మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆరోగ్యవంతమైన పిల్లల అవార్డును అందుకున్న అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 33 జిల్లాలకు చెందిన 306మంది చిన్నారు
రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యవంతమైన పిల్లల అవార్డును అందుకున్న 10మంది చిన్నారులు
Posted On:
19 SEP 2022 5:17PM by PIB Hyderabad
అస్సాంలోని 14 లోక్ సభ నియోజకవర్గాల పరిదిలోని 33 జిల్లాలకు చెందిన 306మంది పిల్లలకు ఆరోగ్యవంతమైన పిల్లల అవార్డును అందచేశారు.
రాష్ట్ర స్థాయిలో 1 సెప్టెంబర్ 2022న జరిగిన 5వ రాష్ట్రీయ పోషన్ మాహ్ (మాసం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10మంది పిల్లలకు అస్సాం ముఖ్యమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆరోగ్యవంతమైన పిల్లల అవార్డును అందించారు.
భారతదేశ వ్యాప్తంగా ఐదేళ్ళ లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపం అన్నది ఒక ఆందోళనకరమైన అంశంగా ఉంది. ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించే చొరవను పరిగణనలోకి తీసుకుని అస్సాం రాష్ట్రం పౌష్టికాహార లోపం లేని అస్సాం అన్న లక్ష్యాన్ని పంచుకుంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో ఆరోగ్యవంతమైన బాలుడు/ బాలిక అవార్డును అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన 20మంది ఆరోగ్యవంతమైన పిల్లలకు అందించనున్నారు. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాలు, 3-5 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతమైన పిల్లలను గుర్తించడానికి, పిల్లల బరువు పొడవును కొలమానాలను తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుగుదలను పర్యవేక్షించందుకు 21మార్చి నుంచి 27 మార్చి వరకు పోషణ్ పఖ్వాడా 2022ను నిర్వహించారు. పోషణ్ పఖ్వాడా సందర్భంగా ఆయా జిల్లాలలో ఐసిడిఎస్ ప్రాజెక్టులన్నింటినీ కవర్ చేస్తూ ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 20మంది ఆరోగ్యవంతమైన పిల్లలను గుర్తించారు. సామాజిక అవగాహన పెంచడం ద్వారా పౌష్టికతను మెరుగు పరచాలన్న లక్ష్యంతో అస్సాం ముఖ్యమంత్రి చేపట్టిన తప్పనిసరి చొరవ ఇది.
ఆరోగ్యవంతమైన పిల్లల అవార్డు ప్రధాన లక్ష్యం:
1)ఆరు నెలల నుంచి 3 ఏళ్ళు & 3-5 ఏళ్ల మధ్య వయసుగల ఆరోగ్యవంతమైన పిల్లలను గుర్తించి, అవగాహనను కల్పించి, పిల్లల ఎదుగుదలకు సంబంధించిన కొలమానాల గురించి ప్రచారాలు నిర్వహించడం.
2) తమ పిల్లల ఆరోగ్యం, సంక్షేమం గురించి నిర్మాణాత్మకమైన పోటీని ప్రోత్సహించడం, ఆరోగ్యవంతమైన పిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించడం
3) పిల్లల ఆరోగ్యం గురించి సమాజాన్ని సున్నితపరచడం,ఆహార వైవిధ్యం, వయస్సుకు తగిన ఆహారం అవసర ప్రాముఖ్యవంటి అంశాలపై సామాజిక అవగాహనను పెంచడం ద్వారా శిశువులు/ పిల్లల పౌష్టికతను మెరుగుపరచడం.
4.) రాష్ట్రంలో ఆరోగ్యం, పౌష్టికత, పోషక ఆరోగ్యం కోసం సమాజాన్ని సమీకరించడం.
ఆరోగ్యవంతమైన పిల్లలను గుర్తించే పద్ధతి
అంగన్‌వాడీ కార్యకర్త (ఎడబ్ల్యుడబ్ల్యు), సహాయకురాలు (ఎ డబ్ల్యుహెచ్) ద్వారా బరువును తూచే పరికరం, స్టడియోమీటర్ లేదా ఇన్ఫాంటోమీటర్ ద్వారా లక్ష్యిత బృందంలోని పిల్లల బరువును/ పొడవును కొలవడం.
పిల్లల బరువును తూచిన తర్వాత, ఆరోగ్యవంతమైన పిల్లలను గుర్తించి డబ్ల్యుహెచ్ఒ చార్ట్‌లో తగిన విధంగా నమోదు చేయడం
ఈ మొత్తం ప్రక్రియలో ఎడబ్ల్యుడబ్ల్యు/ ఎ డబ్ల్యుహెచ్‌లను సంబంధిత సూపర్‌వైజర్లు/ బ్లాక్ పోషణ్ బృందానికి చెందిన వారు మార్గదర్శనం చేశారు.
నిర్దశిత ఫార్మాట్‌లో గుర్తించిన ఆరోగ్యవంతమైన పిల్లల వివరాలను నమోదు చేయడం
***
(Release ID: 1860754)
Visitor Counter : 164