గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖాదీకి ప్రోత్సాహమే లక్ష్యంగా సెప్టెంబర్11న ‘అహేలీ ఖాదీ’ !


గాంధీనగర్‌ ‘నిఫ్ట్‌’లో ఫ్యాషన్ షో, ఎగ్జిబిషన్..
సి.ఒ.ఇ.కె. ఆధ్వర్యంలో నిర్వహణ

Posted On: 09 SEP 2022 1:26PM by PIB Hyderabad

ఫ్యాషన్ కోసం ఖాదీ!

జాతికోసం ఖాదీ!

పరవర్తన కోసం ఖాదీ!

  ఖాదీని ఫ్యాషన్ వస్త్రంగా నిలబెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునే తన ప్రధాన లక్ష్యంగా ఖాదీ ప్రతిభా కేంద్రం (సి.ఇ.ఒ.కె.) చేపట్టింది. అందరికీ ఖాదీ, ప్రత్యేకించి మన సమాజంలో ప్రధాన భాగమైన యువతకోసం ఖాదీ అన్న లక్ష్యంకోసం  ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నారు.

   ఖాదీపై లక్ష్యాన్ని, ప్రధాని సందేశాన్ని యువతకు, ప్రపంచ మార్కెట్‌కు చేరువగా  తీసుకెళ్లేందుకు ఖాదీ ప్రతిభా కేంద్రానికి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వ్యవహారాల (ఎం.ఎస్.ఎం.ఇ.) మంత్రిత్వ శాఖ రూపకల్పన చేసింది. జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్.ఐ.ఎఫ్.టి.-నిఫ్ట్) సహకారంతో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి.), ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన  సి.ఒ.ఇ.కె. ఏర్పాటైంది. బెంగళూరు, గాంధీనగర్, కోల్కతా, షిల్లాంగ్ ప్రాంతాల్లో సి.ఒ.ఇ.కె. శాఖా కేంద్రాలున్నాయి.

   ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2022 సెప్టెంబరు 11వ తేదీన గాంధీనగర్‌లో అహేలీ ఖాదీ పేరిట ఒక ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని, ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. సి.ఒ.ఇ.కె. ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని గాంధీనగర్‌లో ఉన్న జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (నిఫ్ట్) ఆవరణలోని తానారీరీ ఆడిటోరియంలో సెప్టెంబరు 11 ఆదివారం సాయంత్రం 6గంటలకు నిర్వహిస్తారు. కె.వి.ఐ.సి. చైర్మన్ మనోజ్ గోయెల్ ప్రధాన అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కె.వి.ఐ.సి. అధికారులు, విద్యావేత్తలు, డిజైనర్లు, పారిశ్రామిక ప్రముఖులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

  అహేలీ అంటే స్వచ్ఛమైన, సిసలైన అని అర్థం. ఖాదీ సంస్థలనుంచి నేరుగా తెప్పించే సిసలైన, నిఖార్సైన ఖాదీని వినియోగదారులు అందరికీ అందించాలన్న సి.ఒ.ఇ.కె. తపనకు అనుగుణంగా ఈ ప్రదర్శనకు, ఎగ్జిబిషన్‌కు రూపకల్పన చేశారు. ఆరు విభిన్నమైన రకాల ఖాదీ వస్త్రాలను, దుస్తులను, పలు మేలిమి రకాల డిజైన్ చీరలను సి.ఒ.ఇ.కె. డిజైనర్లు రూపొందించారు. చేతి తయారీ ఎంబ్రాయిడరీ, అల్లికలు, కుట్టపనులు, చేతి బ్లాక్ ప్రింటింగ్‌లతో ఆకర్షణీయంగా తయారైన సుందరమైన ఖాదీ ఉత్పాదనలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు.

   ఖాదీని ప్రపంచ స్థాయిలో మేటి వస్త్రంగా నిలిపే లక్ష్యంతో స్వదేశీ నూలుతో తయారైన వస్త్రాలను భారతీయ హస్తకళలతో కలగలిపి వాటికి అంతర్జాతీయ రూపును సంతరింపజేస్తారు. ఈ ఎగ్జిబిషన్‌లో కుషన్ కవర్లను, రన్నర్లను, టేబుల్ క్లాత్‌లను కూడా అందుబాటులో ఉంచుతారు.

  ఖాదీని విశ్వసనీయమైన ఉత్పాదనగా ప్రోత్సహించడమే సి.ఒ.ఇ.కె. లక్ష్యం. పర్యావరణపరంగా సుస్థిరమైన వస్త్రంగా ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించాలని కూడా సి.ఒ.ఇ.కె. భావిస్తోంది.

 

****


(Release ID: 1858173) Visitor Counter : 160