సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెక్సికోలో జరిగే యూనెస్కో- మోండియాకల్ట్ 2022 ప్రపంచ సదస్సుకు హాజరుకానున్న సాంస్కృతిక శాఖ సహాయమంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్

Posted On: 28 SEP 2022 6:22PM by PIB Hyderabad

సెప్టెంబరు 28-30, 2022లో మెక్సికో సిటీలో జరగనున్న యూనెస్కో-మోండియాకల్ట్ 2022 ప్రపంచ సదస్సుకు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రారంభ వేడుక బుధవారం, 28 సెప్టెంబర్, ఉదయం సీడీటీ 10:00 గంటలకు (మెక్సికో సమయం) జరుగుతుంది.

ఈ సదస్సులో సాంస్కృతిక రంగ విధానాలకు సంబంధించిన సమస్యలు, ఆందోళనలపై మంత్రి ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు 100 కంటే ఎక్కువ దేశాల సాంస్కృతిక మంత్రులు ఈ బహుపాక్షిక ఫోరమ్‌లో పాల్గొని ప్రపంచ సాంస్కృతిక ప్రసంగంపై నిర్ణయం తీసుకుంటారు.

యూనెస్కో సాంస్కృతిక విధానాలు, సుస్థిరాభివృద్ధిపై మోండియాకల్ట్ 2022 ప్రపంచ సదస్సు, నలభై సంవత్సరాల తర్వాత 1982లో మెక్సికో సిటీ (మెక్సికో)లో జరిగిన మొదటి మోండియాకల్ట్ సాంస్కృతిక విధానాలపై జరిగిన ప్రపంచ సదస్సు యూనెస్కో ప్రపంచ కాన్ఫరెన్స్ 1998లో స్టాక్‌హోమ్ (స్వీడన్)లో జరిగిన తర్వాత 24 ఏళ్లకు ఇది నిర్వహించబడుతోంది. ఇలా నిర్వహించే మూడవ సమావేశం ఇది.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ నివేదికలో పొందుపరచబడిన దృక్పథానికి అనుగుణంగా స్థిరమైన అభివృద్ధితో పాటు సంఘీభావంశాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం వంటి దృక్కోణాలలో మరింత దృఢమైన, స్థిరమైన సాంస్కృతిక రంగాన్ని రూపొందించడం ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం. 'అవర్ కామన్ అజెండా' (సెప్టెంబర్ 2021), ఇది సంస్కృతిని 'ప్రపంచ ప్రజా ప్రయోజనంమనందరికీ మేలు' ను సూచిస్తుంది.

ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు కోసం గత పదేళ్లుగా తీసుకుంటున్న చర్యలుఅంతర్జాతీయ సమాజం ఒక ఉమ్మడి ఆకాంక్షాభరిత రోడ్‌మ్యాప్‌ను అంగీకరించిందియునెస్కో దాని సభ్య దేశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిష్కారాలపై సాంస్కృతిక విధానాల అమలు కోసం ఉమ్మడిగా సమావేశమైంది. ప్రపంచ సవాళ్లు మరియు తక్షణ కర్తవ్యాలు మరియు భవిష్యత్తు ప్రాధాన్యతలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు.

****


(Release ID: 1863216) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi