నౌకారవాణా మంత్రిత్వ శాఖ
'చింతన్ బైఠక్ ‘“ లో అర్ధ వార్షిక పురోగతి , విజయాలను సమీక్షించిన శ్రీ సర్బానంద సోనోవాల్
ఓడరేవు అధికారులు వ్యాపారాల భవిష్యత్తు అవసరాల కోసం తమ ఓడరేవులకు భూమి పునరాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి: శ్రీ సర్బానంద సోనోవాల్
ఎమ్ ఐ వి - 2030 లక్ష్యాలను సాధించే దిశగా దృఢ సంకల్పంతో పనిచేయాలని, ప్రధాన మంత్రి కలలను నెరవేర్చేలా 2047 దార్శనికత పై దృష్టి పెట్టాలని శ్రీ సర్బానంద సోనోవాల్
పిలుపు
Posted On:
29 SEP 2022 4:34PM by PIB Hyderabad
కేంద్ర రేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు ఢిల్లీలో మంత్రిత్వ శాఖ 'చింతన్ బైఠక్ ' కు అధ్యక్షత వహించారు. అన్ని ప్రధాన రేవుల ఛైర్ పర్సన్లు, పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ (ఎంఓపిఎస్ డబ్ల్యు) మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఈ బైఠక్ కు హాజరయ్యారు. అసెట్ మానిటైజేషన్; నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్; గత బైఠక్ లలో ప్రతి పోర్టు గుర్తించిన సృజనాత్మక ప్రాజెక్టుల అమలు , ఓడరేవుల్లోని అన్ని వే బ్రిడ్జి ల ఆటోమేషన్; ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం స్థితి వంటి భారత ప్రభుత్వ వివిధ చొరవలు, కార్యక్రమాల పురోగతి ప్రధాన అంశాలుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా శ్రీ సోనోవాల్ బ్లూ ఎకనామిని అభివృద్ధి,
ప్రోత్సాహానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావించారు.

ప్రభుత్వ మొత్తం వ్యయ లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా మంత్రిత్వ శాఖ మూలధన వ్యయ లక్ష్యాలను సాధించడం పై చర్చించారు. అన్ని ప్రధాన ఓడరేవులు కూడా తమ అందుబాటులో ఉన్న భూమిని గరిష్టంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వ్యాపారం లో రాబోయే అవసరాలను తీర్చడానికి , భవిష్యత్తు అవసరాలు , పెట్టుబడులకు వాటిని సిద్ధం చేయడానికి ఒక భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి.

సముద్ర రంగంలో హరిత పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి అన్ని ఓడరేవులు అనేక కార్యక్రమాలు చేపట్టినందున, గ్రీన్ షిప్పింగ్ ను ప్రోత్సహించడం , ఓడరేవు కార్యకలాపాల నుండి కార్బన్ ఉనికిని తగ్గించడంపై దృష్టి సారించాలని సమావేశంలో చర్చించారు.
ఓడల నుండి వ్యర్థాల కోసం తీర రిసెప్షన్ సదుపాయాన్ని అభివృద్ధి చేయడం, పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం, నౌకాశ్రయాల ఓడలకు తీర విద్యుత్తును అందించడం, అన్ని ఓడరేవుల వద్ద ఆయిల్ స్పిల్ రెస్పాన్స్ (టైర్ -1) సామర్థ్యాలను సృష్టించడం, టెర్మినల్ డిజైన్, అభివృద్ధి , ఆపరేషన్ లో సుస్థిర విధానాలను చేర్చడం, ఓడరేవుల ప్రాంగణాల్లో పచ్చదనాన్ని పెంచడం మొదలైన వివిధ గ్రీన్ పోర్ట్ చొరవల గురించి కూడా చర్చించారు. .
ఈ సమావేశం సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, 'ఈ చింతన్ బైఠక్ సమావేశం సందర్భంగా జరిగిన విస్తృత చర్చలు 'రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ ఫార్మ్' అనే మంత్రం తో కూడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికత ను సాకారం చేయడం కోసం మారిటైమ్ విజన్ 2030 , విజన్ డాక్యుమెంటు 2047 తో ముడిపడి ఉన్నాయి. అని అన్నారు. ఓడరేవుల వద్ద ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నందున, మన నౌకాశ్రయాల పనితీరు మెరుగుపడుతోందని ఆయన అన్నారు. మన ఓడ రేవులను అభివృద్ధి చేయడానికి, ఆధునీకరించడానికి మన ప్ర ధాన మంత్రి ఓడరేవు ఆధారిత అభివృద్ధి దార్శనికతను అమలు చేయడానికి మన ప్రణాళిక ను సాఫీగా, త్వరగా అమలు చేయడానికి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.

గత 'చింతన్ బైఠక్‘ లో చర్చించిన ప్రతి పెద్ద ఓడ రేవుకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు, అవి అన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా దృష్టి పెట్టాలని
అన్ని ఓడ రేవుల అధికారులను ఆదేశించారు.
" ఈ ఆర్థిక మార్పులను సాధించే మార్గాలను శక్తివంతం చేయడం , దోహదం చేయడం ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖగా మన పాత్ర, ఈ చింతన్ బైఠక్‘ ద్వారా, సముద్ర రంగ ఉత్తమ భావాలు కలిసి వచ్చాయి, తద్వారా మనమందరం వివిధ సవాళ్లు , అవకాశాలను చర్చించి, నిర్ణయించుకోవచ్చు " అని శ్రీ సోనోవాల్ ఉద్ఘాటించారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ
వరకు ప్రత్యేక కార్యక్రమం గురించి మంత్రి ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు మద్దతునిచ్చేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఈ క్రమం లో మనం ఓడరేవు పరిసరాలను 'జహా స్వచ్చత- వహా ప్రభుతా' గా చక్కగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ ప్రత్యేక ప్రచారంలో పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించాలని ఆయన అన్నారు. స్వచ్ఛత అభియాన్ పై పర్యవేక్షణ కు ఒక కమిటీని కూడా తాను నియమిస్తానని ఆయన చెప్పారు.
ఈ చింతన్ బైఠక్ సందర్భంగా జిఈఎమ్ ప్రొక్యూర్ మెంట్ పై సవిస్తరమైన చర్చ కూడా జరిగింది. సీనియర్ అధికారులు జిఈఎమ్ ప్లాట్ ఫారం నుంచి కొనుగోలుకు సంబంధించి తమ ఆందోళనలు, సూచనలను పంచుకున్నారు, దీనిపై మంత్రి మాట్లాడుతూ, 'జిఈఎమ్ అంతరాయం లేకుండా , మరింత సమ్మిళితంగా మారడం కోసం మనం ఒక ప్రతిపాదనను సబ్మిట్ చేద్దాం “' అని పేర్కొన్నారు.
****
(Release ID: 1863534)
Visitor Counter : 140