య నిర్మాణ కార్యక్రమం
प्रविष्टि तिथि:
02 OCT 2022 12:36PM by PIB Hyderabad
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (ఎన్ఐఈఎస్బియుడి), నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అత్యున్నత సంస్థ. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల కోసం దాని నోయిడా క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌పై 5 రోజుల సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని ఎంఎస్ఎంఈ శాఖ, పరిశ్రమల డైరెక్టరేట్, ఉత్తరాఖండ్ ప్రభుత్వం సౌజన్యంతో నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని వివిధ జిల్లాల నుండి డెవలప్‌మెంట్, ప్రమోషనల్ రోల్‌లో ఉన్న మొత్తం 29 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు, డైరెక్టరేట్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లోని కీలక అంశాలపై అధికారుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ ఉత్తరాఖండ్ డైరెక్టర్ శ్రీ ఎస్ సి నౌటియల్ హాజరయ్యారు. ఉత్తరాఖండ్‌లో వ్యవస్థాపక వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఎన్ఐఈఎస్బియుడి, డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కలిసి పనిచేస్తున్నాయని శ్రీ నౌటియల్ పేర్కొన్నారు. క్రమబద్ధమైన, ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల ద్వారా వ్యవస్థాపకత కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఇటువంటి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు మరింత సహాయపడతాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం కోసం ఎన్ఐఈఎస్బియుడి తో కలిసి పనిచేస్తున్నందుకు సంస్థ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ సిన్హా శ్రీ నౌటియల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఐఈఎస్బియుడి, డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కలిసి రాష్ట్ర స్థాయిలో వ్యవస్థాపకత ప్రదేశంలో శక్తివంతమైన, కనిపించే ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు. వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సినర్జీని రూపొందించడానికి ఇప్పటికే ఉన్న వనరులను సమగ్రపరచడం ద్వారా మరింత ప్రయోజనం పొందుతుందని డాక్టర్ సిన్హా పేర్కొన్నారు. కార్యక్రమం వారి జ్ఞానం, అనుభవం, నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని తెలిపారు

ఉత్తరాఖండ్ పరిశ్రమల డైరెక్టర్ శ్రీ ఎస్ సి నౌటియల్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

శిక్షణలో భాగంగా సెషన్

పాల్గొన్నవారికి సర్టిఫికేట్ అందజేస్తున్న శ్రీ ఎస్ సి నౌటియాల్
*****
(रिलीज़ आईडी: 1864570)
आगंतुक पटल : 174