వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ‘చునార్ లాజిస్టిక్ పార్క్’ శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్
‘చునార్ లాజిస్టిక్ పార్క్’ చునార్ మరియు సమీప ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. - శ్రీమతి అనుప్రియ పటేల్
స్థానిక ఎగుమతి, దిగుమతిదారుల వ్యాపారుల అవసరాలను తీర్చడంతోపాటు, స్థానిక కార్పెట్ మరియు హస్తకళల పరిశ్రమల అవసరాలను తీరుస్తుంది.- శ్రీమతి అనుప్రియ పటేల్
Posted On:
05 SEP 2022 5:22PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, శ్రీమతి అనుప్రియ పటేల్ యూపీలోని చునార్ మరియు పరిసర ప్రాంతాల ప్రజల అభివృద్ధికి 'చునార్ లాజిస్టిక్స్ పార్క్' మార్గం సుగమం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీలోని మీర్జాపూర్ 'చునార్ లాజిస్టిక్స్ పార్క్' శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. రైల్వేలు, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీమతి. అనుప్రియ పటేల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిరంతరం సహకారం అందిస్తున్నందుకు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌కు పటేల్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
చునార్, మీర్జాపూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలోని కార్పెట్ మరియు హస్తకళా పరిశ్రమలు జాతీయ స్థాయిలోనే కాకుండా, వాటి ప్రత్యేకత మరియు నాణ్యతతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయని పేర్కొన్న శ్రీమతి పటేల్ తెలిపారు. ప్రస్తుతం అత్యాధునిక 'చునార్ లాజిస్టిక్స్ పార్క్' ఇందుకోసం సేవలను అందిస్తుందని ఉద్ఘాటించారు. వారి ఎగుమతి, దిగుమతి మరియు దేశీయ వాణిజ్య అవసరాల కోసం స్థానిక ఎగుమతిదారులు, దిగుమతిదారులు మరియు వ్యాపారుల అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాల వ్యాపార అవసరాలను తీరుస్తుందని పేర్కొన్న మంత్రి, ప్రభుత్వ వివిధ పథకాల క్రింద ఎగుమతులు మరియు దిగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, సహాయం అందిస్తుందని చెప్పారు.
లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు వల్ల ఉపాధి కల్పన కూడా గణనీయంగా పెరుగుతుందని మంత్రి అనుప్రియ పటేల్ ఉద్ఘాటించారు. రైలు సరకు రవాణాను ప్రోత్సహించడంలో మరియు లాజిస్టిక్స్ ఖర్చు మరియు రవాణా సమయాన్ని తగ్గించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. తద్వారా స్థానిక కార్పెట్ మరియు హస్తకళల పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ఈ ప్రాజెక్టు కింద తొలుత 400 కంటైనర్ల సౌకర్యాన్ని అభివృద్ధిపర్చనున్నట్లు తెలిపారు. 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్గో నిల్వ, నిర్వహణ కోసం గోడౌన్‌లను ఏర్పాటు చేస్తామని శ్రీమతి పటేల్ తెలియజేశారు. ఈ సదుపాయంలో 24 గంటల సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక కంటైనర్ నిర్వహణ పరికరాలు ఉంటాయన్నారు. వాణిజ్యం మరియు పరిశ్రమల అవసరాల ఆధారంగా మరియు వాణిజ్య సాధ్యతను దృష్టిలో ఉంచుకుని, లాజిస్టిక్స్ పార్క్‌లోని సేవలను దశలవారీగా విస్తరిస్తామని ఆమె తెలిపారు.
చునార్ మరియు సమీప ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో 'చునార్ లాజిస్టిక్స్ పార్క్' ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
****
(Release ID: 1857026)
Visitor Counter : 140