సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి. మీనాక్షి లేఖి పద్మ మరియు సంగీత నాటక పురస్కార గ్రహీతలతో కలిసి ఎన్‌జీఎంఏ లో గల ప్రధానమంత్రి ప్రతిష్టాత్మక జ్ఞాపికల ప్రదర్శన గ్యాలరీని సందర్శించారు


జ్ఞాపికలు, మెమెంటోల వేలంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, నమామి గంగే ఉదాత్తమైన కార్యానికి సహకరించాలని నేను కోరుతున్నాను: శ్రీమతి మీనాక్షి లేఖి

Posted On: 28 SEP 2022 6:30PM by PIB Hyderabad

సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి. మీనాక్షి లేఖి నేడు పద్మ, సంగీత నాటక అవార్డు గ్రహీతలతో కలిసి దిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA)లో గల ప్రధానమంత్రి ప్రతిష్టాత్మక జ్ఞాపికల ప్రదర్శన గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సందర్శకులకు గైడెడ్ టూర్ ఇవ్వబడింది ప్రతి ఒక్క జ్ఞాపికకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న వారందరికీ వివరంగా వివరించబడింది.

ఈ సందర్భంగా శ్రీమతి. మీనాక్షి లేఖి మాట్లాడుతూ జ్ఞాపికలు, మెమెంటోల వేలంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ వేలం ద్వారా రెండు రకాల ప్రయోజనాలను పొందుతారని ఆమె తెలిపారు. ముందుగా ప్రధాని మోదీకి అందజేసే మెమెంటోలు మీ స్వంతం అవుతాయి. ఒక ధృవీకరణ పత్రం అందించబడుతుంది. రెండవది వేలం ద్వారా సేకరించిన నిధులు విలువైన కార్యమైన నమామి గంగే కార్యక్రమానికి దోహదం చేస్తాయి. మన జాతీయ నది అయిన గంగను సంరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాన ప్రాజెక్ట్.

"మెమెంటోల ధర రూ. 100 నుండి లక్షల రూపాయల వరకు ఉంటుంది. సందర్శనను మరింత ఆనందదాయకంగా మార్చడానికిసాధారణంగా గైడెడ్ టూర్‌లు మరియు వినికిడి లోపం ఉన్నవారికి సంకేత భాషలో గైడెడ్ టూర్లు ఏర్పాటు చేయబడ్డాయి" అని ఆమె తెలిపారు.

కంటి చూపులేని వారికి బ్రెయిలీ లిపిలో కేటలాగ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ట్విట్టర్‌లో #pmmementosని ప్రచారం చేయాలని కూడా ఆమె కోరారు.

 

 

 

 

"మెమెంటోల ధర రూ. 100 నుండి లక్షల రూపాయల వరకు ఉంటుంది మరియు సందర్శనను మరింత ఆనందదాయకంగా మార్చడానికిసాధారణంగా గైడెడ్ టూర్‌లు మరియు వినికిడి లోపం ఉన్నవారికి సంకేత భాషలో గైడెడ్ టూర్లు ఏర్పాటు చేయబడ్డాయి" అని ఆమె తెలియజేసింది.

కంటి చూపులేని వారికి బ్రెయిలీ లిపిలో కేటలాగ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ట్విట్టర్‌లో #pmmementosని ప్రచారం చేయాలని కూడా ఆమె కోరారు.

 

****



(Release ID: 1863212) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi