సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాలను (డిడిఆర్ సి) కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర సామాజిక న్యాయ , సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్

Posted On: 18 SEP 2022 5:49PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా విస్తరించిన జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాలు (డిడిఆర్ సి) గత రెండు దశాబ్దాలుగా వికలాంగులకు సమర్థవంతమైన పునరావాస సేవలను అందిస్తున్నాయి. కేంద్రాలను డిఎమ్/కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ మేనేజ్ మెంట్ టీమ్ , ఒక ప్రఖ్యాత ఎన్ జి (సాధారణంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ) సంయుక్తంగా నిర్వహిస్తాయి. వాటి సేవలను మెరుగు పరచడం కోసం, భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ లోని వికలాంగుల సాధికారిత విభాగం ద్వారా ఒక మోడల్ డి డిఆర్ సి ని రూపొందించారు.

బదౌన్, పిలిభిత్, బరీలీ, బాలాఘాట్, గోలాఘాట్, అహ్మదాబాద్, అమరావతి, కులు, రాంపూర్ మొదలైన తొమ్మిది

డి డి ఆర్ సి లను మొదటి దశలో మోడల్ డిడిఆర్ సి స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. తొమ్మిది మోడల్ డి డిఆర్ సిలను భారత ప్రభుత్వ సామాజిక న్యాయ , సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ గా ప్రారంభించారు.

కార్యక్రమంలో వివిధ రాష్ట్ర, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబంధిత డీడీఆర్సీ వేదికగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతమున్న డి డిఆర్ సిలను మోడల్ డి డిఆర్ సిలు గా మార్చడంలో వారు చేసిన అద్భుతమైన కృషిని అధికారులు వివరించారు. అప్ గ్రేడ్ చేయబడిన డిడిఆర్ సి  వివిధ ఛాయాచిత్రాలను వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించారు.

సందర్భంగా, డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్ని మోడల్ డిడిఆర్ సిలతో ఇంటరాక్ట్ అయ్యారు డిడిఆర్ సి పథకం మార్గదర్శకాల్లో చేసిన మార్పులను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవి మరింత ప్రక్షాళనతో

స్వీకరించదగినవిగా  ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 12 నుండి 15 కు పోస్టుల సంఖ్యను పెంచారు, జిల్లా ఆసుపత్రి లేదా జిల్లా ముందస్తు జోక్య కేంద్రానికి సమీపంలో కొత్త డిడిఆర్ సిల సామీప్యత, ఇప్పుడు కన్సల్టెంట్లను కాల్ ప్రాతిపదికన నియమించుకోవచ్చు మరియు గ్రాంట్ విడుదల ప్రక్రియను సులభతరం చేశారు.

సందర్భంగా, డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్ని మోడల్ డిడిఆర్ సిలతో సంభాషించారు  డి  డి ఆర్  సి స్కీమ్ మార్గదర్శకాలలో చేసిన మార్పులను వివరించారు. పోస్ట్ సంఖ్యను ప్రస్తుతమున్న 12 నుండి 15కి పెంచడం, కొత్త  డి   డి ఆర్  సి లను జిల్లా హాస్పిటల్ లేదా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉంచడం, కాల్ ప్రాతిపదికన కన్సల్టెంట్లను నియమించే వీలు, గ్రాంట్ విడుదల ప్రక్రియ సరళీకృతం వంటి అనుసరించదగిన చర్యల గురించి తెలిపారు.

మోడల్ డిడిఆర్ సిల్లో వినికిడి ఉపకరణాల టెస్ట్ ల్యాబ్, స్పీచ్ థెరపీ రూమ్, విజువల్ థెరపీ రూమ్, సైకాలజిస్ట్ రూమ్, ఫిజియోథెరపిస్ట్ రూమ్, గెయిట్ ప్రాక్టీస్ సమాంతర బార్ ,టెలీ మెడిసిన్/ టెలీ థెరపీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, డిడిఆర్ సి ఇప్పుడు యుడిఐడి పోర్టల్ రిజిస్ట్రేషన్ లో పిడబ్ల్యుడిలకు కూడా సహాయపడుతుంది. డిడిఆర్ సి పిడబ్ల్యుడిలకు నాణ్యమైన పునరావాస సేవలను అందించడంలో మైలురాయిగా పనిచేస్తుంది.భవిష్యత్తులో రాబోయే కొత్త డిడిఆర్ సిలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

 

****


(Release ID: 1860488) Visitor Counter : 189


Read this release in: Hindi , English , Urdu , Marathi