ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2025 నాటికి టీ బీ ని నిర్మూలించేందుకు ‘ప్రధాన్ మంత్రి టీ బీ ముక్త్ భారత్ అభియాన్’ ను గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు


యుద్ధ ప్రాతిపదికన జన్‌భాగీదారి స్ఫూర్తితో టీబీ నిర్మూలనకు పౌరులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

"ప్రజల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాన్ని రూపొందించినప్పుడు, దాని విజయావకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి"

2025 నాటికి టీబీని నిర్మూలించడానికి జన చైతన్య ఉద్యమం అవసరం అని డాక్టర్ మన్సుఖ్ మాండవియా పునరుద్ఘాటించారు

ప్రపంచ లక్ష్యం కంటే ఐదు సంవత్సరాల ముందు "టీ బీ ముక్త్ భారత్ అభియాన్ గౌరవనీయ ప్రధానమంత్రి లక్ష్యం మరియు పౌర-కేంద్రీకృత విధానాలకు అనుగుణమైన కార్యాచరణ కు కొనసాగింపు"

Posted On: 09 SEP 2022 2:48PM by PIB Hyderabad

 "ప్రజల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాన్ని రూపొందించినప్పుడు, దాని విజయావకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి" అని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు.

 

ద్రౌపది ముర్ము యుద్ధ ప్రాతిపదికన జన్ భాగీదారి స్ఫూర్తితో టీ బీ నిర్మూలనకు పౌరులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రధాన మంత్రి టీ బీ ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర మంత్రులు, గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు మరియు ఇతర ప్రముఖులతో పాటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరోక్ష పద్ధతిలో జరిగిన సమావేశం లో రాష్ట్ర మరియు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, కార్పొరేట్లు, పరిశ్రమలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు (NGO) లు మరియు టీ బీ ఛాంపియన్ల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు, ప్రపంచ లక్ష్యం 2030 కంటే ఐదేళ్ల ముందు 2025 నాటికి తీవ్ర  అంటు వ్యాధిని నిర్మూలించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. మార్చి 2018 ఢిల్లీ లో జరిగిన ఎండ్ టీ బీ సదస్సు లో గౌరవనీయ ప్రధాన మంత్రి ఈ లక్ష్యాన్ని ని మొదటిసారిగా వ్యక్తీకరించారు.

 

టీ బీ చికిత్సలో ఉన్నవారికి అదనపు రోగనిర్ధారణ, పోషకాహారం మరియు వృత్తిపరమైన సహాయాన్ని అందించడానికి రాష్ట్రపతి ని-క్షయ్ మిత్ర కార్యక్రమాన్ని  ప్రారంభించారు. రోగులకు వారి వైద్య చికిత్స పూర్తిగా అందచేయడంలో సహాయం చేయడానికి ఎన్నికైన ప్రతినిధులు, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు (NGO) లు మరియు వ్యక్తులు దాతలుగా ముందుకు రావాలని ప్రోత్సహించారు. 

 

2025 నాటికి టీ బీ ని అంతం చేయాలనే భారతదేశం యొక్క నిబద్ధతకు అనుగుణంగా సమాజ  పాత్రను పెంపొందించడంలో మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో, టీ బీ రోగుల చికిత్స ఫలితాలను మెరుగుపరచడానికి  రోగులకు  అదనపు సహాయాన్ని అందించడం కోసం రూపొందించిన Ni-kshay 2.0 పోర్టల్ (https://communitysupport.nikshay.in/)  పై లక్ష్యాలను సాధించడాన్ని సులభతరం చేస్తుంది

 

అత్యున్నత స్థాయి నాయకత్వ  నిబద్ధత కారణంగా నేషనల్ టీ బీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌టిఇపి)  ద్వారా వ్యాధి చికిత్స నివారణ లో భారతదేశం వేగవంతమైన పురోగతిని ప్రదర్శించింది. ఈ వర్చువల్ లాంచ్ వేడుకలో ప్రసంగిస్తూ గౌరవనీయ భారత రాష్ట్రపతి దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడం లో ఆరోగ్య కార్యకర్తలు, సమాజ నాయకులు మరియు పౌరుల  అవిశ్రాంత సమిష్టి ప్రయత్నాలను ప్రశంసించారు. టీ బీ ని తొలగించడానికి ఇదే విధమైన సమస్త సమాజ సమిష్టి విధానాన్ని అవలంబించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

 

ఆరోగ్య వ్యవస్థ లో అన్ని స్థాయిలలో సరసమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడంలో ఎవరూ వెనుకబడి ఉండరాదనే సార్వత్రిక ఆరోగ్య విస్తృత లక్ష్యాన్ని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సాధించిన పురోగతిని వివరిస్తూ, టీ బీ నిర్మూలన లక్ష్యాలను సాధించడంలో పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క కీలక పాత్రపై ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నయం చేయగల వ్యాధి అయిన టీ బీ చికిత్సలో కావలసిన మెరుగైన అవగాహన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ చికిత్స ఉచితంగా లభిస్తుంది.

 

వ్యాధితో ముడిపడిన కళంకం దురభిప్రాయం పై సమిష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని కూడా గౌరవనీయ రాష్ట్రపతి నొక్కిచెప్పారు.

 

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ప్రధాన మంత్రి టీ బీ ముక్త్ భారత్ అభియాన్ గౌరవనీయ ప్రధానమంత్రి పౌర-కేంద్రీకృత విధానాలకు అనుగుణమైన కార్యాచరణ కు కొనసాగింపు " అని పేర్కొన్నారు. స్థిరమైన ప్రయత్నాల వల్ల టీ బీ కేసుల నెలవారీ నమోదు,  2021 చివరి నాటి మహమ్మారి   ముందు స్థాయిలను చేరుకోవడం వంటి కీలక సూచికలు  టీ బీ ప్రోగ్రామ్ యొక్క  విజయాన్ని తెలియజేస్తున్నాయి అని ఆయన అన్నారు.

 

భారతదేశంలో టిబి నిర్మూలనకు సమగ్ర (360-డిగ్రీల) విధానం మూలస్తంభమని కేంద్ర ఆరోగ్య మంత్రి నొక్కిచెప్పారు మరియు 2025 నాటికి టీ బీ ని నిర్మూలించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చే ఐక్య జన చైతన్య సామాజిక విధానం అవసరమన్నారు.

 

నిక్షయ్ పోర్టల్‌లో దాదాపు 13.5 లక్షల మంది టీ బీ రోగులు నమోదు చేసుకున్నారని, వారిలో 8.9 లక్షల మంది యాక్టివ్ టీ బీ రోగులు దత్తత స్వీకరించడానికి తమ సమ్మతిని తెలిపారని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ని-క్షయ్ డిజిటల్ పోర్టల్ టీ బీ ఉన్న వ్యక్తులకు సామాజిక మద్దతు కోసం ఒక వేదికను అందిస్తుంది. పౌరులందరూ, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు తదితరులు ని-క్షయ్ మిత్రలుగా మారి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మరియు కార్యచరణ గురించి చర్చించడానికి సమావేశాలను ఏర్పాటు చేయాలని, కాబట్టి టీ బీ తో ఎవరూ బెంగపెట్టుకోవద్దని ఆయన కోరారు.

 

రోగి-కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, డాక్టర్ మన్సుఖ్ మాండవియా ని-క్షయ్ పోషణ్ యోజన వంటి సహాయక పథకాల సహకారాన్ని ప్రశంసించారు, ఇది  టీ బీ చికిత్సలో ఉన్న వారికి పోషకాహార మద్దతుగా నేరుగా రూ.500 నగదు బదలీ చేస్తుంది. ఇది టీ బీ చికిత్స పొందుతున్న ప్రజలకు పోషకాహారం తీసుకోవటానికి ఉపకరిస్తుంది. టీ బీ యొక్క సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించడానికి రాష్ట్రాలు నిర్వహిస్తున్న విభిన్న రోగుల సహాయ కార్యక్రమాలను ఆయన అభినందించారు. 

 

టీ బీ చికిత్స  పొందుతున్న ప్రజలకు పోషకాహారం, రోగనిర్ధారణ మరియు వృత్తిపరమైన మద్దతును అందించడం ద్వారా టీ బీ  నిర్మూలన కోసం జనచైతన్య ఉద్యమం లో భాగస్వాములు కావాలని ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ ప్రపంచంలోని నాయకులు మరియు ఇతర ప్రభావవంతమైన ప్రజాసంస్థల ప్రతినిధులకు కూడా ఆయన పిలుపునిచ్చారు.

 

ఎన్ టి ఈ పి గురించి

 

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP), గతంలో రివైజ్డ్ నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (RNTCP)గా పిలువబడేది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కంటే ఐదేళ్ల ముందు 2025 నాటికి భారతదేశంలో టీ బీ వ్యాధిని వ్యూహాత్మకంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో, 2025 నాటికి భారతదేశంలో టీ బీ ని నిర్మూలించాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని  సాధించడానికి ఆర్ ఎన్ టి సి పి (RNTCP)ని నేషనల్ TB ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP)గా మార్చారు. ఇది 632 జిల్లాలు/ రిపోర్టింగ్ యూనిట్లలలోని వంద కోట్ల మంది ప్రజలకు పైగా చేరుకుంది అలాగే రాష్ట్రాలు/యుటిలతో పాటు టీ బీ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం యొక్క ఐదు సంవత్సరాల జాతీయ వ్యూహాత్మక ప్రణాళికల అమలు బాధ్యతను తీసుకుంది. 

 

టీ బీ నిర్మూలన కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక మిషన్ మోడ్‌లో 2025 నాటికి టీ బీ ని అంతం చేసే లక్ష్యాన్ని సాధించడానికి ప్రారంభించబడింది. ఇది ఒక బహుళ దృక్కోణ విధానం, ఇది టీ బీ రోగులందరినీ ప్రైవేట్ ఆసుపత్రుల బారినుండి రక్షిస్తూ టీ బీ రోగులను చేరుకోవడంపై దృష్టి పెట్టడం మరియు అధిక ప్రమాదం ఉన్న జనాభాలో గుర్తించబడని టీ బీ ని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది

 

2021లో భారతదేశం 21 లక్షల టీ బీ కేసులను నమోదు చేసింది, అంచనా వేసిన కేసుల సంఖ్య మరియు గతంలో నిక్షయ్ (Ni-kshay) పోర్టల్‌లో నమోదు చేయబడిన సంఖ్య మధ్య అంతరాలను విజయవంతంగా తగ్గించింది. ని-క్షయ్ పోషణ్ యోజన (NPY) వంటి  పథకాలతో సహా అనేక ముందు చూపు విధానాలు అమలు చేయబడ్డాయి, ఇది టీ బీ రోగుల పోషకాహార అవసరాలను తీర్చడంలో సహాయపడింది. దేశవ్యాప్తంగా టీ బీ చికిత్సపై 2018 నుండి ఇప్పటి వరకు 65 లక్షల మందికి పైగా ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి  సుమారు ₹1,707 కోట్లు పంపిణీ చేశారు.

 

ప్రైవేట్ రంగాన్ని భాగస్వాములను చేయడంలో భాగంగా, దేశీయ మరియు జీ ఈ ఈ టీ (JEET )చొరవ ద్వారా పేషెంట్ ప్రొవైడర్ సపోర్ట్ ఏజెన్సీలు (PPSA) 250 జిల్లాల్లో విస్తరించబడ్డాయి, ఇది మొత్తం టీ బీ రోగులలో 32% మంది ప్రైవేట్ రంగం నుండి నమోదు కావడానికి దారితీసింది.

 

వ్యాధి నిర్ధారణ చేయబడిన అన్ని టిబి కేసులకు యూనివర్సల్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్టింగ్ (యుడిఎస్‌టి) ఆధారంగా  రోగులకు డ్రగ్-రెసిస్టెంట్ టిబి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. తద్వారా సకాలంలో సరైన చికిత్స ప్రణాళికలను రూపొందించారు. ఈ కార్యక్రమం లో భాగంగా   2021 వరకు దేశవ్యాప్తంగా 3,760 ఎన్ ఎ ఎ టీ ( NAAT ) మెషీన్‌లను ఏర్పాటు చేశారు. 

 

డిసెంబర్ 2022 నాటికి వెనుకబడిన ప్రాంతాల వర్గాల వారికి టీ బీ సంరక్షణ సేవలతో సహా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను వికేంద్రీకరించడానికి 1,50,000 పైగా ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి.

 

ఈ కార్యక్రమం లో సమాజాన్ని భాగస్వాములను చేయడానికి మరియు టీ బీ కి వ్యతిరేకంగా జన బాహుళ్యాన్ని చైతన్యవంతులు చేయడానికి వ్యూహాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమం 12,000 కంటే ఎక్కువ టీ బీ ఛాంపియన్‌లను గుర్తించి, వెనుకబడిన ప్రాంతాల మరియు అట్టడుగున ఉన్న వారిని చేరుకోవడానికి మరియు సంరక్షణను  అందించడంలో రోగులకు మద్దతునిస్తుంది. చికిత్సలో సాధారణ సమస్యలను పరిష్కరించడానికి రోగులు, వైద్యులు మరియు వారి సంరక్షకులకు మధ్య అనుసందానానికి సంభాషణలను సులభతరం చేయడానికి పేషెంట్ సపోర్ట్ గ్రూప్‌ల (PSGs) ఏర్పాటుకి కూడా ఈ కార్యక్రమం మద్దతునిస్తోంది.

***



(Release ID: 1858171) Visitor Counter : 216


Read this release in: Odia , English , Urdu , Hindi , Marathi