గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు రంగంలో వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది


మైనింగ్ మంత్రుల సదస్సు రెండవరోజు బొగ్గు రంగంలో సంస్కరణలు మరియు వాటి ప్రభావంపై ఉద్ఘాటించింది

Posted On: 10 SEP 2022 5:55PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి నిన్న 9 సెప్టెంబర్ 2022 న హైదరాబాద్‌లోని హోటల్ హయత్‌లో జాతీయ గనుల మంత్రుల సదస్సు ఎన్‌ఎంఎంసి)ని ప్రారంభించారు. ఈ రోజు 10 సెప్టెంబర్ 2022న బొగ్గు మంత్రిత్వ శాఖ సెషన్‌తో సమావేశం కొనసాగింది. బొగ్గు రంగాన్ని ‘ఆత్మ నిర్భర్’గా మార్చడం మరియు భారతదేశంలో సుస్థిరమైన మైనింగ్‌ను ప్రోత్సహించే దిశలో జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశం ఓ ముందడుగు.

ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మైనింగ్ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు/ప్రత్యేక కార్యదర్శులు మరియు వివిధ రాష్ట్రాల నుండి మైనింగ్‌కు సంబంధించిన డిజిఎంలు/డిఎంజీలతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ మరియు వివిధ సిపిఎస్‌ఈలకు చెందిన సిఎండీలు పాల్గొన్నారు.

బొగ్గు రంగంలో సంస్కరణలు, వాటి ప్రభావం, బొగ్గు తవ్వకాల కోసం భూసేకరణ, బొగ్గు లాజిస్టిక్స్ మరియు కేటాయించిన బొగ్గు గనుల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

బొగ్గు రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంచేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. 2014లో గౌరవనీ సుప్రీంకోర్టు 204 బొగ్గు బ్లాకులను రద్దు చేసిన తర్వాత 2015లో మొట్టమొదటిసారిగా సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ క్రమంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. వాటిలి వాణిజ్య విక్రయాలకు అనుమతి లేదు. బొగ్గు అమ్మకం/వినియోగంపై ఎలాంటి పరిమితి లేకుండా వాణిజ్య గనుల తవ్వకాలను సరళీకృతం చేయడం ద్వారా 2020లో రెండో సెట్ సంస్కరణలు చేపట్టారు. వినియోగదారులు 50% ఉత్పత్తిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి అనుమతించారు.

ఇటీవల బ్యాంక్ గ్యారెంటీని కేటాయించకుండా పిఎస్‌యులు బొగ్గు బ్లాకులను సరెండర్ చేయడానికి ఒక సారి సడలింపును అనుమతించే విధానం జారీ చేయబడింది.  బొగ్గు బ్లాకులను క్రమ పద్ధతిలో వేలానికి అందించేందుకు బొగ్గు బ్లాకుల రివాల్వింగ్ వేలాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

బొగ్గు మంత్రిత్వ శాఖ సంస్కరణలు చేసే సమయంలో రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చర్చించారు. గతంలో బ్లాక్‌లు స్థిర ధర ఆధారంగా కేటాయించబడ్డాయి. ఇప్పుడు వేలం ద్వారా మార్కెట్ నిర్ణయించిన ప్రకటన వాలోరమ్‌పై ఆధారపడి ఉంటుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్  ధరల కదలికలపై ఆధారపడి జాతీయ బొగ్గు సూచిక  ఉంటుంది.

వివిధ సంస్కరణల నుండి గరిష్ట ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాల మద్దతు అవసరమని హైలైట్ చేయబడింది. బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య ఒప్పందాలను అమలు చేస్తుంది మరియు కార్యాచరణ అంశాలను చూసుకోవడం రాష్ట్ర బాధ్యత. వాణిజ్య వేలం ద్వారా వచ్చే ఆదాయం కూడా సంబంధిత రాష్ట్రాలకు వెళ్తుంది. భూపరిహారం విధానాన్ని రూపొందించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది. అది మెరుగ్గా ఉంటే కేంద్రం రాష్ట్రాల విధానాన్ని అనుసరించవచ్చని చర్చించారు. వాణిజ్య గనుల సంఖ్య మరింత పెరగబోతున్నందున సమీప భవిష్యత్తులో రాష్ట్రాలు సంబంధిత మైన్స్ మరియు జియాలజీ డైరెక్టరేట్‌లకు సలహా ఇవ్వవచ్చు.

ఈ సమావేశంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన తదుపరి తరం సంస్కరణలపై చర్చించారు. వాటిలో మార్కెట్ నిర్ణయించిన ప్రైసింగ్ మెకానిజం, కోల్ గ్యాసిఫికేషన్ మరియు జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ద్వారా బొగ్గు అమ్మకం వంటివి ఉన్నాయి. వేలం బిడ్ ధరలో 50% రాయితీ, సిఐఎల్ నుండి దీర్ఘకాలిక అనుసంధానం వంటి ప్రోత్సాహకాలతో పాటు బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు చేపట్టిందని  అలాగే బొగ్గు గ్యాసిఫికేషన్‌కు మద్దతుగా పిఎల్‌ఐ పథకం రూపొందించబడుతుందని తెలిపారు. 2070 నాటికి ఉద్గారాలను నికర జీరో లక్ష్యానికి తగ్గించాలనే దేశ  లక్ష్యం గురించి కూడా వాటాదారులకు తెలియజేయబడింది. ఇది బొగ్గు రంగాన్ని మరింత స్థిరమైన మైనింగ్ పద్ధతులను అవలంబించడానికి మాత్రమే కాకుండా పరివర్తనకు సిద్ధంగా ఉండటానికి కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. గత మూడేళ్లలో సిఐఎల్ ప్లాంటేషన్ ప్రాంతం రెండింతలు పెరిగింది. అధిక సామర్థ్యం గల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పవచ్చని లిగ్నైట్ సంపన్న రాష్ట్రాలకు తెలియజేయబడింది.

ఈ సదస్సులో ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం, మిజోరం, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు చెందిన గౌరవనీయ మంత్రులు మరియు సెక్రటరీ (గనులు), జె&కె, డైరెక్టర్ (గనులు), జార్ఖండ్, ఎండీ, జిఎండిసి మరియు జాయింట్ డైరెక్టర్ (మైనింగ్), ఛత్తీస్‌గఢ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి నిర్మాణాత్మక సూచనలను అందించారు.

సెక్రటరీ (బొగ్గు) డాక్టర్ అనిల్ కుమార్ జైన్ మరియు గౌరవనీయ బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ముగింపు వ్యాఖ్యలు అందించారు. మరియు.ఎస్‌సిసిఎల్‌ సిఎండీ శ్రీ ఎన్‌. శ్రీధర్ తెలిపిన ధన్యవాదాలతో సమావేశం ముగిసింది.


 

*****


(Release ID: 1858329) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Hindi , Marathi