హోం మంత్రిత్వ శాఖ

తెలంగాణలో జరిగిన 75వ హైదరాబాద్ విమోచన దినోత్సవం లో పాల్గొన్న కేంద్ర హోం,సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 17 SEP 2022 3:45PM by PIB Hyderabad

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంది. అయితే,  హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం రాలేదు, 13 నెలల పాటు ఈ ప్రాంతం నిజాం సాగించిన  అన్యాయాలను మరియు దౌర్జన్యాలను సహించింది.  సర్దార్ పటేల్ పోలీసు చర్య ప్రారంభించిన తర్వాత మాత్రమే హైదరాబాద్ కు స్వాతంత్ర్యం వచ్చింది.


హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ ప్రాంత ప్రజలు అనేక సంవత్సరాల నుంచి కోరుతున్నారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయం జరిపి అధికారంలోకి వచ్చిన పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదు. 


 కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజల మనోభావాలు అర్ధం చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 


హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీని కోసం ఉత్తర్వులు విడుదల చేసి విమోచనకు నివాళులు అర్పించారు.


 హైదరాబాద్ కు విమోచనం కలిగించిన స్వాతంత్ర్య సమరయోధుల గౌరవార్ధం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించిన  హైదరాబాద్  విమోచన దినోత్సవం భవిష్యత్తులో మరింత ఘనంగా జరుగుతుంది. 


హైదరాబాద్ నిజాం పాలన నుంచి విముక్తి పొందేందుకు  సాగిన పోరాటాన్ని, అజ్ఞాత అమరవీరుల గాథలను గుర్తు చేయడం ద్వారా యువతలో దేశభక్తి భావాలు పెంపొందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహణ 


ప్రపంచంలోనే అత్యుత్తమ  సురక్షితమైన, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు  కృషి చేస్తున్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన  అమరవీరులకు నివాళులర్పించేందుకు స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

 

అడ్డంకులు ఎదురైనప్పటికీ దేశ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 'ఆపరేషన్ పోలో' ప్రారంభించి పోలీస్ చర్యతో నిజాం సైన్యాన్ని ఓడించి ప్రాంతానికి విముక్తి కలిగించి సమైక్య భారతదేశం కలను సాకారం చేశారు.  
1948లో ఇదే రోజున తెలంగాణ, మరాఠ్వాడా, కళ్యాణ్ కర్ణాటక స్వాతంత్యం సాధించాయి. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు 109 గంటల సేపు జరిగిన  పోరాటంలో ఈ ప్రాంతంలో ఎందరో వీరులు అమరులయ్యారు.
నిజాం మరియు అతని రజాకార్లు చేసిన అకృత్యాలు మరియు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించి  చివరికి విజయం సాధించారు.
 
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UVP0.jpg

ఈరోజు తెలంగాణలో జరిగిన 75వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పాల్గొన్నారు. కార్యక్రమంలో  మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండేకేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డికేంద్ర హోంశాఖ కార్యదర్శిపలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C4FT.jpg

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అమిత్ షా 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుందని  అయితే,  హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం రాలేదని అన్నారు. 13 నెలల పాటు ఈ ప్రాంత ప్రజలు నిజాం సాగించిన అకృత్యాలు, దౌర్జన్యాలు సహించారని అన్నారు.సర్దార్ పటేల్ పోలీసు చర్యను ప్రారంభించిన అనంతరం తెలంగాణ  ప్రాంతానికి విముక్తి కలిగిందని అన్నారు.  కొమరం భీమ్, రాంజీ గోండ్, స్వామి రామానంద తీర్థ, ఎం చిన్నారెడ్డి, నరసింహారావు, షేక్ బందగి, కె వి నరసింహారావు, విద్యాధర్ గురు మరియు పండిట్ కేశవరావు కోరాట్కర్ వంటి అనేక మంది  స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. అనభేరి ప్రభాకరరావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కాళోజీ నారాయణరావు, దిగంబర్ రావు బిందు, వామనరావు నాయక్,  క్రీ. వాఘ్మారే, నిజాంపై తిరుగుబాటు జ్వాల వెలిగించిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బి. రామకృష్ణారావు. లకు శ్రీ అమిత్ షా నివాళులు  అర్పించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి,  రజాకార్ సేనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన కళ్యాణ్ కర్ణాటకకు చెందిన బీదర్‌ మాజీ ఎంపీ రామచంద్ర వీరప్ప, జేవర్గి సర్దార్‌ శరంగోడ పాటిల్‌, రాయచూరుకు చెందిన ఎం. నాగప్ప, కొప్పల్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన శివకుమారస్వామి అల్వండి, కనకగిరి నుంచి జయతీర్థ రాజపురోహిత్‌, యాదగిరికి చెందిన కొల్లూరు మల్లప్ప,కరటగికి చెందిన  బెంకల్‌ భీమసేనరావు తో పాటు  పలువురు నాయకులకు శ్రీ షా నివాళులు  అర్పించారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WTG2.jpg

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ ప్రాంత ప్రజలు అనేక సంవత్సరాల నుంచి కోరుతున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయం జరిపి అధికారంలోకి వచ్చిన పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజల మనోభావాలు అర్ధం చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారని శ్రీ అమిత్ షా వివరించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి అనుమతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి శ్రీ షా అభినందించి  కృతజ్ఞతలు   తెలిపారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00409LT.jpg

యువతలో దేశభక్తి భావాలను రగిలించి హైదరాబాద్ విముక్తి ఉద్యమంలో వారు పాల్జేనేలా చేసి విజయం సాధించిన తెలిసిన, తెలియని అమరవీరులకు అంజలి ఘటించి, చరిత్రను. అమరవీరుల గాథలను పునరుజ్జీవింపచేయడం లక్ష్యంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ దేశ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 'ఆపరేషన్ పోలో' ప్రారంభించాలని నిర్ణయించారని తెలిపారు.  పోలీస్ చర్యతో నిజాం సైన్యాన్ని ఓడించి సర్దార్ పటేల్ ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి, ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించి  సమైక్య భారతదేశం కలను సాకారం చేసారని శ్రీ అమిత్ షా అన్నారు.. సర్దార్ పాపన్న గౌర్ తుర్రేబాజ్ ఖాన్అల్లావుద్దీన్భాగ్యరెడ్డి వర్మపండిట్ నరేంద్ర ఆర్యవందేమాతరం రామచంద్రరావుషోయబుల్లాఖాన్మొగిలియ్య గౌర్ దొడ్డి కొమరయ్యచాకలి ఐలమ్మ పోరాట ప్రతిమను శ్రీ షా గుర్తు చేశారు. నిజాం భద్రతా బలగాలతో జరిపిన పోరాటంలో  అత్యున్నత ధైర్యాన్ని ప్రదర్శించిన వీర స్వాతంత్ర్య సమరయోధులు నారాయణరావు పవార్జగదీష్ ఆర్యగండయ్య ఆర్యలకు శ్రీ షా  ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో జాతీయ జెండాను ఎగురవేసిన నేరంపై నిజాం సైన్యం 1947 ఆగస్టు 15న అరెస్టు చేసిన దేశభక్తులకు కేంద్ర హోంమంత్రి నివాళులర్పించారు.  స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక సంస్థలు తమ వంతు సహకారం అందించాయని తెలిపారు. హిందూ మహాసభ మరియు ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సాగిన  'భాగనగర్ సత్యాగ్రహం' లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన  వందేమాతరం ఉద్యమం లాంటి అనేక ఘట్టాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.  ఆనాటి పోరాట జానపద గీతాలను గాంధీ స్థాపించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, బీదర్ ప్రాంత రైతులు ఇప్పటికీ ఆలపిస్తున్నారని అన్నారు.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LD0E.jpg

1948లో ఇదే రోజున తెలంగాణ, మరాఠ్వాడా, కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రాలు స్వతంత్రం సాధించాయని శ్రీ అమిత్ షా అన్నారు. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య కాలంలో 109 గంటల పోరాటంలో ఎందరో వీరులు అమరులయ్యారని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. నిజాం, అతని రజాకార్లు మూడు ప్రాంతాల ప్రజలను అణిచివేసేందుకు కఠిన చట్టాలు అమలు చేసి , భరించలేని అన్యాయానికి పాల్పడి , మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. ఈ ప్రాంత  ప్రజలు ఈ దుశ్చర్యలు మరియు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించి  చివరికి విజయం సాధించారని శ్రీ షా కొనియాడారు. ఈ రోజు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్' ద్వారా జరుపుకోవాలని నిర్ణయించడం ద్వారా హైదరాబాద్ విమోచన ఉద్యమానికి ఆమోదం తెలిపి  నివాళులర్పించారని శ్రీ షా వివరించారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006F1FY.jpg


తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో ఆవిర్భవించిందో అన్న అంశాన్ని  అధికారంలోకి వచ్చిన వారు  విస్మరించి పనిచేస్తున్నారని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇలా ప్రవర్తిస్తున్న వారిని  రాష్ట్ర ప్రజలు కూడా విస్మరిస్తారని  శ్రీ అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌ను విముక్తి కలిగించిన  స్వాతంత్య్ర సమరయోధులందరినీ గౌరవించేందుకు శ్రీ మోదీ ఈరోజు ప్రారంభించిన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని  భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని  ఆయన అన్నారు.

సురక్షిత , అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  భారతదేశాన్ని మరియు భారతీయతను అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు.  దేశంలోని అమరవీరులందరికీ నివాళులు అర్పించేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వ్హఇస్తున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో  'హైదరాబాద్ విమోచన దినోత్సవంఖచ్చితంగా కొనసాగుతుందని శ్రీ షా స్పష్టం చేశారు.

***



(Release ID: 1860250) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Marathi , Kannada