శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డీబీటీ- బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ మద్దతుతో కొవిడ్ 19కి చికిత్సగా తయారు చేసిన మొదటి నాసికా వ్యాక్సిన్‌కు భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ నుండి అత్యవసర వినియోగ అనుమతి లభించింది.
Posted On:
07 SEP 2022 4:23PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) దాని పబ్లిక్ సెక్టార్ యూనిట్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) డీసీజీఐ నుండి భారత్ బయోటెక్ (బీబీఐఎల్) ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్కు మొదటిగా అత్యవసర వినియోగ అధికారం కోసం ఆమోదం ప్రకటించడం ఆనందంగా ఉంది. మిషన్ కొవిడ్ సురక్ష ఆధ్వర్యంలో డీబీటీ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ మద్దతుతో, ఈ మిషన్ డీబీటీ ద్వారా ప్రారంభమయింది. ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా కొవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి వేగవంతం చేయడానికి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ద్వారా అమలు చేయడమైది. టీకా అభివృద్ధి, వివిధ స్థాయిలలో శాస్త్రీయ నాయకత్వం డీబీటీ ప్రయోగశాలలు, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ద్వారా అందింది. మిషన్ కోవిడ్ సురక్ష కింద కోవిడ్-19 వ్యాక్సిన్‌కి ఇది నాలుగో విజయం. బీబీవీ154 అనేది ఇంట్రానాసల్ రెప్లికేషన్-లోపం గల చింపాంజీ అడెనోవైరస్ సార్స్ కోవిడ్2వెక్టార్డ్ వ్యాక్సిన్. ఇది స్థిరీకరించబడిన స్పైక్ సార్స్ కోవిడ్2(వుహాన్ వేరియంట్)ని వ్యక్తీకరించే ప్రతిరూపణ లోపం ఉన్న సీహెచ్ఏడీ వాహకాన్ని కలిగి ఉంటుంది.
ఢిల్లీలోని డీబీటీకి చెందిన అటానమస్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్ఐఐ) "హ్యూమన్ ఇమ్యూన్ మానిటరింగ్ టీ-సెల్ ఇమ్యునోఅస్సే ప్లాట్‌ఫారమ్"ను టీకా-ప్రేరిత సార్స్కోవిడ్2 -నిర్దిష్ట దైహిక శ్లేష్మ సెల్యులార్ రోగనిరోధక ప్రతిస్పందనలను ట్రయల్‌లో పాల్గొనేవారిని పరిశీలించడానికి ఉపయోగించింది. ఇంటరాక్టివ్ రీసెర్చ్ స్కూల్ ఫర్ హెల్త్ అఫైర్స్ (ఐఆర్ఎస్హెచ్ఏ), పూణె ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్‌ను పూర్తి చేసింది
డీబీటీ కార్యదర్శి , బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే మాట్లాడుతూ, “మిషన్ కోవిడ్ సురక్ష ద్వారా డిపార్ట్‌మెంట్ సురక్షితమైన , సమర్థవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉంది. బీబీవీ154 కోవిడ్ వ్యాక్సిన్ అనేది మిషన్ కోవిడ్ సురక్ష కింద దేశంలో అభివృద్ధి అవుతున్నది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగానికి మాత్రమే పరిమితం. 18+ వయస్సులో ఉన్న కోవిడ్-19 బాధితులకు ప్రాథమిక రోగనిరోధకత కోసం డీజీసీఐ ఆమోదించిన మొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్త చొరవకు ఇది అద్భుతమైన ఉదాహరణ. భారత్ బయోటెక్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు , మొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో శాస్త్రీయ నాయకత్వాన్ని అందించినందుకు మా శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను”అని అన్నారు.
***
(Release ID: 1858175)
Visitor Counter : 194