ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌హెచ్‌ఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 7వ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా


ప్రపంచంలో నాలుగు దశల ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉన్న ఏకైక దేశం భారతదేశం. క్షేత్రస్థాయిలో ఉన్న ఆశాలు మనకు క్షేత్రస్థాయిలో ఉన్న శక్తివంతమైన సైనికులు-డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"కేంద్ర, రాష్ట్రాల మధ్య సమర్ధవంతమైన సమన్వయం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అత్యుత్తమ ఫలితాలను తీసుకురాగలదు"

Posted On: 07 SEP 2022 5:23PM by PIB Hyderabad

“కేంద్రం, రాష్ట్రాల మధ్య క్రమబద్ధమైన సమన్వయం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అత్యుత్తమ ఫలితాలను తీసుకురాగలదు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా  అమలు చేయడంలో ఆర్థిక మరియు సాంకేతిక వనరుల ద్వారా రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉంది.." అని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు చెందిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ (ఎంఎస్‌జి) ఏడవ సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా  తెలిపారు. ఎంఎస్‌జి అనేది ఎన్‌హెచ్‌ఎంకు చెందిన అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఈ కార్యక్రమం కింద విధానాలు మరియు ప్రోగ్రామ్ అమలుపై నిర్ణయాలను ఇది తీసుకుంటుంది. ఈ సమావేశానికి హాజరైన సభ్యుల్లో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మరియు నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఉన్నారు. వీరితో పాటు ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ, ఆయుష్,డిఓఎన్‌ఈఆర్‌తో సహా భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖల  కార్యదర్శులు మరియు డబ్ల్యూసిడి, తాగునీరు మరియు పారిశుధ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్యా శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య కార్యదర్శులు మరియు ప్రముఖులు ప్రజారోగ్య నిపుణులు కూడా సమావేశంలో ఈ పాల్గొన్నారు.

 

image.png


అట్టడుగు స్థాయిలో 10 లక్షల మంది బలమైన ఆశా వర్క్‌ఫోర్స్‌తో పాటు నాలుగు దశల ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉన్న ప్రపంచంలోనే ఏకైక దేశం భారతదేశం అని ఈ సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మాండవ్య పేర్కొన్నారు. "మన ఆరోగ్య దళానికి చెందిన ఈ శక్తివంతమైన సైనికులు భారతదేశ కోవిడ్ నిర్వహణ మరియు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు" అని తెలిపారు. అత్యాధునికమైన కమ్యూనిటీలతో కలిసి పనిచేసే ఆరోగ్య కార్యకర్తల ప్రోత్సాహాన్ని బలోపేతం చేయడం వివిధ కార్యక్రమాలకు ఊతమిస్తుందని ఆయన అన్నారు. కాలా అజార్, లెప్టోస్పిరోసిస్ మొదలైన వ్యాధులను సకాలంలో నిర్మూలించడంపై పదునైన దృష్టితో ముందుకు సాగాలని ఆయన నిర్దేశించారు. ఎందుకంటే ఈ వ్యాధులు దేశంలోని పేద కుటుంబాలు మరియు వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

 

image.png


గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో సాధించిన విజయాల గురించి ఎంఎస్‌జికి తెలియజేయబడింది:

- 1.20 లక్షల కంటే ఎక్కువగా ఉన్న ఉప ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్యం & వెల్నెస్ కేంద్రాలు (ఏబి-హెచ్‌డబ్ల్యూసి)  100.8 కోట్ల కంటే ఎక్కువ మందికి సమగ్ర ప్రాథమిక సంరక్షణను అందిస్తున్నాయి.

- ప్రధాన్ మంత్రి జాతీయ డయాలసిస్ ప్రోగ్రామ్ (పిఎంఎన్‌డిపి) కింద 36 రాష్ట్రాలు/యూటీలలోని 615 జిల్లాల్లో 1136 కేంద్రాలలో 7809 హీమో-డయాలసిస్ మెషీన్‌లను ఏర్పాటు చేయడం జరిగింది.

- టిబి కేసుల నోటిఫికేషన్ 2017లో 18.2 లక్షలు ఉండగా 2021 నాటికి 21.35 లక్షలకు పెరిగింది. వారికి పోషకాహారం అందించేందుకు (2018 నుండి) 62.71 లక్షల టిబి రోగులకు రూ.1651.27 కోట్లు (డిబిటి పథకం కింద) పంపిణీ చేయబడ్డాయి.

- 2021లో టిబి చికిత్స రేటు 83%కి చేరుకుంది. ఇది మునుపెన్నడూ లేని విధంగా ఉంది.

- ఆరోగ్యరంగంలో అమలు చేస్తున్న ప్రధాన పథకాలు ఎన్‌హెచ్‌ఏ అంచనాల ప్రకారం 69.4% నుండి 48.8%కి అవుట్-ఆఫ్-పాకెట్-వ్యయాన్ని (ఓఓపిఈ) తగ్గించడానికి దారితీశాయి.

- ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 నివేదిక ప్రకారం 31 రాష్ట్రాలు టిఎఫ్‌ఆర్‌ భర్తీని సాధించాయి.

- రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు మొదలైన (ఆశా వర్కర్లు మినహా) 3.16 లక్షల మానవ వనరులకు ఎన్‌హెచ్‌ఎం మద్దతునిస్తోంది.

- భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్‌) 453 పాయింట్లు తగ్గింది – 1990లో లక్ష సజీవ జననాలకు 556 నుండి 2017-19 నాటికి 103కి (ఎస్‌ఆర్‌ఎస్‌ 2017-19) తగ్గింది.ఎంఎంఆర్‌ ఎస్‌డిజి లక్ష్యాన్ని ఏడు రాష్ట్రాలు సాధించాయి.

- 5 ఏళ్లలోపు మరణాల రేటు (యు5ఎంఆర్‌) 1990లో 1000 సజీవ జననాలకు 126 ఉండగా అది 2019లో 1000 సజీవ జననాలకు 35కి తగ్గింది. ఎనిమిది రాష్ట్రాలు యు5ఎంఆర్‌ ఎస్‌డిజి లక్ష్యాన్ని సాధించాయి.

- మలేరియా కేసులు 11 లక్షల కేసుల నుంచి 48,000కు తగ్గాయి.

గిరిజనులలో సికిల్ సెల్ వ్యాధితో సహా వివిధ ఎజెండా అంశాలను ఎన్‌హెచ్‌ఎం 7వ ఎంఎస్‌జి చర్చించింది. మిషన్ విధానంలో సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జాతీయ టిబి నిర్మూలన కార్యక్రమంపై దృష్టి సారించారు. 2025 నాటికి టిబి నిర్మూలన లక్ష్యాన్ని సాధించాలన్న గౌరవనీయ ప్రధానమంత్రి నిర్దేశానికి అనుగుణంగా 2025 నాటికి టీబీని అంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించబడింది. నేషనల్ అంబులెన్స్ సర్వీసెస్ మరియు మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయులు) ఖర్చు నిబంధనలపై కూడా ఎంఎస్‌జి చర్చించింది.ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూకు చెందిన పలు ఐటీ పోర్టల్స్‌లో ఎబిహెచ్‌ఏ క్రియేషన్ మరియు సీడింగ్ దిశగా ఆశాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. వీటితో పాటు పోషకాహార లోపంపై అవగాహన, పాముకాటు నివారణ మరియు నియంత్రణ సామర్థ్యం గురించి చర్చించింది. ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ ప్రోగ్రామ్ స్థితిని కూడా సమీక్షించింది.

 

image.png

 

కేంద్రీకృత కార్యక్రమాలతో పాటు రాష్ట్రాలకు అందించిన సహకారం ద్వారా ఎన్‌హెచ్‌ఎం సాధించిన పురోగతిని సభ్య కేంద్రమంత్రులు ప్రశంసించారు. రాష్ట్ర ఖజానా నుండి జిల్లాలకు నిధుల ప్రవాహాన్ని మెరుగుపరచడం మరియు పర్యవేక్షించడం; సంచార జాతులు, వీధుల్లో నివాసించేవాళ్లు, వివిధ దివ్యాంగులు వంటి వారిని పిఎం-జేఏవై పథకంలో చేర్చడం; ఆరోగ్య సదుపాయాలలో సాంకేతిక నిపుణులు మరియు పారామెడికల్‌ల ఖాళీల భర్తీని వేగవంతం చేయడం; యంత్రాంగాలను ప్రోత్సహించడం; సకాలంలో సరిపోలే నిధుల కేటాయింపు కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం వంటి అనేక సూచనలు అందించబడ్డాయి

నేటి ఎంఎస్‌జీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్య సంరక్షణకు చెందిన ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ స్థాయిలలో ఆరోగ్య సంరక్షణ సేవలను బలపరుస్తాయని డాక్టర్ మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. ఇది పౌరులకు సమానమైన, సరసమైన & నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రజల అవసరాలను తీర్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలు మరియు సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.


 

****


(Release ID: 1857659) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Marathi , Hindi