ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ రాన్సమ్‌వేర్ ఇనిషియేటివ్- రెసీలియన్స్ వర్కింగ్ గ్రూప్ లో భాగంగా 13 దేశాలకు సైబర్ భద్రతా ప్రయోగం సినర్జీని నిర్వహించిన సిఇఆర్‌టి-ఐఎన్
రాన్సమ్‌వేర్ & సైబర్ దోపిడీ దాడులకు వ్యతిరేకంగా పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు సభ్య దేశాల మధ్య ఉత్తమ ఆచరణలను ఇచ్చిపుచ్చుకోవడమే సినర్జీ ప్రయోగ లక్ష్యం
సింగపూర్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సహకారంతో ప్రయోగాన్ని నిర్వహించిన సిఇఆర్‌టి - ఐఎన్
Posted On:
31 AUG 2022 4:31PM by PIB Hyderabad
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియేట్ (ఎన్ఎస్‌సిఎస్- తీయ భద్రతా మండలి సెక్రటేరియేట్) నాయకత్వంలో అంతర్జాతీయ రాన్సమ్‌వేర్ ఇనిషియేటివ్- రెసీలియన్స్ వర్కింగ్ గ్రూప్ లో భాగంగా 13 దేశాలకు సైబర్ భద్రతా ప్రయోగం సినర్జీని భారత ఎలక్ట్రానిక్స్ & ఐటి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సిఇఆర్‌టి- ఐఎన్), సైబర్ సెక్యూరిటాఈ ఏజెన్సీ ఆఫ్ సింగపూర్ (సిఎస్ఎ) సహకారంతో విజయవంతంగా రూపొందించి, బుధవారం నిర్వహించింది.
ఈ ప్రయోగ ఇతివృత్తం రాన్సమ్‌వేర్ దాడులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్మించడం. ఈ ప్రయోగానికి దృశ్య వివరణను వాస్తవ సైబర్ ఘటనల నుంచి తీసుకున్నారు. దేశీయ స్థాయి (పరిమిత ప్రభావం) రాన్సమ్‌వేర్ సంఘటన ప్రపంచ సైబర్ భద్రతా సంక్షోభానికి దారి తీసిన ఘటనను తీసుకున్నారు.
సినర్జీని సిఇఆర్‌టి- ఐఎన్ తన ప్రయోగ సిమ్యులేషన్ (కృత్రిమ వాతావరణ) వేదికపై ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. జాతీయ సిఇఆర్‌టిలు/ సిఎస్ఐఆర్‌టిలు, భద్రతా ఏజెన్సీలు, సహా వివిధ ఏజెన్సీల నుంచి కూర్పుతో ఏర్పడిన జాతీయ క్రైసిస్ మేనేజ్‌మెంట్ బృందంగా ప్రభుత్వ రాష్ట్రం పాల్గొన్నది.
ఈ ప్రయోగం నిర్ధిష్ట లక్ష్యం అంచనా వేయడం, పంచుకోవడం, వ్యూహాలను, సభ్య రాష్ట్రాల ఆచరణను మెరుగుపరిచి రాన్సమ్‌వేర్ & సైబర్ దోపిడీ దాడులకు వ్యతిరేకంగా బలమైన నెట్‌వర్క్ ను నిర్మించడం.
తన లక్ష్యాలను నెరవేర్చడమే కాక, సిఆర్ ఐ సభ్య రాష్ట్రాలు రాన్సమ్ దాడులను ఎదుర్కొనేందుకు, బలమైన నెట్‌వర్క్ నిర్మించడం కోసం మెరుగైన సహకారానికి అంతర్ దృష్టని అందించింది.
***
(Release ID: 1855880)
Visitor Counter : 190