ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022-23 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో కేంద్రప్రభుత్వ రుణ సేకరణ ప్రణాళిక
Posted On:
29 SEP 2022 5:26PM by PIB Hyderabad
రిజర్వ్ బ్యాంకును సంప్రదించిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో అర్ధభాగంలో సేకరించాల్సిన రుణాల ప్రణాళికను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సేకరించాల్సిన రుణాల ప్రతిపాదిత మొత్తం రూ. 14.31 లక్షల కోట్లయితే అందులో రూ.14.21 లక్షల కోట్ల రుణాలను తీసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఆర్థిక సంవత్సర రెండో అర్థభాగంలో రూ.5.92 లక్షల కోట్ల రుణాలను తీసుకోబోతున్నారు. ఈ పనిని సెక్యూరిటీ బాండ్ల అమ్మకంద్వారా చేస్తారు. ఇందులో సావరిన్ గ్రీన్ బాండ్ల అమ్మకం ( సార్వభౌమ హరిత బాండ్లు)ద్వారా రూ.16వేల కోట్ల రుణం సేకరిస్తారు. ఈ పనిని ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేంద్రబడ్జెట్లో ప్రకటించిన ప్రకారం చేస్తారు.
రెండో ఆర్థిక సంవత్సరంలో సేకరించాల్సిన రుణాల మొత్తంలో రూ. 5.76 లక్షల కోట్లను వారం వారం చేసే వేల ప్రక్రియద్వారా సేకరిస్తారు. మార్కెట్ నుంచి తీసుకునే రుణ విధానమనేది 2,5, 7,10, 14, 30, 40 సంవత్సరాలపాటు చెల్లుబాటయ్యే సెక్యూరిటీలద్వారా చేస్తారు. బాండ్ల కాల పరిమితి ప్రకారం ఆయా పరిమితులకు రుణాల శాత పంపిణీని చూస్తే ( సార్వభౌమ హరిత బాండ్లను మినహాయించి) రెండు సంవత్సాల బాండ్లు 6.25శాతంగా వుంటాయి..ఈ విధంగా 5 సంవత్సరాలవి 12. 15శాతం, 7 సంవత్సరాలవి 10.42శాతం, 10 సంవత్సరాలవి 20.83శాతం, 14 సంవత్సరాలవి 19.10 శాతం, 30 సంవత్సరాలవి 15.63శాతంగా నిర్ణయించారు. ఇక సార్వభౌమ హరిత బాండ్ల విడుదలకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా ప్రకటించడం జరుగుతుంది. రిడెంప్షన్ ప్రొఫైల్ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొనకుండా వుండడంకోసం ప్రభుత్వం స్విచ్ ఆపరేషన్లను కొనసాగిస్తుంది. బడ్జెట్ లో చెప్పిన రూ. 1 లక్షకోట్ల స్విచ్ మొత్తంలో రూ 56, 103 కోట్ల స్విచ్ వేలాలను ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన మొత్తానికి సంబంధించిన స్విచ్ వేలాలను ఆర్థిక సంవత్సర రెండో భాగంలో పూర్తి చేస్తారు.
ప్రభుత్వ అకౌంట్లలో వచ్చే తాత్కాలిక అసమానతలను సవరించడంకోసం ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో వేస్ అండ్ మీన్స్ కింద రూ. 50వేలకోట్లను తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతినిచ్చింది. మరింత సమాచారం కోసం కేంద్ర ఆర్థికశాఖ, రిజ్వర్ బ్యాంకులకు చెందిన వెబ్ సైట్లను సంప్రదించగలరు.
***
(Release ID: 1864075)
Visitor Counter : 225