వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఈ-ఫైలింగ్ ని ఎంచుకునే బాధిత వినియోగదారులకు సమర్థవంతమైన పరిష్కారంగా ఉద్భవించిన - ఈ-దాఖిల్ పోర్టల్
ఈ-దాఖిల్ పోర్టల్ లో 84,957 మంది నమోదిత వినియోగదారుల నుంచి 23,640 ఫిర్యాదులు అందాయి.
2020 సెప్టెంబర్, 7వ తేదీన ప్రారంభమైన ఈ సదుపాయం ఇప్పుడు సంబంధిత ఎన్.సి.డి.ఆర్.సి., స్టేట్ కమిషన్, 13- సర్క్యూట్ బెంచ్ లు, 651-జిల్లా కమీషన్‌ల కోసం 33 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో పని చేస్తోంది
Posted On:
07 SEP 2022 5:36PM by PIB Hyderabad
గత రెండేళ్లలో ఈ-దాఖిల్ పోర్టల్ పై ఇ-ఫైలింగ్ ద్వారా మొత్తం 23,640 ఫిర్యాదులు అందాయి. ఈ సదుపాయం ప్రస్తుతం 33 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో సంబంధిత ఎం.సి.డి.ఆర్.సి., స్టేట్ కమిషన్, 13-సర్క్యూట్ బెంచ్‌లు, 651-జిల్లా కమీషన్ ల కోసం పనిచేస్తోంది.
ఈ-దాఖిల్ పోర్టల్ విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, 2020 సెప్టెంబర్, 7 వ తేదీన ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజు వరకు ఈ-దాఖిల్ సాధించిన ప్రగతి ని తెలియజేసే ఈ-బుక్ ను, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ తో పాటు అదనపు కార్యదర్శి, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సి.సి.పి.ఏ) చీఫ్ కమిషనర్ శ్రీమతి నిధి ఖరే ఈ రోజు ఇక్కడ విడుదల చేశారు. ఈ-దాఖిల్ పోర్టల్ లో కనీసం 84,957 మంది వినియోగదారులు నమోదు కాగా, ఇప్పటి వరకు 5,590 ఫిర్యాదులు అందాయి.
వినియోగదారులను ప్రభావితం చేసే వినూత్న సమస్యలను పరిష్కరించడానికి రూపొందిన 2019-వినియోగదారుల రక్షణ చట్టం, 2020 జులై, 20 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కోవిడ్-19 కారణంగా వినియోగదారులపై ఆంక్షలు విధించడం ద్వారా, వినియోగదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి సరసమైన, వేగవంతమైన, ఎటువంటి అవాంతరాలు లేని యంత్రాంగం గా ఈ-దాఖిల్ పోర్టల్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
దీంతో, తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం వినియోగదారుల కమిషన్ ను సంప్రదించడానికి సమయ పరిమితులను ఎదుర్కొంటున్న వినియోగదారుల కోసం, ఈ-దాఖిల్ వ్యవస్థ ఒక సరళమైన వేదికను అందించినట్లయ్యింది. గ్రామీణ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ను సులభతరం చేయడానికి ఈ-దాఖిల్ సైట్ తో కామన్ సర్వీస్ సెంటర్లను (సి.ఎస్.సి) ఏకీకృతం చేయడానికి కూడా అంగీకరించడం జరిగింది. వినియోగదారు కమిషన్ కు ఫిర్యాదులు చేయడానికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మార్గాలు అందుబాటులో లేని లేదా ఉపయోగించడానికి అవగాహన లేని గ్రామ పంచాయతీ పరిధిలోని వినియోగదారులు సి.ఎస్.సి. ల సేవలను ఉపయోగిస్తున్నారు. ఈ పోర్టల్ ను సి.ఎస్.సి. తో అనుసంధానించే ప్రక్రియ ఇప్పుడు పూర్తయింది. ఫలితంగా, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడానికి అందుబాటులో లేని లేదా సాంకేతిక నైపుణ్యం లేని వినియోగదారులు సంబంధిత వినియోగదారు కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి వారి స్థానిక సి.ఎస్.సి. ల నుండి సహాయం పొందవచ్చు.
ఈ-దాఖిల్ ద్వారా అనేక కేసులు విజయవంతంగా పరిష్కారమయ్యాయి. ఈ-దాఖిల్ వేదిక ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో గౌరవనీయ న్యాయమూర్తి సుభాష్ చంద్ర కులశ్రేష్ఠ నేతృత్వంలోని మెయిన్ పురి జిల్లా దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. ఫిర్యాదులను పరిష్కరించడానికి వీలుగా వినియోగదారుల ఫిర్యాదు అందినట్లు ఈ-కామర్స్ సంస్థ ద్వారా 48 గంటల్లోగా తప్పనిసరిగా రసీదు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది.
బాధిత వినియోగదారులు అనుభవించిన కష్టానికి సరైన నష్ట పరిహారం పొందేందుకు, 2019- వినియోగదారుల రక్షణ చట్టం లోని సమర్థవంతమైన నిబంధనలు అవకాశం కల్పిస్తాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారికి జరిమానా విధించే నిబంధనలను కూడా ఇది పరిశీలిస్తుంది. వినియోగదారుల కమీషన్లలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఫిర్యాదులను విచారించే నిబంధనలను కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది.
ఏదైనా వినియోగదారుడు లేదా న్యాయవాది తమ రిజిస్టర్డ్ సెల్ ఫోన్ లో వచ్చిన ఓ.టి.పి. లేదా వారి నమోదిత ఈ-మెయిల్ చిరునామాలో యాక్టివేషన్ లింక్ ను స్వీకరించడం ద్వారా అవసరమైన ప్రమాణీకరణతో ఈ-దాఖిల్ ప్లాట్-ఫారమ్ లలో సైన్ అప్ చేయవచ్చు. తద్వారా, వారు తమ ఫిర్యాదు దాఖలు చేసి, తదుపరి చర్యలు కొనసాగించవచ్చు.
బాధిత వినియోగదారులందరికీ ఆన్‌లైన్ లో వినియోగదారుల కమీషన్ లకు వారి స్వంత ఇళ్లలో సౌకర్యంగా ఫిర్యాదులను సమర్పించడానికి, తగిన రుసుములను చెల్లించడానికి, ఆన్ లైన్ లో కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ఈ పోర్టల్ సౌకర్యాన్ని కల్పించింది.
ఇటీవలి తాజా సమాచారంతో, ఈ-దాఖిల్ ప్లాట్‌ఫారమ్ లో 5,590 కేసులు నమోదు కాగా, అందులో, 889 కేసులు పరిష్కరమయ్యాయి. ఈ-దాఖిల్‌లో నమోదిత వినియోగదారుల సంఖ్య 2020 సెప్టెంబర్ లో 5,963 ఉండగా 2022 ఆగష్టు నాటికి ఈ సంఖ్య 84,657 కి పెరగడంతో నిరంతర వృద్ధిని గమనించడం జరిగింది.
ఫిరోజాబాద్, అలీఘర్, మెయిన్‌పురి, వైశాలి, పోర్ట్ బ్లెయిర్, దుమ్కా, పశ్చిమ త్రిపుర, రంగారెడ్డి, అండమాన్ & నికోబార్ జిల్లాలలో ఈ వేదిక ద్వారా అనేక కేసులను ఈ-దాఖిల్ వ్యవస్థ విజయవంతంగా పరిష్కరించింది.
దీనితో పాటు, 1915 అనే ఎన్.సి.హెచ్. (నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్) నెంబరు 24 గంటలు, 12 విభిన్న భాషల్లో అందుబాటులో ఉంది. అయితే, ఫిర్యాదుదారు ఫిర్యాదుల పరిష్కారం తో సంతృప్తి చెందని పక్షంలో, ఫిర్యాదుదారుడిని ఈ-దాఖిల్ ఫిర్యాదు పోర్టల్ వైపు ఎన్.సి.హెచ్. మళ్ళిస్తుంది. ఈ విధంగా, వివిధ వేదికల ద్వారా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోంది.
సరోగేట్ (అద్దె గర్భం) ప్రకటనలను నివారించే చర్యల్లో భాగంగా, సి.సి.పి.ఏ. కొంత మంది వాటాదారులకు లేఖలు అందజేసింది. సర్రోగేట్ ప్రకటనల విషయమై, సమాచార, ప్రసార పరిశ్రమలకు చెందిన ప్రకటనల సంస్థలకు కొన్ని నోటీసులు పంపడం జరిగింది. మరిన్ని ఉల్లంఘనలు జరగకుండా, వివిధ పంపిణీ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించని పక్షంలో, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు సి.సి.పి.ఏ. తగిన చర్యలు తీసుకుంటుంది.
***
(Release ID: 1857662)
Visitor Counter : 548