సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఇండియా గేట్ సమీపంలోని కర్తవ్య పథ్ లో తెలంగాణ వార్షిక వేడుక బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్న సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతి, ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబిస్తుంది. “జన్మదాయిని” అయిన గౌరీ దేవిని ఈ వేడుకల సందర్భంగా మహాగౌరిగా పూజిస్తారు.
Posted On:
27 SEP 2022 8:28PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో కర్తవ్యపథ్ వద్ద బతుకమ్మ పండుగ నిర్వహించింది. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, టూరిజం, డోనర్ శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్; పాలన, చట్టాల అమలు విభాగాలకు చెందిన సీనియర్ మహిళా అధికారులు, విభిన్న ప్రభుత్వ శాఖల మహిళా సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత వార్షిక వేడుక అయిన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. దసరా నవరాత్రులు ముగిసే వరకు కూడా ఆ వేడుకలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రాంతీయంగా పూచే రంగురంగుల పూలతో ఈ వేడుక నిర్వహిస్తారు. ఇది తెలంగాణ ప్రజల సంఘటిత స్ఫూర్తికి దర్పణం పడుతుంది.ఈ ఏడాది బతుకమ్మ పండుగ వేడుకలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరుగుతున్నాయి.
ప్రతీ ఒక్క కుటుంబానికి ఆరోగ్యం, సంపదలు సమకూర్చమని ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తారు. తమకు మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించాలని హిందూ కుటుంబాలకు చెందిన యువతులు అమ్మవారిని ప్రార్థిస్తారు. “ఆ భగవతి సజీవ రూపమే బతుకమ్మ”. ఈ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి, గుర్తింపు చిహ్నం. జీవనదాయిని మహా గౌరిని గౌరీదేవిగా ఆరాధిస్తారు.
యువతులు రంగురంగుల పూలను దొంతరలుగా పేర్చి, రంగోలీలు అలంకరించడం ఈ పండుగలో ప్రధానం. బంతిపూలు, తామరలు వంటి వివిధ రకాల పూలు సేకరించి ఇవ్వడం ద్వారా పండుగ నిర్వహించుకోవడంలో పురుషులు కూడా సహాయం చేస్తారు. మహిళలు రంగురంగుల పూలను విశాలమైన ప్లేటులో అమర్చి ఒక శిఖరం వలె పేర్చుతారు. మహిళలు ప్రత్యేకించి యువతులు తమ తమ గ్రామాలు, తాము నివశించే ప్రాంతాల్లో సాయంత్రం సమయానికి బృందాలుగా వచ్చి వేడుకలో పాల్గొంటారు. తాము తయారుచేసుకున్న బతుకమ్మల చుట్టూ వలయాకారంలో ఏర్పడి చేతులతో చప్పట్లు కొడుతూ జానపద గేయాలు పాడుతూ లయబద్ధంగా నృత్యం చేస్తూ చుట్టూ తిరుగుతారు. తమ కుటుంబాలకు ఆరోగ్యం, సంపదలు ప్రసాదించాలంటూ అమ్మవారి ఆశీస్సులు అందుకోవడమే ఈ వేడుక ప్రధాన లక్ష్యం.
***
(Release ID: 1862824)