సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఆరోగ్య రంగంలో సహకారం కోసం ఎన్.ఎస్.ఐ.సి. మరియు ఆంధ్రప్రదేశ్- మెడ్‌-టెక్-జోన్-లిమిటెడ్ మధ్య కుదిరిన - అవగాహన ఒప్పందం

Posted On: 22 SEP 2022 10:56AM by PIB Hyderabad

ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారంపై భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ సంస్థ (ఎన్.ఎస్.ఐ.సి), మరియు ఆంధ్రప్రదేశ్-మెడ్‌-టెక్-జోన్-లిమిటెడ్ (ఏ.ఎం.టి.జెడ్) మధ్య కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే సమక్షంలో ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది.   ఈ కార్యక్రమంలో, ఎం.ఎస్.ఎం.ఈ. కార్యదర్శి శ్రీ బి.బి. స్వైన్ తో పాటు, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

ఈ అవగాహనా ఒప్పందంపై ఎన్.ఎస్.ఐ.సి., చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ గౌరాంగ్ దీక్షిత్ మరియు ఏ.ఎం.టి.జెడ్, మేనేజింగ్ డైరెక్టర్ & సి.ఈ.ఓ. జితేంద్ర శర్మ, సంతకం చేశారు.

 

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎం.ఎస్.ఎం.ఈ. ల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఎన్.ఎస్.ఐ.సి. మరియు ఏ.ఎం.టి.జెడ్. ల మధ్య ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ఒక ముఖ్యమైన దశ అని శ్రీ నారాయణ్ రాణే పేర్కొన్నారు.   రెండు సంస్థలు తమ నైపుణ్యాన్ని ఉపయోగించుకోగలవని, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎం.ఎస్.ఎం.ఈ. లకు ప్రపంచ స్ధాయిలో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి, అదేవిధంగా, ఈ రంగానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడంతో పాటు తాజా వైద్య సాంకేతికతలను పొందేందుకు అవసరమైన అద్భుతమైన అవకాశాలను సృష్టించగలవని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.   అవగాహన ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, భారతదేశాన్ని వైద్య పరికరాలు / ఆరోగ్య సంరక్షణ రంగంలో అంతర్జాతీయ తయారీదారుగా, ఎగుమతిదారుగా మార్చడం కోసం ఎన్.ఎస్.ఐ.సి. మరియు ఏ.ఎం.టి.జెడ్. సంస్థలకు కేంద్ర మంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

 

*****


(Release ID: 1861550) Visitor Counter : 138
Read this release in: English , Urdu , Marathi , Hindi