ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిఎస్ఆర్ చొర‌వ‌ల్లో భాగంగా దృష్టిలోపం గ‌ల పిల్ల‌ల పాఠ‌శాల‌కు ఈకో వాన్‌ను అంద‌చేసిన ఎస్‌పిఎంసిఐఎల్

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2022 6:24PM by PIB Hyderabad

 ఎస్‌పిఎంసిఐఎల్ సిఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌) చొర‌వ‌ల్లో భాగంగా గురువారం నాడు న్యూఢిల్లీ లాజ్‌ప‌త్ న‌గ‌ర్‌లోని అమ‌ర్‌కాల‌నీలో గ‌ల అంధుల పాఠ‌శాల‌ను న‌డిపే సంస్థ‌కు ఈకో వాన్‌ను ఎస్‌పిఎంసిఐఎల్ డైరెక్ట‌ర్ (హెచ్ ఆర్‌) శ్రీ ఎస్‌. కె. సిన్హా, ఎస్‌పిఎంసిఐఎల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(హెచ్ ఆర్‌) శ్రీ బి.జి. గుప్తాల స‌మ‌క్షంలో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ( ఎస్‌పిఎంసిఐఎల్) చైర్మ‌న్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ తృప్తి పాత్ర ఘోష్ అంద‌చేశారు. 
ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఎస్‌పిఎంసిఐఎల్ సిఎస్ఆర్ చొర‌వ‌ల్లో భాగంగా పాఠ‌శాల‌కు అంద‌చేసిన ఇత‌ర వ‌స్తువుల‌ను వారు త‌నిఖీ చేశారు. 
అంథ పాఠ‌శాల‌కు చెందిన దివ్యాంగ పిల్ల‌లు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మంలో భాగంగా వారు సంగీతం, త‌బ్లా ప్ర‌ద‌ర్శ‌న‌, జుగ‌ల్బందీల అద్భుత ప్ర‌ద‌ర్శన‌ను వారు తిల‌కించారు.  
ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా,  గ‌తంలో పిల్ల‌ల‌కు ఎస్‌పిఎంసిఐఎల్ బ్రెయిలీ వాచీల‌ను, సౌండ్ సిస్ట‌మ్‌ను అంద‌చేసినందుకు పాఠ‌శాల యాజ‌మాన్యం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 

***


(రిలీజ్ ఐడి: 1858234) సందర్శకుల సూచీ సంఖ్య : : 174
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी