ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపు పన్ను చట్టం- 1961 కింద అన్ని నేరాల కింద సవరించిన మార్గదర్శకాలను జారీ చేసిన సిబిడిటీ
Posted On:
17 SEP 2022 7:00PM by PIB Hyderabad
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సునాయాసం చేయడం, నేరారోపణలను నేరరహితం చేయడం వంటి ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ దిశలో చర్యలు చేపట్టింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ('చట్టం') తేదీ 16.09.2022 ప్రకారం సమ్మిళిత నేరాల కోసం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది.
పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం చేసిన కొన్ని ప్రధాన మార్పులు, చట్టంలోని సెక్షన్ 276 ప్రకారం చేసిన నేరాలన్నింటికి శిక్షర్హతను కలిపే విధంగా మార్చడం. కేసుల సమ్మేళనం కోసం అర్హత యొక్క పరిధి సడలించబడింది. దీని ద్వారా 2 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష విధించబడిన ఒక దరఖాస్తుదారు గతంలో సమ్మిళితంగా ఉండేది కాదు. ప్రస్తుతం అన్నింటిని కలిపే విధంగా మార్పులు చేయబడ్డాయి. సమర్థ అధికారంతో అందుబాటులో ఉన్న విచక్షణ కూడా తగిన విధంగా పరిమితం చేయబడింది.
ఉమ్మడి దరఖాస్తుల స్వీకరణ కాల పరిమితి గతంలో ఉన్న 24 నెలల నుండి ఇప్పుడు 36 నెలలకు, ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుండి సడలించబడింది. విధానపరమైన సంక్లిష్టతలు కూడా తగ్గించబడ్డాయి/సరళీకరించబడ్డాయి.
చట్టంలోని అనేక నిబంధనలలో ఉమ్మడి ఫీజు కోసం నిర్దిష్ట గరిష్ట పరిమితులు ప్రవేశపెట్టబడ్డాయి. 3 నెలల వరకు నెలకు 2% జరిమానా వడ్డీ ఉండగా, 3 నెలల తర్వాత నెలకు 3% అదనపు ఛార్జీలు ఉండేవి, ప్రసుతం వీటిని వరుసగా 1%, 2%కి తగ్గించబడ్డాయి.
16.09.2022 నాటి నేరాల సమ్మేళనం కోసం సవరించిన మార్గదర్శకాలు కింది వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
http://www.incometaxindia.gov.in
****
(Release ID: 1860335)
Visitor Counter : 145