ఆయుష్
“స్పృహను అన్వేషించడం - స్థానికేతరత్వం నుండి ద్వంద్వత్వం లేకపోవడం వరకు : మనిషి - యంత్రం చర్చ” అనే అంశంపై ప్రారంభమైన - అంతర్జాతీయ సమావేశం
బెంగళూరులోని నిమ్హాన్స్‌లోని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విభాగంలో సెంటర్-ఆఫ్-ఎక్సలెన్స్-ప్రాజెక్ట్ ను ప్రారంభించిన - శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
22 SEP 2022 7:04PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు బెంగళూరులోని నిమ్హాన్స్ లో “స్పృహను అన్వేషించడం - స్థానికేతరత్వం నుండి - ద్వంద్వత్వం లేకపోవడం వరకు: మనిషి - యంత్రం చర్చ” అనే ఇతివృత్తంతో స్పృహ పై అంతర్జాతీయ సదస్సు ను ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో, ఈ సదస్సును ఇండియా ఫౌండేషన్ మరియు నిమ్హాన్స్ సంస్థలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, "భారతదేశం ఆయుర్వేదం మరియు యోగా శాస్త్రాలు గా అభివృద్ధి చెందిన ప్రకృతి మరియు జీవిత అధ్యయనానికి దగ్గరి సంబంధం ఉన్న ఆధ్యాత్మిక విచారణ సంప్రదాయాన్ని కలిగి ఉంది. వ్యక్తి మరియు సామాజిక స్థాయిలో మనస్సు మరియు శరీరంలో ఆరోగ్యం మరియు శ్రేయస్సును పొందడం మరియు నిర్వహించడం కోసం అన్వేషణకు సంబంధించి, స్పృహ అధ్యయనాల రంగంలో మార్గదర్శక పరిశోధనలకు భారతదేశం అనువైన సమావేశ స్థలం." అని పేర్కొన్నారు.
ఈ సమావేశం భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, నాడీశాస్త్రం, కృత్రిమ మేధస్సు, సైబర్-నెటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ తో పాటు, అనుబంధ రంగాల్లోని ప్రముఖ పరిశోధకులు, ఆవిష్కర్తలతో పాటు, ప్రధాన భారతీయ ఆధ్యాత్మిక, మానసిక విభాగాలు, సిద్ధాంతాల పండితులు, ఆధ్యాత్మిక బోధకులను ఒక చోటుకు చేరుస్తుంది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన కార్యక్రమం “ఆయుర్ స్వాస్థ్య యోజన” లో భాగంగా బెంగళూరులోని నిమ్హాన్స్ లోని సమగ్ర వైద్య విభాగంలో "సెంటర్-ఆఫ్-ఎక్సలెన్స్-ప్రాజెక్ట్" ను కూడా అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రారంభించారు. విద్యలో సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణ తదితర అంశాలలో ఆయుష్ నిపుణుల సామర్థ్యాలను ఈ సెంటర్-ఆఫ్-ఎక్సలెన్స్ (సి.ఓ.ఈ) బలోపేతం చేస్తుంది.
సమీకృత యోగా, ఆయుర్వేద చికిత్సా విధానాల సమర్థత, భద్రత, ప్రతిపాదిత యంత్రాంగాన్ని స్థాపించడానికి నాలుగు న్యూరో-సైకియాట్రిక్ డిజార్డర్ లలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం మొదలైనవి, నిమ్హాన్స్ వద్ద సి.ఓ.ఈ. ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యాలు. న్యూరోసైకియాట్రిక్-డిజార్డర్స్ ("దోషిక్-బ్రెయిన్") యొక్క ఇంటిగ్రేటివ్ న్యూరోబయాలజీని కూడా, ఇది అర్థం చేసుకుంటుంది. ఒక ఏకీకృత డిజిటల్ డేటా బేస్ ను రూపొందించి, సాంప్రదాయ, ఆధునిక శాస్త్రీయ విధానాల నుండి మెదడు-ఆరోగ్యాన్ని పరిశీలించడంలో సముచిత నైపుణ్యాలను కలిగి ఉన్న వైద్యుడు-శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చి, అభివృద్ధి చేస్తుంది.
*****
(Release ID: 1861658)
Visitor Counter : 153