మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పోషణ్ మాహ్’ కార్యక్రమం కింద వర్షపునీటి సంరక్షణకు ప్రోత్సాహం


అంగన్ వాడీ కేంద్రాల ద్వారా నిర్వహణకు ప్రాధాన్యం
అంగన్‌వాడీల పరిధుల్లో తగిన రీతిలో

వర్షపునీటి సంరక్షణ చర్యలపై
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అభ్యర్థన..

‘పోషణ్ మాహ్’ మొదటి రెండువారాల్లో
నీటి నిర్వహణపై 10లక్షలకు పైగా
కార్యక్రమాల నిర్వహణ..

Posted On: 29 SEP 2022 11:22AM by PIB Hyderabad

      2022వ సంవత్సరంలో ప్రస్తుత కొనసాగుతున్న పోషణ మాసం (పోషణ్ మాహ్) కార్యక్రమాల్లో భాగంగా, కేంద్ర మహిళా, శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ (డబ్ల్యు.సి.డి.), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో కలసి పలు కార్యక్రమాలు,కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో వివిధ స్థాయిల్లో నీటి నిర్వహణా కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనితో పోషణ్ మాస్ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే, ‘నీటి నిర్వహణ’తో అనుసంధానించిన 10లక్షలకుపైగా కార్యకలాపాలు దేశంలో జరిగినట్టు సమాచారం అందింది.

   తగిన పరిమాణంలో నీటిని వినియోగించడం, నీటిని కలుషితం కాకుండా నివారించడం వంటి కార్యకలాపాలు మానవ శరీరం మెరుగ్గా పనిచేయడానికి దోహదపడతాయి. తద్వారా తినే ఆహారపు పోషక విలువను సుస్థిరంగా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటికాలుష్యం ద్వారా సంక్రమించే వ్యాధులను, ప్రత్యేకించి,.. పిల్లలలో వచ్చే విరేచనాల వంటి అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి సులువుగా అందుబాటులో ఉండే, సురక్షితమైన నీరు దోహదపడుతుంది.

   కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో కలిసి పోషణ్ మాహ్ పేరిట పలు కార్యకలాపాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీని కింద,.. అంగన్‌వాడీ కేంద్రాలు/వాటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, నిల్వ.. నీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా, అన్ని అంగన్‌వాడీల ప్రాంగణాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా,  తగిన విధంగా వర్షపు నీటి సంరక్షణ పనులను చేపట్టాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను/కేంద్రపాలిత ప్రాంతాలను అభ్యర్థించింది.

     ఇంకా, నీటి సంరక్షణ, నీటి వినియోగ నిర్వహణా ప్రక్రియల్లో మహిళల పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. పోషణ్ పంచాయతీలు, మదర్ గ్రూపులలో ప్రమేయం ఉన్న గ్రామ ఆరోగ్య పోషకాహార, పారిశుద్ధ్య కమిటీల (వి.హెచ్.ఎన్.ఎస్.సి.ఎస్.ల) ద్వారా మహిళల పాత్రకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

2018వ సంవత్సరం మార్చిలో పోషణ్ అభియాన్‌ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి, భారతదేశం అంతటా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ‘పోషకాహార కేంద్రీకృత జనోద్యమాలు’ కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. ఇప్పటివరకు, అటువంటి ఎనిమిది జనోద్యమాలను విజయవంతంగా నిర్వహించారు. మార్చి, సెప్టెంబరు నెలల్లో పోషన్ పఖ్వాడాల్లో నాలుగు, పోషన్ మాహ్‌లలో నాలుగు చొప్పున ఈ జనోద్యమాలు నిర్వహించారు. 2022వ సంవత్సరపు పోషణ్ మాహ్  రూపంలో ఇపుడు తొమ్మిదవ జనోద్యమం ఈ నెలలో దేశవ్యాప్తంగా గణనీయమైన భాగస్వామ్యంతో కొనసాగుతోంది, మొదటి 1,000 రోజులకోసం కీలకమైన ప్రాముఖ్యతతో కీలకమైన ఇతివృత్తాలను పొందుపరిచారు.  పోషణ్ కే పాంచ్ సూత్రం, వృద్ధిపై పర్యవేక్షణ, రక్తహీనత నివారణ, ఆయుష్ వైద్య పద్ధతుల ఏకీకరణ, ఆహార వైవిధ్యం, సాంప్రదాయ స్వదేశీ వంటకాలపై దృష్టిని కేంద్రీకరించడం మొదలైన ప్రధాన ఇతివృత్తాలను ఇందుకు ఎంపిక చేసుకున్నారు.

 

    2022 మార్చిలో జరిగిన నాల్గవ పోషణ్ పఖ్వాడా వేడుకల కోసం, దేశవ్యాప్తంగా అమలయ్యే పథకం కింద "లైంగిక స్పృహతో కూడిన నీటి నిర్వహణా కార్యక్రమాల" మరో ప్రధాన ఇతివృత్తాన్ని  మొదటిసారి చేపట్టారు. నీటి సంరక్షణ, నీటినిల్వల రక్షణ, నీటి స్థిర వినియోగాన్ని గురించి ప్రచారం చేయడానికి సమర్థవంతమైన వ్యూహంగా ‘జల నిర్వహణపై పబ్లిక్ ఔట్‌రీచ్ పేరిట చైతన్య కార్యక్రమాలను’ చేపట్టారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లుల దైనందిన జీవితంలో నీటికి గల ప్రాముఖ్యతపైన,.. వాన నీటి సంరక్షణ, కిచెన్ గార్డెన్‌లలో నీటి పునర్వినియోగం, ఇళ్లలో నేలను, మరుగుదొడ్లు శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే పనిలో అంగన్ వాడీ కార్యకర్తలు/అంగన్ వాడీ సహాయకులను వినియోగించారు.

  

ఈ ఇతివృత్తానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను ఈ దిగువన ఇస్తున్నాం.:

 

  • 2022 మార్చి నెలలో దేశవ్యాప్తంగా జరిగి పోషణ్ పఖ్వాడా, కార్యక్రమంలో  లక్షా 36 వేల మేర  ‘లైంగిక స్పృహతో కూడిన నీటి వినియోగ నిర్వహణా కార్యక్రమాలు’ చేపట్టారు.  ఈ కార్యక్రమాల్లో ఈ కింది అంశాలు ఉన్నాయి:
  • అంగన్‌వాడీ కేంద్రాల్లో (ఎ.డబ్ల్యు.సి.లలో) వర్షపునీటి సంరక్షణ (ఆర్.డబ్ల్యు.హెచ్.)కు ప్రోత్సాహం: 10,813.
  • వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు (ఆర్.హెచ్.ఎస్.)పై వెబినార్ సదస్సులు: 99,071
  • ఇప్పటికే ఉనికిలో ఉన్న, పనచేస్తున్న వర్షపునీటి సంరక్షణ నిర్మాణాల వద్ద అవగాహన: 45,603

 

2022వ సంవత్సరపు పోషణ్ మాహ్ కార్యక్రమం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలవారీగా  నిర్వహించిన  వివిధ భాగస్వామ్య కార్యక్రమాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

‘అంగన్‌వాడీ కేంద్రాలలో (ఎ.డబ్ల్యు.సి.లలో) 20వేల వరకూ ఆదర్శ వర్షపునీటి సంరక్షణ నిర్మాణాల వేడుకలు.’

మహిళా శిశు అభివృద్ధి శాఖకు, జలశక్తి శాఖకు చెందిన సిబ్బంది, అంగన్ వాడీ కేంద్రాలతో ప్రమేయం ఉన్న వారు, గ్రామాల జలశక్తి సమతులు, కృషి విజ్ఞాన కేంద్రాల సభ్యులు తదితరులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

వరుస సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కార్యకలాపాల సంఖ్య

1

మహారాష్ట్ర

6,317

2

తమిళనాడు

4,671

3

గుజరాత్

3,012

4

మధ్యప్రదేశ్

2,357

5

ఉత్తరప్రదేశ్

1,488

6

పంజాబ్

524

7

బీహార్

483

8

కర్ణాటక

406

9

జార్ఖండ్

129

10

మణిపూర్

107

 

 

 

  •  ‘ప్రజా నీటి వనరుల (సరస్సులు, కుంటలు, బావులు, నీటి తొట్లు వంటివి) వద్ద పరిశుభ్రత/పూడిక తీత కార్యక్రమంపై 24 వేలవరకూ  అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.
  • మహిళా శిశు అభివృద్ధి శాఖ, జల శక్తి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన సిబ్బంది, కార్యకర్తలు, గ్రామ సంఘం, గ్రామ జల సమితుల సభ్యులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతుల కమిటీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

 

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

No. of activities

1

మహారాష్ట్ర

6,578

2

తమిళనాడు

6,407

3

గుజరాత్

4,316

4

మధ్యప్రదేశ్

2,481

5

ఉత్తరప్రదేశ్

1,436

6

బీహార్

802

7

పంజాబ్

789

8

కర్ణాటక

472

9

హర్యానా

272

10

రాజస్థాన్

257

 

  •  ‘నీటి సంరక్షణ పద్ధతులపై స్థానిక సంస్థలు/పాలనా సంస్థలతో (పంచాయతీరాజ్ సంస్థలు/పట్టణ స్థానిక పాలనా సంస్థలతో)కలసి 29వేల అవగాహనా కార్యక్రమాలు.’

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కార్యకలాపాల సంఖ్య

1

మహారాష్ట్ర

8,832

2

తమిళనాడు

5,915

3

గుజరాత్

5,390

4

మధ్యప్రదేశ్

2,325

5

ఉత్తరప్రదేశ్

1,880

6

పంజాబ్

1,122

7

హర్యానా

1,070

8

బీహార్

671

9

మణిపూర్

500

10

కర్ణాటక

415

 

  •  ‘వర్షపు నీటి సేకరణ, సంరక్షణకు ప్రోత్సాహంపై 34వేల (సెషన్/ఈవెంట్)’ కార్యక్రమాలు.
  • మహిళా శిశు సంక్షేమ శాఖ, జలశక్తి శాఖ కార్యనిర్వాహకులు, అంగన్‌వాడీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సంఘంతో పాటు, గ్రామ జలసమితుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో సమస్య ఆధారిత విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా. జలశక్తి కేంద్రాలు, జలశక్తి సాంకేతిక అధికారులు, ప్రత్యేక నీటి పరిశోధనా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
  •  

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కార్యకలాపాల సంఖ్య

1

మహారాష్ట్ర

10,093

2

తమిళనాడు

8,574

3

గుజరాత్

5,993

4

మధ్యప్రదేశ్

3,276

5

ఉత్తరప్రదేశ్

2,045

6

బీహార్

1,035

7

పంజాబ్

825

8

మణిపూర్

712

9

కర్ణాటక

670

10

జార్ఖండ్

117

  • ‘స్థానిక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో (ఎన్.జి.ఒ.లతో) పాటు, ప్రత్యేక ఏజెన్సీల ద్వారా 46 వేల నీటి నిర్వహణా కార్యకలాపాలు.’
  • దీనిపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మహిళా శిశు అభివృద్ధి శాఖ, జలశక్తి, పంచాయితీ రాజ్ శాఖనుంచి కార్యకర్తలు, ప్రజా సంఘాల సభ్యులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పౌర సంఘాల నిర్వహణా సంస్థలతో పాటు,  నీటి సంరక్షణ/నిర్వహణ సమస్యలపై పనిచేస్తున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (ఎన్.జి.ఒలు) తదితర సంస్థలు, జలశక్తి కేంద్రాలు, జల పరిశోధనా సంస్థలు వంటి ప్రత్యేక ఏజెన్సీలు కూడా పాల్గొన్నాయి.

 

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కార్యకలాపాల సంఖ్య

1

మహారాష్ట్ర

14,771

2

తమిళనాడు

10,980

3

గుజరాత్

6,573

4

మధ్యప్రదేశ్

5,981

5

ఉత్తరప్రదేశ్

2,837

6

బీహార్

2,169

7

పంజాబ్

1,271

8

కర్ణాటక

758

9

హర్యానా

263

10

జార్ఖండ్

160

  • ‘జల సంరక్షణ, నీటి నిర్వహణ పద్ధతులపై మహిళలకు అవగాహన కల్పించేందుకు 54 వేల చర్చాగోష్టులు.’
  • వివిధ స్థాయిలలో జలశక్తి కేంద్రాలు, జల పరిశోధనా సంస్థలు, వారి సాంకేతిక అధికారులతో  పాటు, ఏజెన్సీలు మహిళా శిశు అభివృద్ధి శాఖ, జలశక్తి, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ అధికారుల సమక్షంలో సమావేశాలు నిర్వహించారు.  నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన, చైతన్యం పెంచడానికి ఈ సమావేశాలు చేపట్టారు.

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కార్యకలాపాల సంఖ్య

1

మహారాష్ట్ర

14,650

2

తమిళనాడు

11,750

3

గుజరాత్

9,836

4

మధ్యప్రదేశ్

7,193

5

ఉత్తరప్రదేశ్

3,347

6

బీహార్

2,936

7

పంజాబ్

1,585

8

కర్ణాటక

1,302

9

జార్ఖండ్

273

10

తెలంగాణ

139

    • నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన పరిసరాల సాధనే లక్ష్యంగా వాష్’ (WaSH) పేరిట చేపట్టిన కార్యక్రమానికి సన్నిహిత అనుబంధం ఉన్న ముఖ్యమైన ప్రక్రియే నీటి వినియోగ నిర్వహణచేతులు కడుక్కోవడం, పారిశుద్ధ్యం/పరిసరాల శుభ్రత, నీరు-పారిశుద్ధ్యంఅన్న అంశంపై ఇప్పటివరకూ 8లక్షల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.
    • చేతులు కడుక్కోవడం, పరిశుభ్రంగా ఉండటం తదితర అంశాల ప్రాముఖ్యతను, మరింత మెరుగైన పౌష్టికాహారానికి, ఆరోగ్యానికి వాటి ఆవశ్యకతను గురించి ప్రజా సమూహానికి ప్రత్యేకించి పిల్లలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్య, ఆరోగ్య, జలశక్తి, పంచాయతీరాజ్ సిబ్బందితోపాటుగా,  మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యకర్తలు కూడా అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కార్యకలాపాల సంఖ్య

1

తమిళనాడు

1,99,139

2

మహారాష్ట్ర

1,55,102

3

మధ్యప్రదేశ్

1,11,475

4

గుజరాత్

92,941

5

పంజాబ్

84,525

6

బీహార్

67,316

7

ఉత్తరప్రదేశ్

62,110

8

కర్ణాటక

6,679

9

జార్ఖండ్

6,212

10

ఆంధ్రప్రదేశ్

4,660

 

గోవానీటి సంరక్షణ, వినియోగం, నీటి పొదుపుపై అవగాహనా కార్యకలాపాలు

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013JVL.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002F9GJ.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036OX8.jpg

 

 

****


(Release ID: 1863527)