కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇన్సాల్వెన్సీ బ్యాంకరప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిక్విడేషన్ ప్రాసెస్ ) రెగ్యులేషన్స్ 2016, బ్యాంకరప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (వలంటరీ లిక్విడేషన్ ప్రాసెస్) రెగ్యులేషన్స్ 2017 ను సవరించిన ఐబిబిఐ
Posted On:
20 SEP 2022 6:32PM by PIB Hyderabad
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరెప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ 2022 సెప్టెంబర్ 16న, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిక్విడేషన్ ప్రక్రియ) (ద్వితీయ సవరణ ) రెగ్యులేషన్స్ 2022 (లిక్విడేషన్ రెగ్యులేషన్స్ సవరణ), ఇన్సాల్వెన్సీ , బ్యాంకరప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (వలంటరీ లిక్విడేషన్ ప్రాసెస్) (ద్వితీయ సవరణ) రెగ్యులేషన్స్ 2022 (వాలంటరీ లిక్విడేషన్ రెగ్యులేషన్స్ సవరరణ)ను నోటిఫై చేసింది.
లిక్విడేషన్ ప్రక్రియలో స్టేక్ హోల్డర్లు అందరూ మరింత మెరుగ్గా పాల్గొనేందుకు వీలు కల్పించడంతోపాటు, లిక్విడేషన్ ప్రక్రియను క్రమబద్దీకరించేందుకు , మంచి విలువ వచ్చేలా చేసేందుకు లిక్విడేషన్ నిబంధనలకు సవరణలు తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి కింద పేర్కొన్న ప్రధాన మార్పులు చేశారు.
--కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ పరిష్కారప్రక్రియ సందర్భంగా ఏర్పాటు చేసిన రుణదాతల కమిటీ (సిఒసి), తొలి 60 రోజులలో స్టేక్ హోల్డర్ల సంప్రదింపుల కమిటీ (ఎస్ సిసి) గా వ్యవహరిస్తుంది. --క్లెయిముల పరిష్కారం, ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన 60 రోజులలో , ఎస్ సిసి ని అంగీకరించిన క్లెయిముల ఆధారంగా పునర్నిర్మించవచ్చు.
--లిక్విడేటర్, ఎస్ సిసి సమావేశాలను నిర్మాణాత్మక పద్ధతిలో, కాలనిర్దేశితపద్ధతిలో స్టేక్ హోల్డర్లు ఎక్కువ మంది పాల్గొనేందుకువీలు కల్పిస్తూ నిర్వహించవలసి ఉంటుంది.
--లిక్విడేషన్ ప్రక్రియలో స్టేక్ హోల్డర్లు అందరూ మరింత మెరుగ్గా పాల్గొనేందుకు వీలు
ఎస్‌సిసితో లిక్విడేటర్ తప్పకుండా సంప్రదించాలనే దాని పరిధిని మరింత విస్తృతం చేశారు. ఇకనుంచి లిక్విడేటర్ మార్పు కోరుతూ , పరిష్కార అథారిటీకి (ఎఎ) ఎస్.సి.సి సూచించవచ్చు. అలాగే లిక్విడేటర్ ఫీజును సిఐఆర్‌పి సందర్భంగా ఖరారు చేయనట్టయితే, ఫీజును నిర్ణయించవచ్చు.
`లిక్విడేషన్ ప్రక్రియ సందర్భంగా ఏదయినా క్లెయిమ్ దాఖలు చేయనట్టయితే, ఆ మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌ను సిఐఆర్‌పి సందర్భంగా లిక్విడేటర్ పరిశీలించవచ్చు.
`లిక్విడేషన్ ప్రక్రియ సందర్భంగా రాజీ ప్రక్రియ లేదా అందుకు తగిన ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలించవచ్చనని సిఒసి నిర్ణయించినపుడు, లిక్విడేటర్ ఇందుకు సంబంధించి పరిష్కార అధారిటీ ఎదురుగా దరఖాస్తు దాఖలు చేసి రాజీ లేదా అలాంటి ఏర్పాటు అంశాన్నిపరిశీలించాల్సిందిగా కోరవచ్చు. అది కూడా లిక్విడేషన్ ఆదేశాలలు అందిన 30 రోజులలోగా చేయాల్సి ఉంటుంది.
-`ఆయా ప్రత్యేక ఈవెంట్ ఆధారిత కాలపరిమితులను కూడా వేలం ప్రక్రియకు నిర్దేశించడం జరిగింది.
-లిక్విడేషన్ ప్రక్రియలో స్టేక్ హోల్డర్లు అందరూ మరింత మెరుగ్గా పాల్గొనేందుకు వీలు
ఈ ప్రక్రియ రద్దుకు లేదా మూసివేతకు దరఖాస్తు చేయడానికి ముందు, ఎస్ సిసి లిక్విడేటర్ కు ఈ విషయంలో తగిన సూచనలు చేయవచ్చు . మోసపూరిత లావాదేవీలు, తప్పుడు ట్రేడిరగ్ కు సంబంధించి ప్రొసీడిరగ్స్ లిక్విడేషన్ ప్రొసీడిరగ్స్ మూసివేతతర్వాత పరిశీలించవచ్చు.
లిక్విడేషన్ రెగ్యులేషన్స్ సవరణలు, వలంటరీ లిక్విడేషన్ రెగ్యులేషన్లకు సంబంధించి సవరణలు , లిక్విడేషన్, కార్పొరేట్‌రుణ గ్రహీత లేదా కార్పొరేట్ వ్యక్తి కి సంబంధించి తదుపరి రికార్డులను ఎంతకాలం భద్రపరచాలో సూచిస్తాయి.
లిక్విడేషన్ రెగ్యులేషన్లకు సంబంధించి సవరణలు, స్వచ్చంద లిక్విడేషన్ రెగ్యులేషన్ కు సంబంధించిన సవరణ.లు 2022 అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయి. ఇవి www.mca.gov.in లోను, www.ibbi.gov.in. లోను అందుబాటులో ఉన్నాయి.
***
(Release ID: 1861962)
Visitor Counter : 138