జల శక్తి మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్, 2022ను జరుపుకోనున్న జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని మంచినీరు, పారిశుధ్య విభాగం
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022, స్వచ్ఛతా హీ సేవా 2022, సుజ్లాం 1.0 అండ్ 2.0, జల్ జీవన్ మిషన్ ఫంక్షనాలిటీ అసెస్ మెంట్, హర్ ఘర్ జల్ సర్టిఫికేషన్ అండ్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ అవార్డులను ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి
Posted On:
01 OCT 2022 3:56PM by PIB Hyderabad
అక్టోబర్ 2న జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ ఎస్ జి) 2022, స్వచ్ఛతా హీ సేవా 2022, సుజ్లాం 1.0 అండ్ 2.0, జల్ జీవన్ మిషన్ (జెజెఎమ్) ఫంక్షనాలిటీ అసెస్మెంట్, హర్ ఘర్ జల్ సర్టిఫికేషన్ , స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ ల అవార్డులను ప్రదానం చేయనున్నారు.
జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని మంచినీరు, పారిశుధ్య విభాగం (డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్ మెంట్ -డిడిడబ్ల్యుఎస్) స్వచ్ఛ భారత్ దివస్-2022ను అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ రెండు ప్రాధాన్యతా (ఫ్లాగ్ షిప్) కార్యక్రమాలు- స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్ బి ఎమ్ -జి), జల్ జీవన్ మిషన్ (జెజెఎమ్ ) లను ఈ శాఖ అమలు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జనను నిరోధించాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 2వ తేదీన ఎస్ బి ఎమ్ -జి ని ప్రారంభించారు. దేశంలోని అన్ని గ్రామాలు తమను తాము బహిరంగ మలవిసర్జన రహితం (ఓ డి ఎఫ్ ) గా ప్రకటించుకున్నాయి. ఆ తరువాత, గ్రామాల్లో ఓ డి ఎఫ్ స్థితిని కొనసాగించడానికి,ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత స్థాయిని మెరుగుపరచడానికి, తద్వారా గ్రామాలు ఓ డి ఎఫ్ ప్లస్ గా మారడానికి 2020 లో ఎస్ బి ఎమ్ -జి 2.0 ను ప్రారంభించారు.
2019 ఆగస్టు 15న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించారు. ప్రారంభ సమయంలో, కేవలం 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్ అందుబాటులో ఉంది. రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో చేసిన అవిశ్రాంత కృషితో, నేడు 10.27 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో కుళాయిల ద్వారా నీటిని పొందుతున్నాయి. ఈ రెండు ప్రధాన
కార్యక్రమాలను అమలు చేయడంలో రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల ఉత్తమ
ప్రయత్నాలను గుర్తించడానికి డిపార్ట్ మెంట్ వివిధ పోటీలు, క్యాంపెయిన్ లు ,సర్వేక్షన్
లను నిర్వహించింది ఒడిఎఫ్ ప్లస్ ,హర్ ఘర్ జల్ అమలు వేగాన్ని పెంచేలా మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/ జిల్లాలను విజ్ఞాన్ భవన్లో లో జరిగే కార్యక్రమం లో సత్కరిస్తారు. ఎస్ బిఎమ్-జి , జెజెఎమ్ ల కింద ఈ అవార్డులను భారత రాష్ట్రపతి , కేంద్ర జల్ శక్తి మంత్రి ఈ క్రింది కేటగిరీల కింద ప్రదానం చేస్తారు
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2022
కీలక పరిమాణాత్మక , గుణాత్మక ఎస్ బిఎమ్-జి ప్రామాణికాలపై సాధించిన పనితీరు ఆధారంగా రాష్ట్రాలు , జిల్లాల ర్యాంకింగ్ ని చేపట్టడం , విస్తృత, సంపూర్ణ ఐ ఇ సి క్యాంపెయిన్ ద్వారా తమ పారిశుధ్య స్థితిని మెరుగుపరచడంలో గ్రామీణ సమాజాన్ని నిమగ్నం చేయడం, ప్రతి జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామ పంచాయితీలు పౌరులతో నిమగ్నం కావడం కోసం సర్వేక్షణ్ ను ఉద్దేశించారు.
వాల్ పెయింటింగ్ - ఓ డి ఎఫ్ ప్లస్ లో ఒక జాతీయ స్థాయి వాల్ పెయింటింగ్ ప్రచారం కూడా 15 ఆగస్టు 2021 న ప్రారంభించబడింది. ప్రతి జోన్ నుండి ప్రతి థీమ్ పై మూడు ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు అవార్డులు ఇస్తారు. బిడబ్ల్యుఎమ్, గోబర్ధన్, పిడబ్ల్యుఎమ్, జిడబ్ల్యుఎమ్ అండ్ ఎఫ్ ఎస్ ఎమ్ అనే ఐదు ఇతివృత్తాలు (థీమ్) లు ఉన్నాయి.
ఎన్ ఎఫ్ సి అవార్డులు
గ్రామ పంచాయితీల కోసం ఒక జాతీయ స్థాయి చలనచిత్ర పోటీని 2021 డిసెంబర్ 15న ఓ డి ఎఫ్ ప్లస్ లోని వివిధ భాగాలపై ప్రారంభించారు. మూడు కేటగిరీలకు అవార్డులు ఇస్తారు. అవి: కొండ ప్రాంతం,, ద్వీపాలు , కేంద్రపాలిత ప్రాంతాలు. 33 చిత్రాలను ఈ అవార్డులకు రాష్ట్రాలు సిఫారసు చేశాయి, విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో వాటిని ప్రదానం చేస్తారు.
సుజలం 1, సుజలం II లకు అవార్డులు -
సుజలమ్ 1.0 అవార్డును ఈ సందర్భంగా “ఓ డి ఎఫ్ ప్లస్ సస్టైనబిలిటీ , సుజ్లాం 1.0" పై డిపార్ట్ మెంట్ ప్రారంభించిన 100 రోజుల ప్రచారం ఆధారంగా ఇస్తారు. గృహ ,కమ్యూనిటీ స్థాయి కోసం ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంకుడు గుంతలు నమోదు కావడం తో 15 ఫిబ్రవరి 2022 నాటికి సుజలం 1.0 లక్ష్యం పూర్తిగా సాధించబడింది. సుజలం 1.0 వేగాన్ని కొనసాగించడానికి, డిడిడబ్ల్యుఎస్ సుజలం 2.0 ను ప్రారంభించింది, ఇది కమ్యూనిటీ ,సంస్థాగత స్థాయి అంటే పంచాయితీ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు ఇతర ప్రభుత్వ సంస్థలలో గ్రేవాటర్ మేనేజ్ మెంట్ ఆస్తులను సృష్టించడంపై దృష్టి సారించింది.30 జూన్ 2022 నాటికి దీని కింద గృహ ,కమ్యూనిటీ స్థాయి లో ఒక మిలియన్ కు పైగా ఇంకుడు గుంతలు నిర్మించబడ్డాయి
స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ అవార్డులు
గ్రామీణ ప్రాంతాల్లో ఘన ,ద్రవ వ్యర్థాల నిర్వహణ సవాళ్లకు స్థిరమైన, సహేతుక మైన, కొలవడగిన , ప్రతిస్పందించగల పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్కౌట్ టెక్నాలజీలకు డి డి డబ్ల్యుఎస్ ఒక స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ ను ఏర్పాటు చేసింది.గ్రామ స్థాయిలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో 'సంపూర్ణ స్వచ్ఛత'ను సాధించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. స్టార్టప్ లు, టెక్నాలజీ ప్రొవైడర్ లు, టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏడు కేటగిరీల కింద గ్రాండ్ ఛాలెంజ్ లోపాల్గొన్నారు.
ఫంక్షనాలిటీ అసెస్ మెంట్ 2022 అవార్డులు -
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక నీటి యుటిలిటీల పనితీరును మదింపు చేయడం కోసం ప్రతి సంవత్సరం జెజెఎమ్ ద్వారా గృహాల్లో వాటర్ సర్వీస్ డెలివరీ స్థితిని గ్రహించడానికి ఒక నిర్వహణ పరమైన అంచనా ప్రక్రియ (ఫంక్షనాలిటీ అసెస్ మెంట్ ఎక్సర్ సైజ్ ) ను చేపడతారు. బిఐఎస్: 10500 స్టాండర్డ్ పై 55 ఐ పి సి డి నీటిని రెగ్యులర్ గా అందించినట్లయితే మాత్రమే కుళాయి వాటర్ కనెక్షన్ ఫంక్షనల్ గా రిఫర్ చేయబడుతుంది. ఈ ఏడాది 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 712 జిల్లాల్లో 3.01 లక్షల కుటుంబాలు, 22,596 గ్రామ స్థాయి సంస్థల్లో ఫంక్షనాలిటీ అసెస్ మెంట్ నిర్వహించబడింది. కనుగొన్న వాటి వివరాలను నివేదిక ద్వారా తెలుసుకోవచ్చు.
స్వచ్ఛభారత్ దివస్ అనేది ఒకే ఒక్క కార్యక్రమం కాదు, ఎస్ బి ఎమ్-జి ఫేజ్ II భాగాల పై అనేక కార్యకలాపాలు/ప్రచారాల సమ్మేళనం. ఈవెంట్ కోసం క్రింది కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి.
స్వచ్ఛతా హీ సేవ (ఎస్ హెచ్ ఎస్) -
ఇది దేశంలో పరిశుభ్రతను కొనసాగించడం కోసం ప్రజల "శ్రమదానం" తో పక్షం రోజులకొకసారి జరిగే ప్రచారం. గ్రామీణ భారతదేశం అంతటా, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను, పేరుకుపోయిన చెత్త nu తొలగించడం కోసం ఇది ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసే కార్యక్రమం. ఈ క్యాంపెయిన్ సెప్టెంబర్ 15న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఎస్ హెచ్ ఎస్ కార్యకలాపాలలో పాల్గొన్నారు. వాటిలో కింది కార్యకలాపాలు ముఖ్యమైనవి:
ఎ) గ్రామాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు చెత్తతో హాని కలిగించే ప్రదేశాలను శుభ్రం చేయడం,
జలాశయం చుట్టూ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం,
బి)పరీవాహక ప్రాంతంలో చెట్ల పెంపకం చేపట్టడం
సి)ఓ డి ఎఫ్ ప్లస్ ఎలిమెంట్ పై సర్పంచ్ సంవాద్ ల నిర్వహణ ,
డి)స్లోగన్ రాయడం ,"నో లిట్టరింగ్" దిశగా ప్రతిజ్ఞ తీసుకోవడం
ఇ)మూలం వద్ద వ్యర్థాలను (పొడిగా ,తడిగా) వేరు చేయడం కోసం కమ్యూనిటీ అవగాహన
ఎఫ్)వ్యర్థాల సేకరణ ,సెగ్రిగేషన్ షెడ్ లు/సెంటర్ ల నిర్మాణం
జి) జిఈఎమ్ ద్వారా ట్రైసైకిల్/ఇ-కార్ట్ (బ్యాటరీ ఆపరేటెడ్ వేహికల్) వంటి వ్యర్థాల సేకరణ వాహనాన్ని కొనుగోలు చేయడం
హెచ్) ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వంటి నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాల సేకరణ
ఐ) గ్రామసభ సమావేశాలు నిర్వహించడం, ఎస్ యుపి లపై నిషేధం కోసం తీర్మానాలను ఆమోదించడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ (ఎస్ యుపి) దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం
జె) ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్యం కోసం ‘తిరస్కరించడం, తగ్గించడం, తిరిగి ఉపయోగించడం , రీసైకిల్ చేయడం‘
అనే నాలుగు ‘ఆర్‘ (రిఫ్యూజ్, రెడ్యూస్ ,రీ యూజ్, రీ సైకిల్) సూత్రాన్ని ప్రోత్సహించడం
2.యునైటెడ్ ఇండియా ఫర్ స్వచ్ఛత
ఇది సంపూర్ణ పరిశుభ్రత కోసం ఒక వారం రోజుల పాటు నిర్వహించే ముమ్మర ప్రచార కార్యక్రమం - దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో 'సంపూర్ణ స్వచ్ఛత'. గత ఎనిమిది సంవత్సరాల్లో ఎస్ బిఎమ్ సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి రైల్వే స్టేషన్ లు, బీచ్ లు, స్కూళ్లు, ఎడబ్ల్యుసిలు మొదలైన వాటిల్లో కార్యక్రమాలు జరుగుతాయి.
***
(Release ID: 1864268)
Visitor Counter : 180