హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తన రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా రెండో రోజు, జైసల్మేర్ లో సరిహద్దు పర్యాటక అభివృదద్ధి కార్యక్రమం కింద తనోత్ మందిర్ కాంప్లెక్స్ లో భూమి పూజ , శంకు స్థాపన కార్యక్రమం నిర్వహించారు.
దేశం కోసం, దేశ ప్రజల సుసంపన్నత, శాంతి, సంతోషం కోసం , అమిత్ షా తనోత్ మాత మందిరాన్ని దర్శించి పూజలు నిర్వహించారు.
సరిహద్దులను కాపాడడంలో తమ ప్రాణాలను అర్పించిన అసమాన ధైర్యసాహసాలు గల వీర జవాన్లకు హోంమంత్రి తనోత్ విజయ్ స్థంభ్ వద్ద నివాళులర్పించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తొలిసారిగా అభివృద్ధి మన సరిహద్దుల వరకూ చేరుతోంది
తనోత్ మందిర్ కాంప్లెక్స్ ప్రాజెక్టు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం 17.67 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీనిని సరిహద్దు పర్యాటక అభివృద్ధి కార్యక్రమం కింద భారతప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ అమలుచేస్తుంది.
ఈ సరిహద్దు ప్రాజెక్టుతో , తనోత్, జైసల్మేర్ లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వలసలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఈ ప్రాంత భద్రతను పటిష్టం చేస్తుంది.
1965 ఇండో -పాక్ యుద్ధసమయంలో పాకిస్థాన్ ఎన్నో బాంబుషెల్స్‌ను శ్రీతనోత్ రాయ్ మాతఆలయ కాంప్లెక్స్‌పై వేసింది, అయితే తనోత్ మాత మహిమ
Posted On:
10 SEP 2022 3:35PM by PIB Hyderabad
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్ లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజున జైసల్మేర్‌లో సరిహద్దు పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్రీ తనోత్ మందిర్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు భూమి పూజ , శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
మన దేశ సరిహద్దుల రక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అసమాన ధైర్యసాహసాలుగల సైనికులకు తనోత్ విజయ్ స్థంబ్ వద్ద దేశ ప్రజల తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు.
సరిహద్దు భద్రతా దళం డైరక్టర్ జనరల్, భారత ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి, పశ్చిమ కమాండ్ అదనపు డైరక్టర్ జనరల్, రాజస్థాన్ ప్రానిటీర్ ఇన్స్‌పెక్టర్ జనరల్, పర్యాటక మంత్రిత్వశాఖ ఆర్ధిక సలహాదారు ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రీ తనోత్ మందిర్ కాంప్లెక్స్‌ప్రాజెక్టును భారతప్రభుత్వ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ , సరిహద్దు పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టనుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తోలిసారిగా అభివృద్ధి మన సరిహద్దులకు చేరుతోంది. అలాగే సరిహద్దు పర్యాటకానికి సంబంధించి దార్శనిక చర్యల ఫలితంగా సరిహద్దు ప్రాంతాలలోనివశిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా పోతున్నాయి. ఆ రకంగా ఈ ప్రాంత భద్రత మరింత పటిష్టమవుతోంది. ఈ దిశగా కేంద్ర హోంమంత్రి 17.67 కోట్ల రూపాయల శ్రీ తనోత్ మందిర్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు సరిహద్దు పర్యాటక అభివృద్ధి కార్యక్రమం కింద జైసల్మేర్ లో శంకుస్థాపన చేశారు. దీనివల్ల శ్రీ తనోత్ మాత మందిరాన్ని దర్శించే యువత మన సైనికుల అసమాన ధైర్యసాహసాల గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.
ఈ ప్రాజెక్టు కింద ఒక విశ్రాంతి గది, ఆంఫీ థియేటర్, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, పిల్లలకోసం ఒక గది, పర్యాటక అభివృద్ధికి వీలుగా పలు సదుపాయాలు కల్పిస్తారు.
శ్రీ అమిత్ షా తనోత్‌మాత మందిరాన్ని దర్శించి దేశం కోసం, దేశ ప్రజల సుఖసంతోషాలు, శాంతి, సుసంపన్నత కోసం ప్రార్థనలు నిర్వహించారు.
జైసల్మేర్ లోని చరిత్రాత్మక శ్రీ మాతేశ్వరి తనోత్ రాయ్ ఆలయానికి అద్భుత చరిత్ర ఉంది. శత్రువుతో పోరాటంలో తనోత్ మాత సైనికులకు తగిన బలాన్నిచ్చి దేశాన్ని రక్షిస్తుందని విశ్వసిస్తారు.
1965లో భారత్ -పాక్‌యుద్ధ సమయంలో పాకిస్థాన్ శ్రీ తనోత్‌రాయ్ మాత ఆలయ కాంప్లెక్స్ పైఎన్నో బాంబులు వేసింది. తనోత్ మాత మహిమ కారణంగా అందులో ఒక్కటీ పేల లేదు. 1965 నుంచి సరిహద్దు భద్రతా బలగం ఈ ఆలయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తోంది. ట్రస్ట్ ద్వారా సరిహద్దు భద్రతా బలగం దీనిని నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం , సాయంత్రం మాతా కీ హారతి, భజన్ సంధ్యను నిర్వహిస్తారు. ఇందులో దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది పాల్గొంటారు. 1971 లో భారత్ -పాక్ మధ్య జరిగిన లోంగోవాల్ సమరంలో సరిహద్దు భద్రతా బలగానికి చెందిన అసమాన ధైర్యసాహసాలు గల సైనికులు లోంగోవాల్ పోస్ట్ వద్ద కీలక పాత్ర పోషించారు.
2021 డిసెంబర్ 04 న ఇండో -పాకిస్థాన్ సరిహద్దులోని ఫార్వర్డ్ పోస్ట్‌ను కేంద్ర హోంమంత్రి సందర్శించిన విషయం ఈ సందర్బంగా గమనార్హం. ఆ సందర్భంలో వారు బి.ఎస్.ఎఫ్ జవాన్లతో మాట్లాడి అక్కడి కార్యకలాపాలపై వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
***
(Release ID: 1858728)
Visitor Counter : 320