హోం మంత్రిత్వ శాఖ
తన 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విపత్తు నిర్వహణలో స్వచ్ఛంద సేవను వేడుకగా జరుపుకున్న నేషనల్ డిశాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ
Posted On:
28 SEP 2022 8:52PM by PIB Hyderabad
నేషనల్ డిశాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ- జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ) బుధవారం నాడు న్యూఢిల్లీలో తన 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. నివారణ, ఉపశమన, సంసిద్ధత, ప్రతిస్పందన వ్యూహ సంస్కృతి ద్వారా సంపూరణ, క్రియయాశీల, బహుళ విపత్తు ఆధారిత, సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా సురక్షితమైన, విపత్తులను తట్టుకునే భారతదేశాన్ని నిర్మించడమే ఎన్‌డిఎంఎ దార్శనికత. ఈ ఏడాది వ్యవస్థాపక దినోత్సవ ఇతివృత్తం వాలంటీరిజం ఇన్ డిశాస్టర్ మేనేజ్‌మెంట్ (విపత్తు నిర్వహణలో స్వచ్ఛంద సేవ).
ఆపద మిత్రుల అస్తిత్వం సేవ, సమర్పణ & పరోపకారమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం వ్యవహారాల సహాయమంత్రి శ్రీ నిత్యానందరాయ్ అన్నారు. స్వయం-సమృద్ధ భారతదేశంను సృష్టించాలన్నప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛంద సేవకత మనతోనే ప్రారంభమవుతుందని, తక్షణ అవసరమైన సురక్షిత, బలమైన భారతదేశాన్ని నిర్మించేందుకు సమాజాలు ఏకతాటిపైకి రావాలని ఆపదా మిత్రులు సూచించారని ఆయన అన్నారు. నేడు ఎన్‌డిఎంఎ - సిడిఆర్ ఐ వంటి వివిధ అంతర్జాతీయ విపత్తు నిర్వహణా సంస్థలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిందని, అంతేకాక పలు జీవితాలను కాపాడేందుకు వీలు కల్పించే ఆవిష్కరణ, సాంకేతికత, నిర్మాణాత్మకమైన, సురక్షితమైన రేపటి కోసం ప్రణాళికల వంటి అంశాలలో పలు కోణాలలో 31 దేశాలకు భారతదేశం నాయకత్వం వహిస్తోందన్నారు. ఒక దశాబ్దం కిందట మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేదని, కానీ ఎన్‌డిఎంఎ విపత్తు నిర్వహణకు నాయకత్వం వహిస్తున్నందున, ప్రాణ నష్టం భారీగా తగ్గిందని, నేడు రక్షణ/ కాపాడేందుకు చేపట్టే చర్యలు మరింత ఆధునికమైనవి అయినప్పటికీ, కోల్పోయిన జీవితాల గత రికార్డుతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు.
స్వయం సేవకత అన్న ఇతివృత్తాన్ని అంగీకరిస్తూ, ఏ విపత్తులోనైనా ప్రభుత్వ యంత్రాంగం ఎంత త్వరితగతిన స్పందించినా, బాహ్య సహాయం బాధిత ప్రజలను చేరుకోవడానికి సమయం పడుతుందని, ఈ సమయంలో తీసుకునే సమయమే జీవితాలను, జీవనోపాధిని కాపాడడానికి కీలకమని హోం వ్యవహారాల సహాయం మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. కనుక, సరైన శిక్షణ, సన్నద్ధత ఉన్నప్పుడు తక్షణ, తొలి ప్రతిస్పందన అన్నది నష్టాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించగల స్వచ్ఛంద సేవకులు బాధిత సమాజం నుంచే వస్తారన్నారు. విపత్తు నిర్వహణపై జాతీయ విధానం 2009లో విపత్తు నిర్వహణలో స్వయం సేవకత అవసరాన్ని సూచించినప్పటికీ, విపత్తు ప్రమాదాన్ని తగ్గించే అజెండాలో తన పది అంశాలను ఉద్ఘాటించారని ఆయన అన్నారు. ఇందులో భాగంగా స్థానిక సామర్ధ్యాల నిర్మాణం, చొరవలు, విపత్తు ప్రమాద నిర్వహణలో స్వయం సేవకతను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారన్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం ఉపశమనం కేంద్రీకృత విధానం నుంచి తమ దృష్టిని విస్త్రతం చేసిపునర్నిర్మాణం, పునరావాసపరంగా నివారణ, ఉపశమనంతో కూడిన క్రియాశీల వైఖరిని అనుసరించాలని ప్రధానమంత్రి మోదీ ఎన్‌డిఎంఎను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ వేడుకలలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శిక్షితులైన ఆపదామిత్ర వాలంటీర్లతో పాటుగా, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్ సిసి), నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్), నెహ్రూ యువ కేంద్ర (ఎన్‌వైకె), సివిల్ డిఫెన్స్ అండ్ భారత్ స్కౌట్ & గైడ్ (బిఎస్‌జి)కు చెందిన కేడెట్లు, వాలంటీర్లు హాజరై, తమ వ్యక్తిగత పరికరాలను (ఇఆర్‌కె)ను, జిల్లా స్థాయి ఇఇఆర్ఆర్ పరికరాలను ఆవరణలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జరిగిన సాంకతిక సెషన్లలో విపత్తు నిర్వహణలో స్వయం సేవకు సంబంధించిన చర్చలు, అనుభవాలు పంచుకోవడం జరిగింది. విపత్తు నిర్వహణలో స్వయం సేవకతకు సంబంధించిన ఉత్తమ ఆచరణలను పాల్గొన్న రాష్ట్రాలు ఇతరులతో పంచుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలైన (ఎన్జీవో), సీడ్స్ ( ), స్ఫియర్ ఇండియా, వరల్డ్ విజన్ ఇండియా, యాక్షన్ ఎయిడ్ ఇండియా స్వయం సేవకత ద్వారా విపత్తు నిర్వహణపై తమ కేస్ స్టడీలను సమర్పించాయి. అనంతరం, వర్తమానంలో, భవిష్యత్తులో విపత్తు నిర్వహణలో ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి, ఎన్‌వైకె, ఎన్ఎస్‌జి కు చెందిన కేడెట్లు / వాలంటీర్ల పాత్ర సాధ్యతపై చర్చ నిర్వహించారు. అనంతరం, ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు డాక్టర్ పి.కె. మంత్రి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ఎన్‌డిఎంఎ, ఆపదామిత్ర, ఇతర వాలంటీర్ల కృషి విపత్తు నిర్వహణలో అంతర్భాగంగా ఆయన వర్ణించారు.
***
(Release ID: 1863211)
Visitor Counter : 289