సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

బాంధవ్‌ఘర్ ఫారెస్ట్ రిజర్వ్‌లో అద్భుతమైన పురావస్తు అవశేషాలను వెలికి తీసిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)

Posted On: 28 SEP 2022 8:08PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ ఫారెస్ట్ రిజర్వ్‌లో విశేషమైన పురావస్తు అవశేషాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) వెలికితీసింది.

మధ్యప్రదేశ్‌లో చేపట్టిన తవ్వకాల్లో   ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 26 పురాతన దేవాలయాలు/  కలచూరి కాలం నాటి  (9 వ  శతాబ్దం CE నుండి 11 వ  శతాబ్దం CE వరకు) అవశేషాలు, 26 గుహలు (2 వ  శతాబ్దం CE నుండి 5 వ  శతాబ్దం CE వరకు ఎక్కువగా బౌద్ధ స్వభావం), 2 మఠాలు, 2 స్థూపాలు , 24 బ్రాహ్మీ శాసనాలు (2 వ  శతాబ్దం CE నుండి 5 వ  శతాబ్దం CE వరకు), 46 శిల్పాలు, 20 చెల్లాచెదురుగా ఉన్న అవశేషాలు మరియు 19 నీటి నిర్మాణాలు (c.2 వ -15 వ CE) బయటపడ్డాయి. ఏఎస్‌ఐ గుర్తించిన   46 శిల్పాలలో అతిపెద్ద వరాహ శిల్పం కూడా ఉంది.   

ఏఎస్‌ఐ గుర్తించిన  అవశేషాలు  శ్రీ భీమసేన, మహారాజా పోతసిరి, మహారాజా భట్టదేవల కాలానికి చెందినవి. శాసనాలు  కౌశమి, మధుర, పవత (పర్వత), వేజభరద మరియు సపతనైరికా లిపిలో ఉన్నాయని గుర్తించారు.

 బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 1938 తర్వాత మొదటిసారిగా ఏఎస్‌ఐ తవ్వకాలు చేపట్టింది. నెలరోజులపాటు 170 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏఎస్‌ఐ బృందం  అన్వేషణ, తవ్వకాలు చేపట్టింది.

 ఏఎస్‌ఐ జబల్‌పూర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ అన్వేషణ, తవ్వకాలు జరిగాయి. 

 

***



(Release ID: 1863206) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi