రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రైతులకు దీర్ఘకాలిక ఎరువుల సరఫరాను నిర్ధారించడానికి ప్రపంచ సరఫరాదారులతో భారత్‌ భాగస్వామ్యం: డాక్టర్ మన్సుఖ్ మాండవియా


- కొన్ని ప్ర‌పంచ స్థాయియి సంస్థ‌ల ద్వారా అంతర్జాతీయ స్థానికీకరణకు ఇది ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌న్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా

- "ఫాస్ఫాటిక్ ఎరువులు అంతర్జాతీయ మార్కెట్‌లో త‌గ్గుతున్న‌ ధోరణిని క‌న‌బ‌రుస్తున్నందున‌, ఫాస్ఫారిక్ యాసిడ్ వంటి ఎరువుల ముడి పదార్థాలలో కూడా అదే ధోరణి ప్రతిబింబించొచ్చు"

Posted On: 30 SEP 2022 3:14PM by PIB Hyderabad

"భారత రైతులకు ఎరువుల దీర్ఘకాలిక సరఫరాను నిర్ధారించడానికి ప్రపంచ సరఫరాదారులతో భారత దేశపు భాగస్వామ్యం అంతర్జాతీయ కార్టలైజేషన్‌ను కూడా పరిష్కరిస్తుంది" అని అన్నారు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి
డాక్టర్ మన్సుఖ్ మాండవియా.  ఈరోజు ఇక్కడ దుబాయ్‌లోని మెస్స‌ర్స్ అగ్రిఫీల్డ్స్ సంస్థ‌తో మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ చేసుకున్న‌ అవగాహన ఒప్పందం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. దేశంలోని వ్యవసాయ సమాజానికి డీఏపీ, ఎన్‌పీకే ఎరువుల లభ్యతను మెరుగుపరిచే క్ర‌మంలో ఈ ఒప్పందం కీల‌క ఘ‌ట్టమ‌ని పేర్కొన్నారు.  మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ  దుబాయ్‌లోని మెస్స‌ర్స్‌ అగ్రిఫీల్డ్స్ నుండి సంవత్సరానికి 30,000 ఎంటీల మేర  ఫాస్ఫారిక్ యాసిడ్ సొల్యూషన్‌ను మూడు సంవత్సరాల పాటు కొనుగోలు చేయడానికి ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ పరిమాణంలో ఫాస్ఫారిక్ యాసిడ్‌ని ఉపయోగించడం ద్వారా సుమారు 1.67 ఎల్ఎంటీ ఎన్‌పీకేలు ఉత్పత్తి చేయబడతాయి. ఇది ఎంఎఫ్ఎల్‌ యొక్క కాంప్లెక్స్ ఎరువుల మొత్తం స్థాపిత సామర్థ్యంలో (2.8 ఎల్ఎంటీ) 59.6% ఉత్పత్తి చేయడానికి పీ2ఓ5 అవసరాన్ని తీరుస్తుంది.  “ఎరువుల సరఫరాలో ఎక్కువ‌గా నెల‌కొన్న అనిశ్చితి నేపథ్యంలో అమ‌లులోకి వ‌స్తున్న ఈ అవ‌గాహ‌న‌ ఒప్పందం  డీఏపీ మరియు ఎన్‌పీకేలు, కార్టలైజేషన్ ద్వారా నిర్వహించే కొద్ది మంది గ్లోబల్ ప్లేయర్‌ల కంటే కూడా ఆర్థిక వ్యవస్థల సజావుగా సాగడంలో బలమైన పాత్ర పోషిస్తుంద‌ని కేంద్ర మంత్రి ప్ర‌ధానంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫాస్ఫాటిక్ ఎరువులు వినియోగం తగ్గుముఖం పట్టినందున, రాబోయే త్రైమాసికాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ వంటి ఎరువుల ముడి పదార్థాలపై కూడా అదే ధోరణి కనిపించ‌వ‌చ్చ‌ని అన్నారు. డీఏపీ ఇతర సంక్లిష్ట ఎన్‌పీఏ ఎరువుల తయారీకి ఫాస్ఫారిక్ యాసిడ్ ఒక ముఖ్యమైన ముడి సరుకు అని డాక్టర్ మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. ముడి సరుకు, ఎరువుల‌ ఖనిజాల దిగుమతులపై భారత దేశం ఎక్కువగా ఆధారపడుతున్నందున, భారత రైతులకు పీ& కే ఎరువుల స్థిరమైన దీర్ఘకాలిక లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం ప్రపంచ ఉత్పత్తిదారులు మరియు సరఫరాదారులతో సరఫరా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటోంద‌ని తెలిపారు. రాబోయే పంటల సీజన్‌కు ముందే ఇలాంటి అవగాహన ఒప్పందాల యొక్క ప్రాముఖ్యత ఎంత‌గానో ఉంటోంద‌ని నొక్కిచెప్పారు, ఇది దేశంలోనే కాకుండా ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందని ఆయన బ‌లంగా తెలిపారు.

***



(Release ID: 1864201) Visitor Counter : 104


Read this release in: Urdu , English , Hindi