సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఇండియా , సింగపూర్‌లు ఫిన్‌టెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్‌సెక్యూరిటీ, నైపుణ్యశిక్షణ, స్మార్ట్ సిటీ పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధనం, ఆహార భద్రత వంటి రంగాలలో సన్నిహిత సబంధాలను కలిగి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్‌జితేంద్ర సింగ్ అన్నారు.
సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి, సింగపూర్ పబ్లిక్ సర్వీస్ డిపార్టమెంట్ శాశ్వత కార్యదర్శి శ్రీ లోహ్ ఖుమ్ యాన్ నాయకత్వంలో ఒక ఉన్నతస్తాయి ప్రతినిధి వర్గం ఈరోజు న్యూఢిల్లీలో ని నార్త్ బ్లాక్ ఆఫీస్ లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకున్నారు.
పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలకు సంబంధించిన రెండో ద్వైపాక్షిక సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి డిఎఆర్‌పిజి సెక్రటరీ వి.శ్రీనివాస్, శ్రీ లోహ్ ఖుమ్ యాన్ లు సహ అధ్యక్షత వహించారు.
Posted On:
29 SEP 2022 3:46PM by PIB Hyderabad
సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి గా ఉన్న శ్రీ లోహ్‌ఖుమ్ యాన్ ప్రస్తుతం ఇండియాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర) భూ విజ్ఞాన శాస్త్ర (స్వతంత్ర) , పి.ఎం.ఓ శాఖ , సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో కలుసుకున్నారు.
సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి గా, సింగపూర్ పబ్లిక్ సర్వీస్ డిపార్టమెంట్ లో్ శాస్వత కార్యదర్శిగా ఉన్న లోహ్ ఖుమ్ యాన్ నాయకత్వంలోని సింగపూర్ ఉన్నతస్థాయి ప్రతినిధివర్గంతో మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, ఇండియా -సింగపూర్‌లు కీలకమైన ఫిన్‌టెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ భద్రత, నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధనవనరులు, ఆహార భద్రత వంటి రంగాలలో సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నట్టు చెప్పారు.
సింగపూర్ హైకమిషనర్ సైమన్‌వాంగ్ , ఉభయపక్షాల మధ్య జరిగిన ప్రతినిధి వర్గ స్థాయి చర్చలలో పాల్గొన్నారు.-
ఇండియా -సింగపూర్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరువైపులా అద్భుత ఫలితాలను ఇస్తోందని, ఈ ముఖ్యమైన బంధాన్ని వాణిజ్యం, రక్షణ, శాస్త్రవిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు, విద్య ,పాలన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాలలో మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇండియా -సింగపూర్ తొలి మినిస్టీరియల్ సమావేశం 2022 సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలో జరిగిందని, ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ సమావేశం జరిగిందని ఆయన అన్నారు. ఇది అద్భుతమైన సమావేశమని, ఇండియా -సింగపూర్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రత్యేకతకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఇది వినూత్న రంగాలలో ఇరుదేశాలమధ్య భాగస్వామ్య సహకారానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.
ఇండియా ,సింగపూర్‌లు ఎన్నో అంతర్జాతీయ ప్రాధాన్యత గల విభిన్న అంశాలపై సమ్మిళిత దృక్పధాన్ని కలిగి ఉన్నాయమి.అలాగే ఈ ఉభయ దేశాలూ జి-20, కామన్‌వెల్త్, ఐఒఆర్ ఎ ( ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్) ఈస్ట్ ఏసియా సమ్మిట్, ఐఒఎన్ ఎస్ ( ఇండియన్ ఓషన్ నావల్ సింపోసియం) వంటి పలు గ్రూపులలో భాగస్వాములుగా ఉన్నాయి. 2005లో సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందం (సిఇసిఎ) దరిమలా ఈ సంబంధాలు 2015 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్ సందర్శన దరిమలా వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి సింగపూర్ పర్యటించారు.
సింగపూర్ మంత్రి లోహ్ ఖుమ్ యాన్ , కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో మాట్లాడుతూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్.డి.ఐ)ని ఈక్విటీ రూపంలో ఇండియాకు తరలించే విషయంలో 2021-22 సంవత్సరంలో సింగపూర్ ప్రధాన దేశంగా ఉందని అన్నారు. సింగపూర్ నుంచి ఇండియాకు 2022 ఆర్ధిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 16 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండగలదని అంచనా.
సివిల్ సర్వీసుల ఎక్స్చేంజ్ కార్యక్రమం, పి.ఎం. ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను సందర్శించే ఏర్పాటు అంశాన్ని ఉభయ పక్షాలూ చర్చించాయి. ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్, వర్క్‌ఫోర్స్ అండ్ వర్క్‌ప్లేస్ ఆఫ్ సింగపూర్ సంస్థలు డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించనున్న ఇండియా -2047 తో కలసి సన్నిహితంగా పనిచేసేందుకు అంగీకరించాయి.
అంతకు ముందు, రెండో ద్వైపాక్షిక సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి డిఎఆర్‌పిజి సెక్రటరీ శ్రీ వి.శ్రీనివాస్, సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి, సింగపూర్ పబ్లిక్ సర్వీస్ డిపార్టమెంట్ (పిఎస్‌డి) శాశ్వత కార్యదర్శి లోహ్ ఖుమ్‌యాన్ లు ఉభయులూ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం సందర్భంగా ఉభయపక్షాలూ పాలనా సంస్కరణలకు సంబంధించి తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండియా తరఫున సుపరిపాలన ఇండెక్స్, నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసులు అందించడం, సిపిజిఆర్ ఎఎంఎస్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. సింగపూర్ వైపు సర్వీస్ డెలివరీ బెంచ్‌మార్కింగ్ స్టడీ,పౌరుల ఆధారిత పబ్లిక్ సర్వీసులు, భవిష్యత్ లోపని, శ్రామిక శక్తి, భవిష్యత్ పని ప్రదేశం గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
డిఎఆర్ పిజి కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్సనల్ మేనేజ్ మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో ఇండియా -సింగపూర్ ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎం.ఒ.యు) గురించి తెలియజేశారు.2018 జూన్ 1న ఈ ఎం.ఓ.యుపై సంతకాలు జరిగాయి. ప్రజాసేవలను అందుబాటులోకి తేవడం, మానవ వనరుల నిర్వహణ, ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణ, నాయకత్వం, టాలంట్ డవలప్‌మెంట్, ఈ గవర్నెన్స్, డిజిటల్ గవర్నమెంట్ వంటి అంశాలలో పరస్పర సహకారానికి కీలక అంశాలుగా గుర్తించారు. 2018 జూన్ లో ఈ ఎం.ఓ.యుపై సంతకాల అనంతరం ఉభయ పక్షాలూ 2021 జూలై 6న తొలి రౌండ్ ద్వైపాక్షిక సమావేశాన్ని కోవిడ్ మహమ్మారి కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించినట్టు ఆయన చెప్పారు..
ఈ ఎం.ఓ.యు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వర్క్‌షాప్‌లద్వారా, సదస్సులు, సమావేశాల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం, నిపుణుల చేత ఉపన్యాసాలు ఇప్పించడం, సామర్ధ్యాల నిర్మానం, ఉభయ దేశాలకూ ఉమ్మడి ప్రయోజనం కలిగించే అంశాల విషయంలో పరిశోధనను ముందుకు తీసుకుపోవడం, ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇవ్వడం వంటి వాటికి దోహదపడనున్నది.
సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఉభయ పక్షాలూ ప్రజా పాలన, పాలనా సంస్కరణల విషయంలో అత్యుత్తమ విధానాల పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కొనసాగించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే వాటి నమూనాలను రూపొందించి అమలు చేసేందుకుగల సాధ్యాసాధ్యాలను ఉభయ దేశాలూ పరిశీలించవచ్చని అన్నారు.
***
(Release ID: 1863537)
Visitor Counter : 113