ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లో 1,000 కిలోలకు పైగా గసగసాల గడ్డిని స్వాధీనం చేసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్)

Posted On: 26 SEP 2022 6:42PM by PIB Hyderabad

యాంటీ-డ్రగ్ ఆపరేషన్లలో భాగంగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) మధ్యప్రదేశ్‌లోని నీముచ్ అధికారులు, నిర్దిష్ట నిఘా సమాచారంపై, మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లా సింగోలి తెహసిల్ రతన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిథిలో హతిపురా గ్రామ శివార్లలోని ప్రీకాస్ట్ వాల్ & టిన్ షెడ్‌లో నిర్మించిన అనుమానిత ఇల్లు, తాత్కాలిక గోడౌన్ (బాదా)లో సోమవారం నాడు సోదాలు చేశారు.  మొత్తం 1083.150 కిలోల గసగసాల గడ్డిని (దోడా చురా) స్వాధీనం చేసుకున్నారు.

హతీపురా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గసగసాల అక్రమ రవాణా- స్మగ్లింగ్లో పాల్పడుతున్నాడని, అతని నివాసం, శివార్లలోని ప్రీకాస్ట్ వాల్, టిన్ షెడ్ నిర్మించిన తాత్కాలిక గోడౌన్ (బాడ)లో అక్రమ గసగసాల గడ్డిని (దోడా చురా) దాచిపెట్టినట్టు సమాచారం అందింది. దీనితో ఆ గ్రామంలోని అధికారుల బృందంగా ఏర్పడి  సోదాలు చేశారు. 

ఆపరేషన్ సమయంలో డ్రగ్ ట్రాఫికర్లలో ఒకరు లోడ్ చేసి ఉన్న 12 బోర్ గన్‌తో అధికార బృందంపై గురిపెట్టాడు, కానీ సిబిఎన్ అధికారులు గొప్ప ధైర్యం, తెలివితేటలను ప్రదర్శించి, పరిస్థితిని జాగ్రత్తగా, చాకచక్యంగా ఎదుర్కొంటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  సిబిఎన్ అధికారులకు సహాయం చేయడానికి సమీపంలోని పోలీసు స్టేషన్ల నుండి అదనపు బలగాలను కూడా పిలిపించారు.

 

తాత్కాలిక గోడౌన్ చుట్టూ అక్రమ కార్యకలాపాలను గోప్యంగా ఉంచడానికి హై ప్రీ కాస్ట్ గోడను నిర్మించారు. ఒక మహీంద్రా పికప్‌లో లోడ్ చేసిన 482.700 కిలోల బరువున్న 25 బ్యాగ్‌ల గసగసాల స్ట్రా (దోడా చురా), 401.550 కిలోల బరువున్న 21 బ్యాగుల గసగసాల స్ట్రా (దోడా చురా), స్కార్పియో బ్యాగ్‌ఎస్‌యూవీలో లోడ్ చేసిన పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. హ్యుందాయ్ ఐ20 కారులో లోడ్ చేసిన 198.900 కిలోల బరువు (1083.150 కిలోల బరువున్న గసగసాల గడ్డి మొత్తం 51 బ్యాగులు). 23 లైవ్ రౌండ్‌లు, 2 ఖాళీ కాట్రిడ్జ్‌లు, 38 లైవ్ రౌండ్‌లతో కూడిన లైసెన్స్ లేని 12 బోర్ గన్, 7.65 మిమీ ఖాళీ కాట్రిడ్జ్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

గ్రైండింగ్ మెషిన్ (గసగసాల గడ్డి పరిమాణాన్ని తగ్గించడానికి గసగసాల గడ్డిని మెత్తగా పొడిగా చేయడానికి ఉపయోగిస్తారు), నీలిరంగు దారంతో కూడిన కుట్టు యంత్రం ( గసగసాల బ్యాగులు కుట్టడానికి, ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు), బరువు స్కేల్, ఎయిర్ పంప్ (వాహనాలకు) మొదలైనవి తాత్కాలిక గోడౌన్ (బాడా) నుండి కూడా స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకున్నారు.

1083.150 కిలోల బరువున్న 51 బస్తాల గసగసాల గడ్డితో పాటు 3 వాహనాలు అంటే మహీంద్రా పికప్, మహీంద్రా స్కార్పియో మరియు హ్యుందాయ్ ఐ20లను స్వాధీనం చేసుకున్నారు, ఎన్‌డిపిఎస్ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆయుధాల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు.

 

****


(Release ID: 1862380) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi