భారత పోటీ ప్రోత్సాహక సంఘం
డిలిగెంట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, డీబీ పవర్ లిమిటెడ్ సంస్థల వాటా మూలధనాన్ని అదానీ పవర్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం
Posted On:
29 SEP 2022 4:59PM by PIB Hyderabad
డిలిగెంట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (డిలిగెంట్ పవర్) మరియు డీబీ పవర్ లిమిటెడ్ (డీబీ పవర్) యొక్క వాటా మూలధనాన్ని అదానీ పవర్ లిమిటెడ్ (స్వాధీనపరుడు-అక్వైరర్) కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తన ఆమోదం తెలిపింది. [డిలిగెంట్ పవర్ మరియు డీబీ పవర్‌లను సమిష్టిగా టార్గెట్‌లుగా సూచించిడమైంది]. ఈ ప్రతిపాదిత కలయికలో 100 శాతం వాటా మూలధనం, టార్గెట్ సంస్థల ఆర్థిక హక్కులను స్వాధీనపరుడు (అక్వైరర్) పొందడానికి సంబంధించినది. అక్వైరర్ అనేది బీఎస్ఈ లిమిటెడ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో జాబితా చేయబడిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. అక్వైరర్ భారతదేశంలో ఎనిమిది ఆపరేషనల్ పవర్ ప్లాంట్‌లతో కూడిన పవర్ కంపెనీ. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్లు మరియు గుజరాత్‌లో 40 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లతో కూడిన 13,650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉంది. డిలిగెంట్ పవర్ ప్రాథమికంగా హోల్డింగ్ కంపెనీ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. ఇది డీబీ పవర్‌కు పరిమితమైన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మరియు కన్సల్టెన్సీ సేవలను కూడా అందిస్తుంది. డీబీ పవర్ ఛత్తీస్‌గఢ్‌లో గంటకు 1200 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో
బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.ప్రతిపాదిత కోనుగోలు సంబంధించిన వివరణాత్మక ఆర్డర్ వెలువడాల్సి ఉంది.
***
(Release ID: 1863526)
Visitor Counter : 117