మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
"డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
- భారతీయ మరియు ప్రపంచ సంస్థల మధ్య సమన్వయాన్ని సృష్టించడం ద్వారా కొత్త జ్ఞాన అనుసంధాన నెట్‌వర్క్ ఏర్పాటుకు పిలుపునిచ్చిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
27 SEP 2022 4:27PM by PIB Hyderabad
ఈరోజు ఢిల్లీలో డీకిన్ యూనివర్సిటీ, టీసీఎస్‌తో కలిసి నిర్వహించిన "డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్" అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సెషన్‌లో కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని ప్రసంగించారు. డికిన్ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, శ్రీ సుబ్రమణ్యం రామదొరై, ఓపీ జిందాల్ యూనివర్శిటీ వ్యవస్థాపక వీసీ ప్రొఫెసర్ సి రాజ్‌కుమార్, ,శ్రీ మాథ్యూ జాన్‌స్టన్ మరియు భారత మరియుఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ నాయకులతో కలిసి 'డిజిటల్ పరివర్తన మరియు ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ' అనే సదస్సులో శ్రీ ప్రధాన్ పాల్గొన్నారు. భాగస్వామ్య విలువల ఆధారంగా భారతదేశం మరియు ఆస్ట్రేలియా సుదీర్ఘ సంబంధాన్ని పంచుకుంటున్నాయని శ్రీ ప్రధాన్ అన్నారు. విద్య మరియు నైపుణ్యం రంగాలలో భాగస్వామ్య క్రమక్రమంగా బలపడుతోందని అన్నారు. భారతదేశం పారిశ్రామిక విప్లవం 4.0. నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తోందని అన్నారు. ఈ ప్రయాణంలో భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ నాగరికతకైనా జ్ఞానం అనేది ఒక కీలకమైన స్తంభమని శ్రీ ప్రధాన్ అన్నారు. భారతీయ నాగరికత ఎల్లప్పుడూ విజ్ఞాన ఆధారితమైనదేనని మరియు విజ్ఞాన ఆధారంగానే ముందుకు సాగినదేనని అన్నారు. దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్తూ భారత్ ఎన్ఈపీ 2020ని అమలు చేస్తోందన్నారు. 15-25 ఏళ్ల మధ్య ఉన్న విస్తారగా ఉన్న జనాభాకు మేటి విద్య మరియు మంచి నైపుణ్యాన్ని అందించడం ఒక సవాలు అని అభిప్రాయపడ్డారు . భారతదేశంలో కొత్త "డిజిటల్ లైఫ్ స్టైల్" రూపుదిద్దుకుంటుందని కూడా ఆయన అన్నారు. 2023 చివరి నాటికి దేశీయ 5జీనుండి డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ నాయకత్వం, రాబోయే డిజిటల్ విశ్వవిద్యాలయం మరియు హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో అన్ని గ్రామాలను నెట్‌వర్కింగ్ చేయడం వరకు భారతదేశం యొక్క డిజిటలైజేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తోంది అని అన్నారు. అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త నాలెడ్జ్ నెట్‌వర్క్‌లకు శ్రీ ప్రధాన్ పిలుపునిచ్చారు. భారతీయ సంస్థలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ వివేకంతో సమాజాన్ని సుసంపన్నం చేస్తుందన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో, భారతీయ విజ్ఞాన నెట్‌వర్క్‌లు మానవాళి ప్రయోజనం కోసం ముందుకు సాగుతాయని తెలిపారు.
***
(Release ID: 1862672)
Visitor Counter : 141