వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT), ఇన్వెస్ట్ ఇండియా మరియు నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం ఇండియా-నెదర్లాండ్ లు త్వరిత గతి వ్యవస్థ (FTM)ని అధికారికంగా ప్రకటించారు.


ద్వైపాక్షిక పెట్టుబడి కార్యకలాపాలను పెంచడానికి మరియు రెండు దేశాలలోని కంపెనీల మధ్య వ్యాపార సహకారానికి మద్దతు మరియు అభివృద్ధి కోసం ద్వైపాక్షిక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి త్వరిత గతి వ్యవస్థ పని చేస్తుంది.

Posted On: 28 SEP 2022 11:46AM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) మరియు నెదర్లాండ్స్  రాయబార కార్యాలయం భారతదేశం మరియు నెదర్లాండ్ ల మధ్య ద్వైపాక్షిక ఫాస్ట్-ట్రాక్ మెకానిజం (FTM) నకు సంబందించిన  ఊమ్మడి ప్రకటన పై అధికారికంగా సంతకం చేశాయి. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ అయిన ఇన్వెస్ట్ ఇండియా ద్వైపాక్షిక త్వరిత గతి వ్యవస్థ యొక్క కార్యనిర్వాహక సంస్థ. భారతదేశంలోని నెదర్లాండ్స్ రాయబారి, మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ మరియు డీ పీ ఐ ఐ టి  (DPIIT) కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ 27 సెప్టెంబర్ 2022న  ఊమ్మడి ప్రకటన పై అధికారికంగా సంతకం చేసి మార్పిడి చేసుకున్నారు.

 

భారతదేశం మరియు నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక త్వరిత గతి వ్యవస్థ భారతదేశంలో పనిచేస్తున్న డచ్ కంపెనీల పెట్టుబడి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. డీ పీ ఐ ఐ టి సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు, ఇన్వెస్ట్ ఇండియా మరియు నెదర్లాండ్స్ ఎంబసీ మధ్య సన్నిహిత సహకారంతో ఈ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ ఏర్పాటు ద్వైపాక్షిక పెట్టుబడి కార్యకలాపాలను పెంచడానికి ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది మరియు సహాయం చేస్తుంది, అలాగే రెండు దేశాలలోని కంపెనీల మధ్య వ్యాపార సహకారానికి మద్దతునిస్తుంది.

 

“భారత్ మరియు నెదర్లాండ్స్ మధ్య బలమైన ఆర్థిక సంబంధాన్ని గుర్తించడం జరిగింది. కొన్ని డచ్ కంపెనీలు భారతదేశంలో 100 సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి, ఇది ఈ సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాన్ని వివరిస్తుంది. భారతదేశంలోని డచ్ కంపెనీలను, ముఖ్యంగా ఆర్థిక శాస్త్రం, సైన్స్ మరియు నూతన ఆవిష్కరణలు వంటి ముఖ్య రంగాలలో పనిచేస్తున్న డచ్ కంపెనీలను మరింత ఉత్తేజపరిచేందుకు మా భారతీయ భాగస్వాములతో మరింత సహకరించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము,” అని భారతదేశంలోని నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ అన్నారు.

 

“75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల ‘అమృత్ కాల్’ సందర్భంగా మన ద్వైపాక్షిక దౌత్య సంబంధాన్ని మరింత పునరుద్ధరించడానికి ఈ త్వరిత గతి వ్యవస్థ పై మనం సంతకం చేస్తున్న ఈ అనుకూలమైన కాలాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. సానుకూల పారదర్శక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానాన్ని కలిగి ఉన్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి, త్వరిత గతి వ్యవస్థ  ప్రక్రియ ప్రారంభానికి ముందే డచ్ కంపెనీలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడానికి మేము కృషి చేసాము. ఈ సందర్భంలో, మేము చాలా కాలం నుండి ఉన్న సంబంధాన్ని అధికారికం చేస్తున్నాము, ”అని డిపిఐఐటి కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ వ్యాఖ్యానించారు.

 

“భారత్-నెదర్లాండ్స్ ఆర్థిక బంధం మా ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మూలస్తంభంగా ఉంది. ఈ ముఖ్యమైన సందర్భంగా, అనేక రంగాల సహకారాలతో పాటు మన బలమైన రాజకీయ, ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మరింత పెంచడం చాలా కీలకం. త్వరిత గతి వ్యవస్థ  దశకు చేరుకోకముందే డచ్ కంపెనీల అన్ని సమస్యలను పరిష్కరించడం కోసం మేము ప్రయత్నం చేశాం,  ఈ దిశలో నిరంతరం కృషి చేస్తున్నాము, ”అని డీ పీ ఐ ఐ టీ (DPIIT) జాయింట్ సెక్రటరీ శ్రీ రాజేంద్ర రత్నూ తెలియజేసారు.

 

“ఈ రోజు మన ద్వైపాక్షిక సంబంధాలకు చాలా ముఖ్యమైన రోజు. భాగస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా జరిగిన ఈ సంతకాల కార్యక్రమం భారీ ముందడుగు. పరస్పర ఆసక్తి ఉన్న పలు ముఖ్యమైన రంగాలలో అభివృద్ధి కి , ఇండియా-నెదర్లాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్‌ను మరింత పటిష్టంగా చేయడానికి మీతో కలిసి పని చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము, ”అని ఇన్వెస్ట్ ఇండియా ఎం డి & సీ ఈ ఓ  దీపక్ బాగ్లా అన్నారు.

 

భారతదేశం మరియు నెదర్లాండ్స్ మధ్య దౌత్య సంబంధాలు అధికారికంగా 1947లో ప్రారంభం అయ్యాయి, అప్పటి నుండి, రెండు దేశాలు బలమైన రాజకీయ, ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మరియు వివిధ రంగాల మధ్య సహకారాన్ని అభివృద్ధి చేశాయి.

 

భారతీయ అధికారిక గణాంకాల ప్రకారం, నెదర్లాండ్స్ భారతదేశంలో 4వ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు. ఏప్రిల్ 2000 మరియు జూన్ 2022 మధ్య, నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి  దాదాపు  42.3 బిలియన్ల అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది.

 

2021-2022 సంవత్సరం లో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. నెదర్లాండ్స్‌కు ప్రధానంగా ఖనిజ ఇంధనాలు, ఖనిజ-ఆధారిత ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, విద్యుత్ యంత్రాలు మరియు పరికరాలు, అల్యూమినియం, ఇనుము మరియు ఉక్కు మరియు ఔషధ ఉత్పత్తులను భారతదేశం ఎగుమతి చేస్తుంది.

***


(Release ID: 1862935) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Hindi , Marathi